Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 12th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: కార్మికుల కుట్ర వెనక ఉంది అంబికని తెలుసుకున్న లక్ష్మీ! కోర్టులో సంచలన ట్విస్ట్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Sep 12th లక్ష్మీ సాక్ష్యాల కోసం పరుగులు పెట్టడం కార్మికులు చనిపోలేదని సుభాష్, అంబికలే అంతా చేయించారని తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీ వాళ్లతో మాట్లాడి లక్ష్మీని వెళ్దామని అంటే లక్ష్మీ చారుకేశవతో వెళ్లిపోతుంది. విహారి ఫీలవుతాడు. ఉదయం విహారి, సహస్ర, చారుకేశవ, లక్ష్మీ, అంబిక కోర్టుకి వస్తారు. సాక్ష్యాలు దొరకలేదని లక్ష్మీ అంటుంది. నీ వల్ల ఎక్కువ శిక్ష పడేలా ఉందని అంబిక అంటే దానికి చారుకేశవ తాను ఆ మాత్రం అయినా ప్రయత్నించింది.. నువ్వు అది చేయలేదు అని చారుకేశవ అంటాడు.
కేసు హియరింగ్‌కి వెళ్తుంది. లక్ష్మీ సాక్ష్యాలు దొరకలేదు కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయని అవి నేనే అడుగుతానని అంటుంది. జడ్జి సెల్ఫ్ డిఫెన్స్‌కి ఒకే అంటారు. లక్ష్మీ చనిపోయిన కార్మికుడి భార్య సుగుణని బోనులోకి పిలిచి మీకు ఆస్తులు ఉన్నాయా అని అడుగుతుంది. దానికి సుగుణ ఆయనకు వచ్చే డబ్బే మాకు సరిపోదు.. అని అంటుంది. దానికి లక్ష్మీ మరి మీ ఇంట్లో మూడు బియ్యం బస్తాలు ఎలా ఉన్నాయి.. అని అంటుంది. చాలీ చాలని జీతం వచ్చే వారి ఇంట్లో అన్ని రకాల సరుకులు ఎలా ఉన్నాయి.. వాళ్లు ఏదో దాస్తున్నారు అని లక్ష్మీ అంటుంది. దానికి పీపీ అందరూ సైలెంట్‌గా ఉన్నారు. నువ్వు మాత్రం మాట్లాడుతున్నావ్.. నువ్వు విహారి పర్సనల్‌వా అని అనడంతో విహారి లాయర్ మీదకు వెళ్లి కాలర్ పట్టుకుంటాడు.
జడ్జి రూల్స్ బ్రేక్ ఇచ్చినందుకు విహారికి బేడీలు వేయమని అంటుంది. లక్ష్మీ టైం అడగటంతో ఈ రోజు సాయంత్రం వరకు టైం ఇస్తారు. లక్ష్మీ ఏదో ఒకటి చేస్తానని చెప్పి బయటకు వెళ్తుంది. అంబిక టెన్షన్‌గా సుభాష్‌కి కాల్ చేస్తుంది. తీర్పు ఇవ్వకుండా సాయంత్రం వరకు టైం ఇచ్చారని నువ్వు అలర్ట్‌గా ఉండు లక్ష్మీ సాక్ష్యాలకోసం వస్తుంది. దాన్ని ఏం చేసినా పర్లేదు ఆపు అవసరం అయితే చంపేయ్ అంటుంది.
లక్ష్మీ కార్మికులు చనిపోలేదని నా నమ్మకం అని కార్మికుల ఇంటికి వెళ్తుంది. ఇంటి ముందు లక్ష్మీకి లాడ్జి తాళాలు దొరుకుతాయి. అక్కడికి వెళ్లి చూసే సరికి చనిపోయార అనుకున్న కార్మికులు బతికే ఉండటం చూసి షాక్ అయిపోతుంది. మందు తాగుతూ చిందులు వేస్తున్న వాళ్ల దగ్గర సుభాష్‌ని చూసి షాక్ అయి ఇదంతా చేసింది అంబికమ్మ అని బిత్తరపోతుంది. లక్ష్మీ మొత్తం వీడియో తీస్తుంది. లక్ష్మీ వీడియో తీయడం సుభాష్ చూస్తాడు. రౌడీలతో లక్ష్మీని వెంబడిస్తాడు. రౌడీలతో లక్ష్మీ పోరాడుతుంది. కానీ సుభాష్ లక్ష్మీ తల మీద కర్రతో కొట్టేయడంతో లక్ష్మీకి దెబ్బ తగిలి కళ్లు తిరిగిపడిపోతుంది. ఫోన్ బయట పడిపోతుంది. సుభాష్‌లక్ష్మీని తీసుకురమ్మని చెప్తే ఆ దెబ్బకి చనిపోయింటుందని రౌడీలు చెప్పడంతో సుభాష్ వదిలేసి వెళ్లిపోతాడు.
సమీపంలో శివలింగాని ఓ తల్లీకూతురు పూజ చేస్తారు. పాప ఆడుకుంటూ లక్ష్మీని చూసి తల్లిని పిలుస్తుంది. ఆవడ లక్ష్మీని చూసి లేపుతుంది. లక్ష్మీ థ్యాంక్స్ చెప్పి ఫోన్ కోసం వెతుకుతుంది. పాపకి ఫోన్ దొరకడంతో లక్ష్మీ పరుగులు పెడుతుంది. తల మొత్తం గాయాలు కావడంతో హాస్పిటల్‌కి వెళ్దాం అన్నా వద్దు అని పరుగులు పెడుతుంది. కోర్టులో వాదనలు మొదలవుతాయి. కోర్టు టైం వృథా చేస్తున్నారు తీర్పు ఇచ్చేయండి అని పీపీ అంటారు. జడ్జి తీర్పు ఇచ్చేస్తానని చెప్పి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని విహారి, లక్ష్మీ, చారుకేశవలకు జీవిత ఖైదు వేసేటైంకి లక్ష్మీ గాయాలతో వచ్చి ఒక్క నిమిషం అని అంటుంది. పరుగున బోనులోకి వెళ్తుంది. లక్ష్మీ పరిస్థితి చూసి అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















