Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 10th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విడాకుల మలుపు: లక్ష్మీ-విహారి కేసులో ట్విస్ట్! కార్మికుల కేసులో ఏం జరగబోతుంది?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Sep 10th లక్ష్మీ కేసులో లీడింగ్ పాయింట్‌తో చారకేశవకి బెయిల్ ఇప్పించి కేసులో కీలక విషయాలు నిరూపిస్తానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ విడాకులు కావాలి అంటే విహారి విడాకులు ఇవ్వొద్దని అంటాడు. దానికి జడ్జి లక్ష్మీతో నువ్వు నీ భర్తతో విడిపోవాలని అంటున్నావ్.. నీ భర్త వద్దు అంటున్నాడు.. ఇప్పుడు నేను విడాకులు ఇవ్వలేను.. శుక్రవారం వెంకటేశ్వర స్వామి గుడికి రండి ఆ తర్వాత నీ తీర్పు ఇస్తాను అని జడ్జి గారు చెప్తారు.
యమున లక్ష్మీ, విహారిల విడాకులు మేటర్ ఏమైందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో యమున తన అంతరాత్మతో మాట్లాడుతుంది. అంతరాత్మ యమునతో నీలో జాలి దయ ఏం లేకుండా భయంతో ఎంతో అభిమానించే లక్ష్మీకి నువ్వే శత్రువు అయి నీ కొడుకుతో విడాకులు ఇప్పిస్తున్నావ్ అని అంటుంది. దానికి యమున అలా చేయకపోతే నా కుటుంబం ఏమైపోతుంది అని అంటుంది. నా కుటుంబం అంటున్నావ్.. ఎప్పుడైనా వాళ్లు నీకు ఓ మనిషిగా అయినా చూశారా.. అప్పుడు నీకు అండగా ఉంది ఈ లక్ష్మీనే. నీ కొడుకు సహస్రతో ఉంటే బాగుంటాడు అనుకుంటున్నావ్.. సహస్ర, లక్ష్మీలో ఎవరు మంచోళ్లు అని అంటుంది. దానికి యమున ఇద్దరూ మంచోళ్లే అంటారు. నువ్వు కి అన్యాయం చేస్తున్నావ్ అని అంతరాత్మ అంటే లేదు జరిగిన తప్పు సరిదిద్ది లక్ష్మీ జీవితం సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తుంది.
లక్ష్మీ యమునకు కాల్ చేసి జరిగింది చెప్తుంది. తర్వాత కార్మికుల కేసు కోర్టులో మొదలవుతుంది. జడ్జి ముందు కార్మికుల కేసు గురించి చెప్పి సిమెంట్ కల్తీది వాడారని చెప్తారు. బాధిత కుటుంబాలను చూపిస్తారు. విహారి గ్రూఫ్ ఆఫ్ కంపెనీలు నిర్లక్ష్యం వహించాయని చెప్తారు. వాదోపవాదనలు జరుగుతాయి.
విహారి బోనులోకి వెళ్తాడు. కల్తీ సిమెంట్ వాడలేదని విహారి అంటాడు. ప్రమాదం జరగడం నిజమే నా కార్మికులు చనిపోవడం నిజమే కానీ మేం కల్తీ సిమెంట్ వాడలేదని అంటాడు. దానికి కార్మికుల నేత సింహాద్రిని పిలుస్తారు. కార్మికుల చనిపోవడానికి కల్తీ సిమెంటే కారణం మేం కొన్ని గుర్తిస్తాం కానీ చెప్పలేం అని విహారి వాళ్లకి వ్యతిరేకంగా చెప్తాడు. వాదాపవాదనలు తీవ్రంగా కొనసాగుతాయి. అన్నీ విహారి కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉంటాయి. విహారి కంపెనీ లాంటి బోగస్ కంపెనీలను మూయించి చనిపోయిన వాళ్లకి కోటి నష్టపరిహారం ఇప్పించేలా తీర్పు ఇవ్వాలని పీపీ కోరుతారు.
లక్ష్మీ మా కంపెనీలు బోగస్ కాదు జడ్జి గారు అని అంటుంది. ఏం మాట్లాడాలి అన్నా బోనులో మాట్లాడాలి అని జడ్జి చెప్పడంతో లక్ష్మీ వెళ్లి భగవద్గీత మీద ప్రమాణం వేస్తుంది. తాను విహారి కంపెనీలకు ఎండీ అని తమ క్వాలిటీ సర్వీస్‌కి ఐఎస్‌ఐ మార్క్ కూడా గవర్నమెంట్ ఇచ్చిందని లక్ష్మీ చూపిస్తుంది. విహారి గారు కార్మికులకు ఎప్పుడూ బాగా చూసుకునే వారు. ఇప్పుడు మా దగ్గర నుంచి కోటి డిమాండ్ చేస్తున్నారు కానీ విహారి గారు కార్మికులకు చేసిన ఇన్సూరెస్స్ అప్లే చేస్తే కోటి వస్తుంది. కానీ అది వాళ్లు అప్లై చేయలేదు అని లక్ష్మీ అంటుంది. కోటి ఇన్సూరెస్సా ఏ యజమాని ఇంత ఇన్సూరెస్స్ చేయరు కదా అని జడ్జి అంటే.. అక్కడే మా విహారిగారి కార్మికుల్ని ఎంత బాగా చూసుకుంటారో తెలుస్తుంది కదా.. ఆ ఇన్సూరెస్స్ ఇన్‌స్టెంట్ అంతా చాలా అనుమానాస్పందంగా ఉంది అని అంటుంది.
పీపీ అడ్డుకోవాలని చూస్తే జడ్జి ఆపేస్తారు. కోటి ఇన్సూరెన్స్ అప్లై చేయకపోవడమే కాదు.. ఇన్ని రోజులు అయినా డెట్ సర్టిఫికేట్‌లు తీసుకోలేదు.. డెట్ సర్టిఫికేట్‌లు తీసుకుంటే కదా ఇన్సూరెస్స్ వస్తుంది. ఇవేమీ చేయలేదు అంటే ఏదో అనుమానంగా ఉంది.. మాకు గడువు ఇవ్వండి అని లక్ష్మీ అడగటంతో ఒక్క రోజు గడువు ఇస్తారు. చారుకేశవకి బెయిల్ ఇస్తారు.
అంబిక సుభాష్ లాయర్ల దగ్గరకు వెళ్లి తిడుతుంది. ఆ లక్ష్మీ మామూలుది కాదు అని మీరు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల విహారికి శిక్ష పడకుండా అయిపోతుందని అంటుంది. లక్ష్మీ చనిపోయిన వాళ్ల ఇళ్ల దగ్గరకు వెళ్లి కూపీ లాగుతుంది వాళ్లతో జాగ్రత్త అంటుంది. దానికి సుభాష్ చనిపోయారు అని మనం చెప్పిన వాళ్లు జాగ్రత్తగా ఉన్నారు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















