Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 6th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: పతనం దిశగా విహారి కంపెనీ: లక్ష్మీ సంచలన నిర్ణయం! అంబిక కుట్ర, చివరికి ఏమైంది?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode September 6th అంబిక ప్లాన్ చేసి ధర్మా దగ్గరకు వెళ్లి రాళ్లతో కొట్టించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి కంపెనీలో మరో చోట ఫుడ్ పాయిజిన్ అయి కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురవుతారు. విహారి కుప్పకూలిపోతాడు. లాయర్ వాళ్లు మేం ఏం చేయలేం అనేస్తారు. ఇక విహారి ఆ సైట్‌కి వెళ్తానని అంటే అందరూ విహారిని ఆపుతారు. ఈ సమస్య తీరే వరకు బయటకు వెళ్లొద్దని అంటారు.
అంబిక మనసులో ఒక దెబ్బ తగిలితే కోలుకోలేని స్థితిలో మరో దెబ్బ తగిలితేనే నేను నా సామ్రాజాన్ని దక్కించుకుంటా అనుకుంటుంది. ఇక అంబిక సుభాష్‌కి కాల్ చేసి వెంటనే కార్మికులు, కార్మిక నాయకుల చేత ప్రెస్ మీట్ పెట్టించి విహారి మీద లక్ష్మీ మీద నెగిటివిటీ వచ్చేలా చేయమని అంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేయమని అంటుంది. సుభాష్ కొంత మందికి డబ్బులు ఇచ్చి మరి కొందరికి మందు, బిర్యాని ఇచ్చి ఉంచుతాడు. ఆ నలుగురికి తలా కోటి ఇస్తాను అని వేరే చోటుకి వెళ్లమని చెప్తాడు.
విహారి కంపెనీలు పతనం వైపు వెళ్తున్నాయని మీడియాలో న్యూస్ వస్తుంది. అందరూ చాలా బాధ పడతారు. విహారికి బోర్డు మెంబర్స్ కాల్ చేసి మీటింగ్ ఏర్పాటు చేయమని అంటారు. ఏం చేయలేని పరిస్థితికి విహారి వచ్చేశాడని అంబిక నువ్వుకుంటుంది. విహారి ఇంటి దగ్గర కార్మికులు ధర్మా చేస్తుంటే మీడియా మొత్తం వీడియోలు టెలికాస్ట్ చేస్తారు. బోర్డు మెంబర్స్ వచ్చి మన కండీషన్ డూ ఆర్ డై అయిపోయిందని అంటారు. దాంతో విహారి నా వల్లే ఇదంతా అయింది కాబట్టి నేను ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటా అని అంటాడు.
ఇంటి బయట గోల ఎక్కువ కావడంతో అందరూ బయటకు వస్తారు. విహారి మీడియాతో మాట్లాడుతా అంటే లక్ష్మీ ఆపి జరిగిన దానికి తాను బాధ్యత వహిస్తానని మా కంపెనీలు ఇలాంటి పరిస్థితికి రావడానికి ఎవరో కుట్ర చేస్తున్నారని.. వీటి వెనక ఎవరు ఉన్నారో మీకు త్వరలోనే తెలిసేలా చేస్తామని.. అప్పటి వరకు మా ఛైర్మన్, నేను అందరూ పదవి నుంచి తప్పుకుంటామని అంటారు.
విహారి లక్ష్మీతో నువ్వేం చేశావ్ లక్ష్మీ.. నువ్వు బాధ్యత వహిస్తా అంటే ఏం అవుతుందో తెలుసా.. నీకు ఏమైనా అయితే ఎలా.. అలా ఎలా చెప్తావ్.. ఏమైనా తేడా జరిగితే జైలు శిక్ష పడుతుంది తెలుసా అని విహారి అడిగితే దానికి లక్ష్మీ మీరు బయట ఉండాలి మీరు బయట ఉంటే నాలాంటి వాళ్లు ఎంతో మంది బాగుంటారని లక్ష్మీ అంటుంది. దానికి విహారి నువ్వు విడాకులు ఇస్తేనే వద్దు అన్నాను ఇప్పుడు నువ్వు నా వల్ల ప్రమాదంలో పడితే ఎలా అంటాడు. ఇంతలో వసుధ వచ్చి చారుకేశవ దగ్గరకు వెళ్దాం అంటుంది.
లక్ష్మీ, విహారి, చారుకేశవ వెనక దారిలో జైలుకి వెళ్తారు. చారుకేశవతో మాట్లాడుతారు. త్వరలోనే బయటకు తీసుకొస్తానని విహారి అంటాడు. ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోమని చారుకేశవ అంటాడు. భర్తని చూసి వసుధ ఏడుస్తుంది. లక్ష్మీ చారుకేశవతో విహారి వాళ్లు చూడకుండా చారుకేశవ కొట్టి జాబ్ నుంచి తీసేసిన వాడి ఫొటో చూపిస్తుంది. ఈ ధర్మాలో వీడు ఉన్నాడని అంటుంది. విహారిని కంపెనీలను నువ్వే కాపాడుకోవాలమ్మా అని చారుకేశవ చెప్తాడు.
అంబిక ధర్మా చేస్తున్న వాళ్లకి నేను ఇప్పుడు బయటకు వస్తాను.. బాగా గోల చేసి నన్ను రాళ్లతో కొట్టు అని అంటుంది. ఇంట్లో అందరితో ధర్మా ఆపించాలని చెప్పి మన కార్మికులతో మాట్లాడుతా అని చెప్పి వెళ్తానని అంటుంది. అందరూ వద్దని చెప్పినా వినకుండా వెళ్తుంది. యమున కూడా వెళ్తుంది. ఇద్దరూ సైలెంట్‌గా ఉండమని అంటారు. ఇంతలో అంబిక చెప్పిన వ్యక్తి రాయి ఇచ్చి అంబికను కొడతాడు. అంబికని యమున లోపలికి తీసుకెళ్లి వెంటనే విహారికి కాల్ చేస్తానని అంటుంది. ఇక పోలీస్ స్టేషన్ బయట విహారి కనకం చేయి పట్టుకుంటే కానిస్టేబుల్ వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















