Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 29th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: సహస్ర, విహారిలు కలిసిపోయారా! లక్ష్మీ కోడలని చెప్పాలనుకున్న యమునకు షాక్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 29th విహారి తాగిన మత్తులో సహస్రని లక్ష్మీ అనుకొని సహస్రతో కలిసిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకానికి చూపు పోవడంతో నీరు తాగడానికి ప్రయత్నించి గ్లాస్ కింద పడి పగిలిపోయి ముక్కలు కాలికి తగిలి రక్తం వస్తుంది. విహారి లక్ష్మీ దగ్గరకు వెళ్లి నీరు తాగిస్తాడు. కింద పడిన గాజు పెంకుల ముక్కలు తీస్తాడు. ఇక లక్ష్మీ కాలికి గాయం చూసి చూడు లక్ష్మీ ఎలా రక్తం వస్తుందో అంటాడు.
లక్ష్మీ ఏడుస్తూ చూసుకోవడానికి నాకు కళ్లు కనిపించాలి కదా విహారి గారు అని అంటుంది. విహారి ఎమోషనల్ అవుతాడు. వసుధమ్మ వస్తే తనతో పసుపు రాయించుకుంటాను తగ్గిపోతుంది అని అంటుంది. నేనే కట్టు కడతా అని విహారి అంటాడు. ఇంతలో యమున లక్ష్మీ దగ్గరకు వచ్చి లక్ష్మీ కాలిని చూస్తుంది. లోపలికి రాబోయి విహారి అక్కడ ఉండటం చూసి లోపలికి రాకుండా బయట నుంచి చూస్తుంది.
విహారి లక్ష్మీ కాలు పట్టుకొని గాయానికి కట్టు కడతాడు. మీరు నా కాలు పట్టుకోవద్దు వదిలేయండి అని లక్ష్మీ అంటుంది. కనకం నాకు ఈ పని అయినా చేయనివ్వు నువ్వు నాకు ఎన్నో సేవలు చేశావు ఎంతో సాయం చేశావు అని అంటాడు. విహారి తన మనసులో బాధ ఎవరికీ చెప్పుకోకుండా మథన పడిపోతున్నాడు అని యమున అనుకుంటుంది. లక్ష్మీ విహారితో నేను మళ్లీ చూడగలనా ఇలాగే ఉండిపోతానా అని ఏడుస్తుంది. మూడు రోజుల తర్వాత మళ్లీ చూస్తావ్ అని విహారి అంటే నాకు మళ్లీ చూపు రాదు అనిపిస్తుంది. నేను ఇంకెప్పటికీ మీ అందర్ని చూడలేను అనిపిస్తుందని.. నాకు చచ్చిపోవాలి అని ఉంది అని లక్ష్మీ ఏడుస్తుంది. విహారి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. యమున కూడా బాధ పడుతుంది.
విహారి లక్ష్మీని హగ్ చేసుకొని ఏడుస్తాడు. ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. యమున మనసులో ఈ పరిస్థితిలో లక్ష్మీ కష్టాలు అనుభవించడానికి లేదు.. రేపు అందరితో లక్ష్మీ ఈ ఇంటి కోడలు అని చెప్పేస్తా అదే నేను లక్ష్మీకి చేసే న్యాయం అని అనుకుంటుంది. తర్వాత సహస్రని చూసి లక్ష్మీ న్యాయం చేస్తే సహస్ర పరిస్థితి ఏంటి అని అనుకుంటుంది. సహస్రకి ఎలాంటి న్యాయం చేయాలి అన్నా ఆ దేవుడే చూసుకుంటాడు అని అనుకుంటుంది. సహస్ర దగ్గరకు వెళ్లి సహస్ర అనగానే బావ కోసం వచ్చారా బావ లేడు అని అంటుంది. లక్ష్మీ గురించి మీరు చాలా ఫీలవుతున్నారు.. డాక్టర్ తనకి పూర్తిగా చూపు ఉండదు అనలేదు కదా మీరు ఫీలవ్వొద్దు అని అంటుంది.
ఇంతలో సహస్ర కడుపు నొప్పి అని బాధ పడుతుంది. యమున చూసి ఏమైంది అంటే యాక్సిడెంట్ అయినప్పటి నుంచి అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది అయినా కొద్ది సేపే కదా పర్లేదు అని సహస్ర అంటుంది. యమున మనసులో రేపు నేను చెప్పే మాటకు నువ్వు ఎంత బాధ పడతావో అని అనుకుంటుంది. విహారి తాగి ఇంటికి వస్తాడు. సహస్ర విహారితో ఎందుకు తాగి వచ్చావ్ బావ అని అంటుంది. విహారి సహస్ర మీద చిరాకు పడతాడు. నా బాధలు నీకే కాదు ఎవరికీ తెలీదు అని అంటాడు. అంత అర్థం కాని బాధలు ఏంటి బావ అని సహస్ర అంటే లక్ష్మీ చూపు రాదు అని డాక్టర్ చెప్తారు అని అంటాడు. లక్ష్మీ కోసం అంత బాధ పడుతున్నావ్ కానీ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం ఇలా ఫీలయ్యావా అంటే నీకోసం కంగారు పడ్డాను అని అంటాడు. కానీ మనవాళ్లకి ఏమైనా అయితే భరించరాని బాధ అనుభవిస్తాం నీ విషయంలో లక్ష్మీ విషయంలో అదే తేడా అని అంటాడు.
సహస్రని చూసే టైంకి లక్ష్మీలా కనిపిస్తుంది. దాంతో విహారి వెళ్లి హగ్ చేసుకుంటాడు. సహస్ర షాక్ అయిపోతుంది. లక్ష్మీ నువ్వు ఇలా నాకు ఎప్పటికీ దగ్గరగా ఉండొచ్చు కదా.. నీ దగ్గరకు వస్తే నాకు సహస్ర నీ భార్య అని అంటావ్ అని అంటాడు. సహస్ర మనసులో బావ నన్ను లక్ష్మీ అనుకున్నాడా అని చిరాకు పడుతుంది. ఇక తర్వాత విహారిని బెడ్ మీద పడుకోపెట్టి డోర్ లాక్ చేస్తుంది. ఆ టైంలో విహారి తెలీకుండా ఫోన్‌లో వీడియో రికార్డ్ ఆన్ చేసేస్తాడు.
యమున ఉదయం అందరికీ లక్ష్మీనే తన కోడలు అని చెప్పాలి అనుకుంటుంది. లక్ష్మీని తీసుకొని వస్తుంది. అందరినీ హాల్‌లోకి పిలుస్తుంది. అందరూ వస్తారు కానీ విహారి, సహస్ర లేకపోవడంతో వాళ్లని లేపడానికి వెళ్తారు. యమున డోర్ కొట్టగానే సహస్ర విహారి ముఖం మీద ముద్దు మార్క్‌లు పెడుతుంది. తను కూడా ఇద్దరి మధ్య ఏదో జరిగినట్లు బయటకు వచ్చి సిగ్గు పడుతుంది. యమున సహస్రని చూసి షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















