Nindu Manasulu Serial Today October 29th: నిండు మనసులు: సిద్ధూలో ఊహించని మార్పు ప్రేరణ వల్లేనా! ప్రేరణ, సిద్ధూలను చూసి ఫిదా అవ్వాల్సిందే!
Nindu Manasulu Serial Today Episode October 29th దీపావళి వేడుకకు చీరలో ఇంటికి వచ్చిన ప్రేరణను చూసి సిద్ధూ ఫిదా అయిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ ఇంట్లో దీపావళి వేడుకలు మొదలవుతాయి. విజయానంద్ పండగ కోసం సిద్ధూ, సాహితి కోసం పట్టు బట్టలు తీసుకొస్తాడు. నా పిల్లల కోసం పట్టు బట్టలు అని విజయానంద్ విశ్వాసంతో చెప్తాడు. మీరు ఇస్తే సిద్ధూ బాబు తీసుకోడు కదా సార్ అంటే అందుకే తీసుకొచ్చా పండగ రోజు వాడు పాత బట్టలు కట్టుకోవాలి నేను ఇస్తే తీసుకోడు.. నేను అవును అంటే వాడు కాదు అంటాడు అందుకే స్వయంగా నేనే తీసుకొచ్చా అని చెప్తాడు. ఏం ప్లాన్ సార్ మీది సూపర్ అని విశ్వాసం అంటాడు. 
విజయానంద్ సాహితిని పిలిచి బట్టలు ఇస్తాడు. అన్నయ్యకి నేను ఇస్తా అని సాహితి అంటే వద్దులే నేనే ఇస్తా అని విజయానంద్ అంటాడు. మంజుల వచ్చి బ్యాగ్ ఏంటి అంటే సిద్ధూకి పట్టు బట్టలు కొన్నాను అంటాడు. అవునా మీరే స్వయంగా ఇవ్వండి అని అంటుంది. నాకు అంత అదృష్టం లేదు నేను ఇస్తే వాడు తీసుకోడు.. నా వల్ల వాడు బాధ పడటం నాకు ఇష్టం లేదు అని అంటాడు. మీ కోసం నేను వాడికి ఇస్తాను అని అంటుంది. వాడు కాదు అంటే నువ్వు బాధ పడొద్దు అని విజయానంద్ చెప్తాడు. 
మంజుల సిద్ధూ దగ్గరకు వెళ్లి నాన్న నీ కోసం పట్టు బట్టలు తీసుకొచ్చారు ఇవి వేసుకో నాన్న అని ఇస్తుంది. విజయానంద్ తీసుకొచ్చాడని కోపంగా ఉన్న సిద్ధూ ఆ విషయం చెప్పకుండా ట్రెడీషనల్ డ్రస్‌లు నాకు సెట్ అవ్వవు అని అంటాడు. నువ్వు ఈ డ్రస్ వేసుకుంటే మేం చాలా సంతోషిస్తాం కనీసం గంట అయినా వేసుకో నాన్న అని డ్రస్ ఇచ్చేసి వెళ్లిపోతుంది. సిద్ధూ ఆలోచిస్తూ దాన్ని బట్టలు పడేస్తాడు. 
సిద్ధూ నో చెప్పుంటాడని విజయానంద్ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. మంజుతో వాడికి నేను నచ్చను.. నా ప్రేమ నచ్చదు.. నేను ఇవ్వాలి అనుకున్న స్టేటస్ నచ్చదు అంతా నా దురదృష్టం అని మొసలికన్నీరు కార్చుతాడు. 
ఇంతలో సిద్ధూ విజయానంద్ తీసుకొచ్చిన పట్టు బట్టల్లో వస్తాడు. మంజుల చాలా హ్యాపీగా ఫీలవుతుంది. విజయానంద్ బిత్తరపోయి వీడేంటి ఇంత షాక్ ఇచ్చాడు అని అనుకుంటాడు. సిద్ధూ తల్లితో ఈ బట్టల్లో ఎలా ఉన్నాను అని అడుగుతాడు. నీకేంట్రా నువ్వు యువరాజు అని మంజు అంటుంది. విజయానంద్ ముఖం మాడిపోతుంది. ఏం అనలేక చాలా అందంగా ఉన్నాడు అని విజయానంద్ అంటాడు. వీడిలో చాలా మార్పు వచ్చింది అండీ.. మీ మనసుని అర్థం చేసుకున్నాడు కాబట్టి మీరు తెచ్చిన బట్టలు వేసుకున్నాడు.. మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఇక నుంచి ఏదేదో ఊహించుకోవద్దు అని అంటుంది. 
విజయానంద్‌తో సిద్ధూ నీకు ఇది పెద్ద షాక్ అని నాకు తెలుసు.. నువ్వు ఇచ్చిన బట్టలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు కనీ మా అమ్మ సంతోషం కోసం వేసుకున్నా.. నీ బుద్ధి నాకు తెలుసు.. నన్ను మా అమ్మని దూరం చేయాలి అని మా అమ్మ దృష్టిలో నన్ను తప్పుగా చూపించాలి అనుకున్నావ్ కానీ అది జరగదు అని అంటాడు. మా అమ్మ కోసం నా ఆవేశానికి మాత్రమే బ్రేక్ ఇచ్చా కానీ నీ మీద అసహ్యం అలాగే ఉంది గుర్తుంచుకో అంటాడు. విజయానంద్ దగ్గరకు విశ్వాసం వచ్చి ప్రేరణ సిద్ధూని మార్చేసిందని అంటాడు. 
సిద్ధూ ప్రేరణ కోసం బయట వెయిట్ చేస్తుంటాడు. సాహితి వెళ్లి డ్రస్‌లో సూపర్‌గా ఉన్నావ్ అన్నయ్యా అంటుంది. ఇంతలో ప్రేరణ చీర కట్టుకొని వస్తుంది. సిద్ధూ చూసి ఫిదా అయిపోతాడు. అలా చూస్తూ ఉండిపోతాడు. ప్రేరణ వచ్చి సాహితి, సిద్ధూలకు హాయ్ చెప్తుంది. సిద్ధూ అలా ఉండిపోతే ఏమైంది అని ప్రేరణ అడుగుతుంది. దానికి సాహితి గుండె జారి మోకాలు లోకి పడిపోయింది అని అంటుంది సాహితి. 
దూరం నుంచి మంజుల, విజయానంద్ చూస్తారు. సాహితి వాళ్లతో ఇద్దరూ ప్లాన్ చేసి ట్రెడీషనల్ డ్రస్‌లు వేసుకున్నారు కదా అని అంటుంది. మంజుల ఫీలయిపోతుంది. ప్రేరణ లోపలికి వచ్చి మేడం, సార్ అని ఇద్దరికీ దండం పెడుతుంది. సిద్ధూ తల్లితో అమ్మా ప్రేరణ ఈ చీరలో బాగుంది కదా అంటాడు. దానికి మంజు నాకు నువ్వు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు నాన్న అని అంటుంది. 
సిద్ధూ ప్రేరణని గదిలోకి తీసుకెళ్తాడు. సాహితి తర్వాత వస్తా అంటుంది. ఇదే అలుసుగా తీసుకొని విజయానంద్ భార్యతో వాడు ప్రేరణ చెప్పిందని వేసుకున్నాడు కానీ నీ కోసమో నా కోసమో వేసుకోలేదు.. ప్రేరణ ఏం చెప్తే అదే చేస్తున్నాడు అని అంటాడు. ఎవరు చెప్తే ఏంటి అండీ ఒక వేళ ఆ అమ్మాయే చెప్పున్నా వాడు నువ్వు తెచ్చిన బట్టలు వేసుకున్నాడు నేను ఇస్తే వేసుకున్నాడు. అదే కదా మనకి ముఖ్యం అందులో ఫీలవ్వడానికి ఏం ఉంది వదిలేయండి అని అంటుంది. తల్లీకొడుకులు చాలా సింక్లో ఉన్నారు.. ప్రేరణని వాడుకొని తల్లీకొడుకుల్ని దూరం చేస్తా అమ్మాకొడుకు మధ్య అఘాతం పెంచుతా అని విజయానంద్ అనుకుంటాడు..
సిద్ధూ ప్రేరణకు ఇళ్లు చూపిస్తాడు. ప్రేరణకు అమ్మ గది, చెల్లి గది చూపించి తన గదికి తీసుకెళ్తాడు. ప్రేరణ సిద్ధూ గదిని చూసి సిద్ధూ నీ బెడ్ రూం చాలా బాగుంది. వ్యూ ఇంకా బాగుంది అని ఎగ్జైట్ అవుతూ సిద్ధూని ఢీ కొట్టి పడిపోబోతే సిద్ధూ పట్టుకుంటాడు. ఇంతలో మంజుల వచ్చి చూస్తుంది. సిద్ధూ ప్రేరణకు చీరలో చాలా బాగున్నావ్ అని అంటాడు. మంజు చిరాకుగా వెళ్లిపోతుంది. సిద్ధూ ప్రేరణతో అందరికీ రాత్రి వెలుగు వస్తుంది నాకు ఉదయమే వచ్చేసింది అని అంటాడు. ఎక్కువ పొగిడేస్తున్నావ్ అని ప్రేరణ అంటుంది. 
ప్రేరణ, సిద్ధూ నవ్వుకుంటూ ఉంటే కుమార్ వచ్చి నవ్వుకుంటున్నారా నవ్వుకోండి.. అరేయ్ సిద్ధూ ఈ ఇంటికి కొడుకు నువ్వా నేనా.. ఉదయం నుంచి మీ అమ్మ ఆ పని ఈ పని అని నా జూస్ తీసేశారు అని అంటాడు. అమ్మకి నువ్వు తప్పా ఇంకెవరు ఉన్నారురా అని సిద్ధూ అంటాడు. కేఫ్‌లో సర్వెంట్ చేశారు. ఇక్కడ సర్వర్ చేశారు. ఇలా తిప్పి తిప్పి వాడటానికి నేను ఏమైనా టిష్యూ పేపర్‌నా అని కుమార్ నవ్విస్తాడు. 
ఇంతలో ఇంటికి మినిస్టర్ వస్తారు. సిద్ధూని చూసి షాక్ అయి ఇతను అని అడుగుతాడు. నా కొడుకు సిద్ధూ అని విజయానంద్ చెప్పడంతో నోరెళ్లబెడతాడు. ఇక ప్రేరణని చూసి గుర్తు చేసుకొని షాక్ అయిపోతాడు. విజయానంద్ ఈ అమ్మాయి అని అనగానే కొంప తీసి కోడలు అని మాత్రం చెప్పకయ్యా అని మినిస్టర్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















