Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today 23rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఒకర్ని ఒకరు తలచుకొని బాధపడుతున్న లక్ష్మీ, విహారి.. లక్ష్మీని చూసిన విహారి ఫ్రెండ్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ నిశ్చితార్థంలో ఉండకూడదని పద్మాక్షి, అంబికలు తప్పు అడ్రస్ చెప్పి లక్ష్మీని బయటకు పంపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today 23rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఒకర్ని ఒకరు తలచుకొని బాధపడుతున్న లక్ష్మీ, విహారి.. లక్ష్మీని చూసిన విహారి ఫ్రెండ్! kalavari kodalu kanaka mahalakshmi serial today october 23rd episode written update in telugu Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today 23rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఒకర్ని ఒకరు తలచుకొని బాధపడుతున్న లక్ష్మీ, విహారి.. లక్ష్మీని చూసిన విహారి ఫ్రెండ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/23/67edab3b642dcaf40199c21fb298a5711729655384636882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర, విహారిల నిశ్చితార్థం రింగులను దాచిపెట్టమని యమున కనకానికి ఇస్తుంది. లక్ష్మీ వాటిని కొంగులో పెడుతుంది. కొంగుముడిలో పెట్టావేంటి అని యమున లక్ష్మీని అడుగుతుంది. దాంతో లక్ష్మీ భార్యభర్తలు అయినా విడిపోతారు కానీ ఈ కొంగుముడి మాత్రం వీడిపోదని నేను జాగ్రత్తగా చూసుకుంటానని అంటుంది. దానికి యమున సరే లక్ష్మీ నీ ఇష్టం కానీ నేను అడిగినప్పుడు ఇవ్వు అంటుంది.
మరోవైపు విహారి డ్రస్సింగ్ టేబుల్‌లో కనకమహాలక్ష్మీ జ్యువెలర్స్ అని చూసి కనక మహాలక్ష్మీ నీ వల్ల నేను చాలా ఇన్ఫులెన్స్ అవుతున్నానని మనసు లేని మనిషిగా నిన్ను వదిలేశానని తప్పు అంతా నాదే అని అనుకుంటాడు. నాఆలోచనల్ని నీ పేరు ఆపుతుందని పొరపాటుని సరిదిద్దుకుందామనుకుంటే నువ్వు కనిపించడం లేదని అనుకుంటాడు. ఇంతలో సహస్ర అక్కడికి వచ్చి విహారి చేతిలో పేపర్ తీసుకొని ఎక్కడికి వెళ్లినా ఈ ముదనష్టపు పేరే కనిపిస్తుందని మనసులో అనుకొని విసిరేస్తుంది. దాన్ని విహారి తీసుకొని ఏంటి బావ పనికి రాని పేపర్‌ని అలా దాస్తున్నావ్ అంటాడు. ఇక సహస్ర అవన్నీ నాకు ఎందుకు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానని అంటుంది. నిశ్చితార్థం అయిపోతే పెళ్లి అయిపోతుంది తర్వాత అమెరికా వెళ్లిపోతాం అక్కడ మనం ఇద్దరం మనకు ఇద్దరు పిల్లలు మన లైఫ్ చాలా బాగుంటుంది కదా బావ అని ఎగ్జైట్ అవుతుంది. ఇక సహస్రకి ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్లిపోతుంది.
విహారి: ఎంగేజ్మెంట్, పెళ్లి, అమెరికా ఇన్నీ తలచుకుంటే గుండె భారంగా మారిపోతుంది. కనక మహాలక్ష్మీ జీవితంలో కన్నీళ్లు నింపి నేను సంతోషంగా ఉండగలనా. తనని వెతికి పట్టుకోవాలి తనని తన తల్లిదండ్రుల దగ్గరకు చేర్చి తను అక్కడ సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. ఓ వైపు విహారి బాధ పడుతూ నేల కూర్చొంటే మరో చోట కనక మహాలక్ష్మీ కూడా అలానే గదిలో కూర్చొని ఏడుస్తుంది. వెలిపోతుంది ప్రాణమే కనపడుతోంది శూన్యమే.. కనపడవా కనపడవా అని పాట బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతుంది. ఇద్దరూ భగవంతుడా ఏంటి ఇదంతా అనుకుంటారు. విహారికి ఎదురు పడలేకపోతున్నా యమునమ్మని వదిలేసి వెళ్లలేకపోతున్నా అని కనకం అనుకుంటుంది. మరోవైపు విహారి కనకం కనిపిస్తేనే తను సంతోషంగా ఉండగలను అనుకుంటాడు. పెళ్లి అని అందరూ సంతోషంగా ఉంటే నేను కనకం లేకుండా ఎలా అని అనుకుంటాడు. ఇక కనకం తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లలేనని వాళ్లని నేను సంతోషంగా ఉన్నాను అన్న భ్రమలోనే ఉంచాలని అనుకుంటారు.
మరోవైపు అంబిక, పద్మాక్షిలు లక్ష్మీని నిశ్చితార్థంలో ఉంచకూడదని అనుకొని ఓ బాక్స్ ఇచ్చి దాని మీద ఉన్న అడ్రస్‌కి ఇచ్చి రమ్మని తప్పుడు అడ్రస్ రాసి ఇస్తారు. లక్ష్మీ విషయం తెలీక వెళ్లి ఇచ్చి వస్తానని బయల్దేరుతుంది. నిశ్చితార్థంలో లక్ష్మీ ఉండదని ఇద్దరూ సంతోషడతారు. మంచిగా ప్లాన్ చేశావని అంబికని పద్మాక్షి పొగుడుతుంది. లక్ష్మీ ఆ బ్యాగ్ పట్టుకొని వీధులు తిరుగుతుంది. ఎవరూ తమకు తెలీదని అంటారు. మరోవైపు నిశ్చితార్థం వేడుకలు మొదలవుతాయి. పద్మాక్షి, అంబికలు సహస్రని బార్బీ డాల్‌లా ఉన్నావని పొగిడేస్తారు. ఇక పక్కాగా ప్లాన్ చేశాం లక్ష్మీ నిశ్చితార్థంలో ఉండని చెప్తే సహస్ర సంతోషిస్తుంది. మరోవైపు యమున నిశ్చితార్థం రింగులు లక్ష్మీ దగ్గర ఉండటం లక్ష్మీ కనిపించకపోవడంతో చాలా కంగారు పడుతుంది. లక్ష్మీ ఇక చివరగా భైరంగూడ వెళ్తుంది. అక్కడ లక్ష్మీని విహారి ఫ్రెండ్ చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)