Seethe Ramudi Katnam Serial Today October 22nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రాకేశ్, ప్రీతిల నిశ్చితార్థం పూర్తి.. 4 రోజుల్లో పెళ్లి.. ఏం చేయలేకపోయిన అత్తాకోడళ్లు!
Seethe Ramudi Katnam Today Episode సీత, విద్యాదేవి ఎంత చెప్పినా మహాలక్ష్మీ వినకుండా ప్రీతి, రాకేశ్ నిశ్చితార్థం జరిపించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode లక్ష్మీని సాక్షిగా తీసుకురమ్మని చెప్తే సీత తేలేకపోతుంది. మిమల్ని నమ్మి మీ ఇంటికి వచ్చినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు మహాలక్ష్మీ గారు అని రాకేశ్ తండ్రి రెచ్చిపోతాడు. మేం వెళ్లిపోతాం అని చెప్పి వెళ్లబోతే మహాలక్ష్మీ ఆపి ఈ పెళ్లి జరుగుతుంది.. నిశ్చితార్థం జరుగుతుందని అంటుంది.
జనార్థన్: తన ఇష్టంతో మాకు పని లేదండి మేం మాటిచ్చాం ఈ పెళ్లి జరుగుతుంది.
గిరిధర్: అవును ఇప్పుడు ఈ ఎంగేజ్ మెంట్ జరగాల్సిందే.
అర్చన: దీన్ని సీత కాదు కదా ఎవరూ ఆపలేరు.
మహాలక్ష్మీ: తాంబూలం మార్చుకుందాం.
విద్యాదేవి: తొందర పడకండి సీత చెప్పిన విషయం గురించి ఎంక్వైరీ చేసి అప్పుడు నిశ్చితార్థం పెట్టుకుందాం.
మహాలక్ష్మీ: ఈ విషయం మీకు ఎందుకు.
విద్యాదేవి: సీత కూడా మీ కోడలే కదా తను చెప్పింది పట్టించుకుకోరా.
రాకేశ్‌తండ్రి: ఏంటండి ఇది ఆఫ్రాల్ పని మనిషికి ఇంత చనువు ఇచ్చారు.
సీత: తను పని మనిషి కాదు మా ఇంటి మనిషి
మహాలక్ష్మీ: అయితే నువ్వు మీ టీచర్ నోరు మోసుకోండి. రామ్ సీతకు నువ్వు చెప్పు.
రామ్: సీత ఎందుకు నువ్వు అనవసరంగా ఇందులోకి రాకు.
విద్యాదేవి: ప్రీతి లైఫ్ ఇంపార్టెంట్ దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
జనార్థన్: ప్లీజ్ విద్యాదేవి గారు ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి.
విద్యాదేవి: ఇది మన.. ఇది మీ కూతురి లైఫ్ అండి.
మహాలక్ష్మీ: అందుకే మాకు వదిలేయండి.
సీత: నువ్వు అయినా చెప్పు మామ ప్రీతికి ఈ సంబంధం వద్దు.
రామ్: నువ్వే మా పిన్ని మాట విను సీత మా పిన్ని మాకు ఎప్పుడూ మంచే చేస్తుంది.
సీత: నువ్వు అయినా చెప్పు ప్రీతి
ప్రీతి: అన్నయ్య మాటే మా మాట వదినా.
విద్యాదేవి: ఒక్క రెండు రోజులు ఆగితే ఏమవుతుంది మహాలక్ష్మీ గారు.
మహాలక్ష్మీ: డిస్కషన్స్ ఓవర్ ఇంక ఎవరు ఏం మాట్లాడినా మొన్న నేను చేసుకుందే రిపీట్ చేయాల్సి వస్తుంది. (సూసైడ్ గురించి)
రెండు కుటుంబాల వారు తాంబూలం మార్చుకుంటారు. రాకేశ్, ప్రీతిలు రింగులు మార్చుకుంటారు. దండలు కూడా మార్చుకుంటారు. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. సీత, విద్యాదేవి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక మహాలక్ష్మీ దగ్గర్లో మంచి ముహూర్తం చూడమని పంతులుకి చెప్తుంది. వచ్చే శుక్రవారమే మంచి ముహూర్తం అని పంతులు చెప్తాడు. సీత, విద్యాదేవి టెన్షన్ పడతారు. పెళ్లి కూడా ఫిక్స్ చేస్తారు. ఇక రాకేశ్ ప్రీతి కోసం నాలుగు కోట్ల విలువైన డైమెండ్ నక్లెస్ ఇచ్చి ఇంప్రెస్ చేస్తాడు. ఇక రాకేశ్ వాళ్లు వెళ్లిపోతారు. సీత తండ్రితల్లికి కాల్ చేసి విషయం చెప్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదని పెళ్లికి నాలుగు రోజులే ఉందని అంటుంది సీత. రాకేశ్ చెడ్డ వాడు అని తేలితే పెళ్లి ఆపేద్దాం అని అనుకుంటారు. సీత మాటలు విని రామ్ కోపంగా చూస్తాడు. ఏం చేస్తున్నావ్ సీత నువ్వు అని రామ్ అడుగుతాడు. రామ్ సీతని తిడతాడు తన పిన్నిని ఇలా ఇబ్బంది పెట్టొద్దని అంటాడు. మహాలక్ష్మీ చాటుగా రామ్, సీతల మాటలు వింటుంది.
మరోవైపు కిరణ్ కోసం రేవతి కాఫీ తీసుకొస్తుంది. ఇద్దరూ కలిసే తాగాలి అని కిరణ్ రేవతికి సాసర్‌లో పోసి ఇస్తాడు. ఇంతలో కిరణ్‌కి మ్యానేజర్ సుబ్బారావు ఫోన్ చేస్తాడు. మన కంపెనీకి రావాల్సిన కోట్ల రూపాయల టెండర్ మహాలక్ష్మీ కంపెనీకి వెళ్లిపోయిందని చెప్తాడు. మహాలక్ష్మీ తన పలుకుబడితో టెండర్ లాగేసుకుందని అంటాడు. టెండర్ మనకు రాదు అని తెలిస్తే అందరూ డబ్బులు రివర్స్ అడుగుతారు అని అంటాడు. దానికి కిరణ్ నేను చూసుకుంటా విషయం బయటకు రాకుండా చూడమని అంటాడు. ఇక కిరణ్ రేవతికి మీ వదిన మన మీద ప్రతీకారం తీసుకుంటుందని అంటాడు. మరోవైపు టెండర్ మనమే దక్కించుకున్నమని మహాలక్ష్మీ అందరికీ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రాకేశ్ నిజస్వరూపం సీతకి చెప్పిన లక్ష్మీ.. నిశ్చితార్ధాన్ని సీత ఆపగలదా!