Seethe Ramudi Katnam Serial Today October 21st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రాకేశ్ నిజస్వరూపం సీతకి చెప్పిన లక్ష్మీ.. నిశ్చితార్ధాన్ని సీత ఆపగలదా!
Seethe Ramudi Katnam Today Episode సీతకి లక్ష్మీ రాకేశ్ గురించి చెప్పడంతో సీత నిశ్చితార్థం ఆపమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode రాకేశ్ వాళ్లు ఫ్యామిలీ పెళ్లి చూపులకు వస్తారు. సీత ప్రీతిని తీసుకొని వస్తుంది. ప్రీతిని చూసి రాకేశ్ ఎలా అయినా నా సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. రాకేశ్‌ని ప్రీతి చూసి నవ్వుతుంది. విద్యాదేవి చూసి జంట చాలా బాగుంది అనుకుంటుంది. ఇక సీత అబ్బాయి నిజంగా ఉన్నాడా నటిస్తున్నాడా అనుకుంటారు. ఇక రాకేశ్‌కి అమ్మాయి నచ్చిందా అని అతని తల్లిదండ్రులు అడిగితే మీ ఇష్టమే నా ఇష్టం అంటాడు.
మహాలక్ష్మీ: మా ప్రీతి అంటే మా ఇష్టమే తన ఇష్టం.
సీత: మీ పిన్ని ప్రీతిని అడగకుండా ఓకే చేసేస్తుంది ఏంటి మామ.
రామ్: నువ్వే చెప్పావు కదా ప్రీతికి అబ్బాయి నచ్చాడని.
సీత: ఒకసారి ప్రీతిని అడుగు మామ.
రామ్: ఉండు అడుగుతా. ప్రీతి నీకు అబ్బాయి నచ్చాడా.
జనార్థన్: అదేంటి రామ్ రాకేశ్ ఫొటో చూసి ప్రీతి ఒకే చెప్పింది కదా.
సీత: వాళ్లు అబ్బాయిని అడిగారు కదా మామయ్య అలాగే మామ కూడా ప్రీతిని అడిగారు.
మహాలక్ష్మీ: ఏంటి ప్రీతి నీకు ఓకేనా. ప్రీతి తలాడిస్తుంది.
అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇక లక్ష్మీ రాకేశ్ గురించి వెతుకుతూ ఉంటుంది. ఇక అందరూ పెళ్లికి ఓకే చెప్పేస్తారు. ఇక రాకేశ్ తల్లిదండ్రులు మా కంపెనీని మీ కంపెనీలో కలిపేస్తాం అంటారు. సీత రామ్తో మీ పిన్ని వాళ్లు పెళ్లి చేస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా అని అడుగుతుంది. మరోవైపు లక్ష్మీ రాకేశ్ కారు చూసి మహాలక్ష్మీ ఇంటి దగ్గరకు వస్తుంటుంది. అందరూ కంపెనీల గురించి మాట్లాడుకుంటుంటే విద్యాదేవి కూడా ఆశ్చర్యంగానే చూస్తుంది. లక్ష్మీ సీత ఇంటి గేటు తెరుచుకొని లోపలికి వస్తుంది. ఇక రామ్ సీత ప్రశ్నలకు తట్టకోలేక నువ్వు కాసేపు బయటకు వెళ్లు అని పంపేస్తాడు. సీత బయటకు వెళ్తుంది. లక్ష్మీ లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంటే బయటకు వచ్చిన సీత లక్ష్మీని చూసి గుర్తు పట్టి లక్ష్మీ దగ్గరకు వస్తుంది. ఇంతలో రాకేశ్‌కి కూడా ఫోన్ వచ్చి బయటకు వస్తాడు. పెళ్లి కూతురు కత్తిలా ఉంది పెళ్లి ఫిక్స్ అయ్యేలా ఉందని చెప్తాడు. మరోవైపు సీత లక్ష్మీతో రోడ్డు మీద చీరలు అమ్మే నేను ఇంత పెద్ద ఇంట్లో ఉన్నానేంటి అనుకుంటున్నారా ఇది మా అత్తారిళ్లు అని నా సొంత కాళ్ల మీద నిలబడాలని అలా చేస్తున్నా అని చెప్తుంది. లక్ష్మీ సీత మాటలకు రెస్పాండ్ అవ్వదు.
లక్ష్మీ: మీ ఇంట్లో పెళ్లి చూపులు అవుతున్నాయా.
సీత: అవును మా ఆడపడుచుకి ఆ విషయం మీకు ఎలా తెలుసు.
లక్ష్మీ: పెళ్లి కొడుకు రాకేశ్‌నా.
సీత: అవును ఆ విషయం మీకు ఎలా తెలుసు.
లక్ష్మీ: మొన్న నా మీదకు రౌడీలను పంపింది వాడేనండి. ఆ రాకేశ్ పెద్ద నీచుడు సీతగారు. వాడిని లేని బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. వాళ్ల నాన్న ఆస్తిని అడ్డుపెట్టుకొని చేయని నేరాలు లేవు. చాలా సార్లు జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు. నాకు తెలిసిన ఓ అమ్మాయి జోలికి వస్తే నేను జైలుకి పంపాను.
సీత: అమెరికాలో అతను జాబ్ చేస్తున్నాడు అన్నారు.
లక్ష్మీ: అంతా అబద్దం. మొన్నటి వరకు జైలులో ఉన్నాడు. మొన్నే వచ్చి వాడి ఫ్రెండ్స్‌తో నా మీద అటాక్ చేయించాడు. ఇప్పుడు కూడా నాతో మిస్ బిహేవ్ చేశాడు. పెళ్లి చూపులు అని తెలుసుకొని నేను వచ్చాను. వాళ్ల అమ్మానాన్నలు కూడా మంచి వాళ్లు చంపేస్తాం అని నాకు ఇందాక బెదిరించారు. వాళ్లకి మీ ఆడపడుచుకి ఇచ్చి పెళ్లి చేయొద్దు.
ఇక లక్ష్మీ లోపలికి వెళ్లి పెళ్లి ఆపుదామంటే సీత నేను చూసుకుంటా మీరు రిస్క్‌లో పడొద్దని చెప్పి నేను చూసుకుంటానని లక్ష్మీకి హగ్ ఇస్తుంది. ప్రీతిని సమయానికి కాపాడినందుకు మీ రుణం తీర్చుకోలేదని అంటుంది. ఇక ఇంట్లో అందరూ నిశ్చితార్థానికి రెడీ అవుతారు. ప్రీతిని రాకేశ్‌లకు పక్కపక్కన కూర్చొపెట్టి నిశ్చితార్థానికి రెడీ అవుతారు. తాంబూలం మార్చుకునే టైంకి సీత ఆపండి అని పెద్ద కేక వేస్తుంది. ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేదు అని అంటుంది. అందరూ ఏమైందని అడిగితే రాకేశ్ మంచోడు కాదని పరమ దుర్మార్గుడని చెప్పి ప్రీతితో పెళ్లి వద్దని అంటుంది. లక్ష్మీ చెప్పిన విషయాల్నీ చెప్తుంది. జనార్థన్, మహాలక్ష్మీలు సీతని తిడతారు. లక్ష్మీ పేరు చెప్పగానే రాకేశ్ షాక్ అవుతాడు. ఇక రాకేశ్ జైలు నుంచి బయటకు వచ్చాడని చెప్తుంది అందరూ షాక్ అవుతాడు. రాకేశ్ ఆయన తల్లిదండ్రులు బుకాయిస్తారు. సీత అబద్దాలు చెప్తుందని అంటారు. ఇక సీత ఫ్రెండ్‌ని పిలిపించమని విద్యాదేవి చెప్తే తన దగ్గర నెంబరు లేదు అడ్రస్ తెలీదని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర మీద ఎటాక్.. బిజినెస్‌లో ఓడించడానికి రంగంలోకి దిగిన సరయు!