(Source: ECI/ABP News/ABP Majha)
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 22nd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనక మహాలక్ష్మీ కొంగులో సహస్ర, విహారిల నిశ్చితార్థం డైమండ్ రింగులు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode సహస్ర, విహారి నిశ్చితార్థం కోసం సహస్ర డైమండ్ రింగులు కొని వాటిని యమునకి ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ చేతి గాయాలకు పసుపు రాసుకోవడం చూసి పనామె అడుగుతుంది. చేతికి గాజులు కూడా లేవు ఏమైందని అని అంటుంది. యమున ఆ మాటలు వింటుంది. లక్ష్మీ దగ్గరకు వచ్చి గాజులు ముక్కలు అయిపోవడం అంటే అమంగళం అని అంటుంది. నువ్వు మొండి చేతులతో ఉండటం అశుభం అని అంటుంది. దానికి లక్ష్మీ ఇప్పటికి ఇప్పుడు గాజులు అంటే ఎక్కడ వస్తాయమ్మా అని అంటుంది.
యమున: నీ భర్త నీకు తాళి కట్టి వదిలేసినా నువ్వు ఆయనకు ఏం కాకూడదని ఆయన కోసం పూజలు చేస్తున్నావు. నువ్వు ఇలా ఉండకూడదమ్మా నాతో రా చెప్తాను. అని దేవుడి గదిలోకి తీసుకెళ్లి అమ్మవారికి దండం పెట్టుకోమని అక్కడున్న గాజులు తన చేతులతో లక్ష్మీ చేతులకు తొడుగుతుంది.
వసుధ: రాత్రి యమున గది దగ్గరకు వెళ్లి మళ్లి ఇప్పుడు అడిగితే ఏం అనుకుంటుందో అని వెళ్లిపోబోతే యమున చూసి ఎందుకు వసుధ వచ్చి వెళ్లిపోతున్నావ్ అని అడుగుతుంది. ఇంట్లో మామిడి చెట్టుకు అయినా విలువ ఉంటుంది కానీ పని చేయని భర్తకి విలువ ఏం ఉంటుంది చెప్పు వదిన. ఇంట్లో ఎవరు ఆయనకు విలువ ఇవ్వడం లేదు. మీ తమ్ముడు దులిపేస్తున్నారు కానీ నాకు మాత్రం అందరూ అన్న మాటలే మెదులుతున్నాయి.
యమున: ఇంత చిన్న విషయానికి నువ్వు బాధ పడటం ఎందుకు నాకు ఒక మాట చెప్పాలి కదా.
వసుధ: నీతో చెప్పి విహారితో చెప్పాలనుకున్నా వదినా కానీ
యమున: నేను విహారితో చెప్పి ఏదో ఒక పనిలో పెట్టిస్తా పద విహారితో మాట్లాడుదాం. చారుకేశవ ఉద్యోగం గురించి వసుధ, యమున విహారితో మాట్లాడుతారు.
విహారి: దీని కోసం రిక్వెస్ట్ చేస్తావేంటి అమ్మ. అత్త ఇంత వరకు మామయ్య ఎక్కడో పని చేస్తున్నాడు అని వదిలేశా ఇప్పుడు మన కంపెనీలోని ఏదో ఒక పనిలో పెడతా. నిశ్చింతగా వెళ్లి రేపటి నుంచి మామయ్యకి మన కంపెనీకి వచ్చేయ్మని చెప్పు.
అంబిక: ఈ చారుకేశవకి కొంచెం విషయం తెలిస్తే చాలు చాలా చేస్తాడు వాడిని ఇంట్లో పెట్టుకోవడమే కష్టమని అనుకుంటే ఇప్పుడు ఆఫీస్‌కి కూడానా వాడితో జాగ్రత్తగా ఉండాలి.
మరోవైపు సహస్ర బంగారం సేటుని ఇంటికి పిలిపిస్తుంది. నిశ్చితార్థం కోసం రెండు డైమెండ్ రింగులు తీసుకురమ్మన్నాను అని చెప్తుంది. ఆల్రెడీ బంగారం రింగులు ఉన్నాయి కదా అని అడిగితే వాటి టైంలోనే కదా నిశ్చితార్థం ఆగిపోయింది అందుకే కొత్త రింగులు ఆర్డర్ చేశానని చెప్తుంది. రింగుల చూడగానే చారుకేశవ మనసు వాటి మీదకు మళ్లుతుంది. రెండు రింగులు ముప్పై లక్షలు అని చెప్పగానే సహస్ర, పద్మాక్షి తప్ప అందరూ షాక్ అయిపోతారు. అంత ఖర్చు ఎందుకని అంటారు. సహస్ర మాత్రం నాకు డబ్బులు కంటే సెంటిమెంట్ ముఖ్యమని అంటుంది. ఇక సహస్ర ఆ రింగులను యమునకు ఇచ్చి జాగ్రత్తగా పెట్టమని చెప్తుంది. అందరూ నీ దగ్గరే ఉంచుకోవే అంటారు. దానికి సహస్ర నిశ్చితార్థం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని యమున అత్తయ్య మాటిచ్చారు కాబట్టి అత్తయ్య చేతుల మీదే నిశ్చితార్థం జరగాలి అని అత్తయ్యకి ఇస్తున్నాను అని అంటుంది. ఇక ఈ సారి నిశ్చితార్థంలో మీరు ఎటూ వెళ్లకూడదని ప్రతీ పని మీ చేతుల మీదే జరగాలి అని చెప్తుంది.
తర్వాత యమున ఆ రింగులను కనకం చేతిలో పెట్టి సౌభాగ్యం లేని దాన్ని శుభకార్యం నా చేతుల మీద జరగకూడదని పుణ్యస్త్రీ అయిన నువ్వు ఈ రింగులు నీ దగ్గర పెట్టు అని చెప్తుంది. అంత విలువైన వస్తువులు నాకు వద్దని అంటుంది లక్ష్మీ. యమున మాత్రం లక్ష్మీని ఒప్పించి వాటిని జాగ్రత్త పరచమని ఇస్తుంది. లక్ష్మీ తీసుకుంటుంది. నా పసుపు కుంకుమల్ని మరో అమ్మాయికి అప్పగిస్తున్నాను అని లక్ష్మీ మనసులో అనుకొని దేవుడి పసుపుకుంకుమ వాటికి పెట్టి జాగ్రత్తగా తన కొంగుకే కడుతుంది. కొంగులో ఎందుకని యమున అడిగితే భర్త కట్టిన మూడు మూళ్లు కూడా తెగిపోవచ్చు కానీ కొంగు ముడి తెగిపోదని లక్ష్మీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రాకేశ్ నిజస్వరూపం సీతకి చెప్పిన లక్ష్మీ.. నిశ్చితార్ధాన్ని సీత ఆపగలదా!