Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 29th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం టాలెంట్‌కి విహారి ఫిదా.. రూ. 25 లక్షలతో పాటు బంపర్ ఆఫర్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode టెండర్ వచ్చినందుకు విహారి లక్ష్మీకి డబ్బు ఇచ్చి లక్ష్మీని తన పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ వేయించిన టెండర్ వల్ల విహారికి టెండర్ వస్తుంది. విహారితో పాటు అంబిక, సుభాష్ షాక్ అయిపోతారు. ఇలా ఎలా జరిగిందని సుభాష్ అంబికని ప్రశ్నిస్తాడు. ప్రాజెక్ట్ దక్కించుకున్నట్లు విహారి సంతకం పెడుతూ నేను కోట్ చేసింది 400 కోట్ల 62 లక్షలకు టెండర్ వచ్చింది 400 కోట్ల 59 లక్షలకు మరి మార్పు ఎక్కడ జరిగింది అని ఆలోచిస్తుంటాడు. లక్ష్మీ వచ్చి పేపర్లు ఇవ్వడం టెండర్ వేయడం గుర్తు చేసుకుంటాడు.
విహారి: కనక మహాలక్ష్మీ.. అంటే కనక మహాలక్ష్మీ ఇదంతా చేసిందా. తను ఎందుకు చేసింది అయినా తను చదువుకోలేదు కదా. అయితే తన చేతి ఇంకెవరైనా చేయించుంటారా.
రాజీ: విహారికి కాల్ చేసి.. పెద్దనాన్న గురించి చెప్పాను కదా విహారి గారు దాని గురించి ఏమైనా ఆలోచించారా. మీరిద్దరూ కలిసి ఒకసారి వచ్చి పెద్దనాన్నకి కనిపిస్తే చాలు.
విహారి: మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడంలేదు.
రాజీ: కనక మహాలక్ష్మీని పెద్దనాన్న చూసి 3 నెలలు అవుతుంది. తనకు దూరంగా ఎప్పుడూ లేరు. అందుకే తన మీద చాలా బెంగ పెట్టుకున్నారు. మిమల్నే తలచుకుంటున్నారు. ఆయన్ను చూస్తుంటే మాకు జాలేస్తుంది. మీరు ఒక్కసారి మా పెద్దనాన్నకి కనిపిస్తే చాలు ఇక ఆయనకు ఏ ఆపరేషన్ అవసరం ఉండదు.
అంబిక: ఏయ్ లక్ష్మీ.. నువ్వేంటి ఇక్కడున్నావ్.
లక్ష్మీ: అంటే అమ్మా అది.
అంబిక: ఇంట్లో వంటలు చేసుకునే నీకు ఇక్కడేం పని.
లక్ష్మీ: అంటే అమ్మ అది విహారి గారి కోసం భోజనం తీసుకొచ్చా.
విహారి: అత్తా ఏమైంది లక్ష్మీని ఏం అంటున్నారు.
అంబిక: నేనే మంటాను మామూలుగా మాట్లాడుతున్నా. సుభాష్ పద వెళ్దాం.
విహారి: కనక మహాలక్ష్మీ నీతో మాట్లాడాలి నేను కోట్ చేసిన పేపర్లు నా దగ్గరే ఉన్నాయి కానీ నువ్వు తెచ్చిన పేపర్లతో టెండర్ దక్కించుకున్నా. అసలేం జరిగింది ఆ పేపర్లు నువ్వే తయారు చేశావా. ఆ పేపర్లు ఎక్కడికి ఆ కొటేషన్ నా పేరు మీద ఉంది. అది ఎవరు మార్చారు.
లక్ష్మీ: నేనే మార్చాను విహారి గారు.
విహారి: కనక మహాలక్ష్మీ నువ్వు చదువుకున్నావా. టెండర్ వ్యాల్యూ మార్చే అంత తెలివి నీకు ఉందా.
లక్ష్మీ: అవును విహారి గారు నేను కాలేజ్ టాపర్ జిల్లా ఫస్ట్.
విహారి: అరే చదువు గురించి నువ్వు ఎప్పుడు చెప్పలేదు. అయితే ఈ టెండర్ నీ వల్లే గెలిచాను. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నీ వల్లే నాకు దక్కింది. ఈ క్రెడిట్ అంతా నీదే. అని 25 లక్షల చెక్ ఇస్తాడు. ఇది మీ నాన్న గారి హాస్పిటల్ ఖర్చులకు.
లక్ష్మీ: విహారి గారు నేను మీకు ముందే చెప్పాను కదా నాకు వద్దని.
విహారి: ఇది సాయం కాదు లక్ష్మీ కృతజ్ఞత. ఊహించనంత లాభం వచ్చేలా చేశావ్. అయినా ఒక బెస్ట్ కొటేషన్ తయారు చేయడానికి బయట మార్కెట్‌లో ఎంత తీసుకుంటారో తెలుసా. ఇది నేను జాలితో ఇవ్వడం లేదు నీ ప్రతిభతో నువ్వు సాధించుకున్నది ఇది నీ తెలివి తేటలతో నువ్వు సంపాదించినది తీసుకో కనక మహాలక్ష్మీ. కనక మహాలక్ష్మీ మీ నాన్నకి నీ డబ్బుతో నువ్వు ఆపరేషన్ చేయించనున్నావ్. సంతోషమేనా.
లక్ష్మీ: హా. కానీ ఇది వాళ్లకి ఎలా ఇవ్వగలను కనీసం వాళ్లకి ఎదురు పడి బాగున్నారా అని కూడా అడగలేను.
విహారి: మనం మీ ఊరు వెళ్తున్నాం.
లక్ష్మీ: ఏం మాట్లాడుతున్నారు విహారి గారు.
విహారి: నేను నిజమే చెప్తున్నా మీ నాన్న గారు మనల్ని పదే పదే చూడాలని కలవరిస్తున్నారు కదా. మనల్ని ఎప్పుడు చూడాలా అని ఆయన ఆరాటపడుతున్నారట
లక్ష్మీ: నేను మీ భార్యగా చాలా సంతోషంగా బతుకుతున్నానని ఆయన అనుకుంటున్నారు. అది అబద్ధం అని ఆయనకు తెలీదు. మనం ఇప్పుడు భార్యాభర్తల్లా వెళ్తే బాగోదు.
విహారి: ముందు ముందు ఏం అవుతుందో నాకు తెలీదు. ఇప్పుడు అయితే ఆయనకు ఆపరేషన్ చేయించాలి. ఇంకేం ఆలోచించకు ఈ రోజు రాత్రికే మన ప్రయాణం రెడీగా ఉండు. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. కనక మహాలక్ష్మీ అసలు నేను పెట్టిన కోట్ కంటే తక్కువ వేయాలని నీకు ఎలా అనిపించింది. అసలు నీకు ఈ ప్రాజెక్ట్ గురించి తెలీదు. నేను వేసిన కోట్‌కి ప్రాజెక్ట్ రాదని నువ్వు ఎలా గుర్తించగలిగావు.
లక్ష్మీ: ఇప్పుడు అంబిక గారి గురించి చెప్తే ఇంట్లో పెద్ద గొడవలు అవుతాయి. అనుకొని ఇంటర్ నెట్‌లో ఆ ప్రాజెక్ట్ గురించి చూసి కోట్ మార్చానని చెప్తే విహారి సమాధానం నాకు ఓకే కాదు కానీ ప్రాజెక్ట్ వచ్చింది కదా అది చాలు అంటాడు.
రాత్రి లక్ష్మీ పూజ చేయడానికి ఆరు బయట చల్లని నీటితో చంద్రున్ని చూసి దండం పెట్టుకొని స్నానం చేస్తుంది. తర్వాత అమ్మవారికి పూజ చేస్తుంది. లక్ష్మీ ఎలా విహారి ఆశీర్వాదం తీసుకుంటుందో అని అనుకున్న పండు ఆరు బయట ఉన్న విహారి దగ్గరకు ఫుల్ పొగలా దూపం వేసుకొని తీసుకెళ్తాడు. ఇక లక్ష్మీ అక్షింతులు తీసుకొని వస్తుంది. ఇద్దరూ అనుకొని విహారి దగ్గరకు వెళ్తారు. పండు కావాలనే విహారి దగ్గర ఎక్కువ దూపం వేస్తాడు. ఈలోపు లక్ష్మీ వచ్చి విహారి చేతికి అక్షింతలు తాకించి తన తల మీద తానే వేసుకొని విహారి కాళ్లకు దండం పెట్టి వెళ్లిపోతుంది. తర్వాత విహారి తన కాళ్ల మీద అక్షింతలు చూసి పండుని అడుగుతాడు. తర్వాత లక్ష్మీ అందరికీ వడ్డిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారితో తన కొటేషన్ టెండర్‌లో వేయించిన లక్ష్మీ.. చివరి నిమిషంలో ట్విస్ట్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

