Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 15th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఆదికేశవ్ పరిస్థితి తెలిసి కుప్ప కూలిపోయిన లక్ష్మీ.. ఆపరేషన్ చేయిస్తుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode ఆదికేశవ్‌కి ఆపరేషన్ చేయాలని డబ్బు పదిరోజుల్లో సర్దుబాటు చేయాలని చెప్పడంతో అది విన్న కనకం షాక్ అయిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ఆదికేశవ్ కండీషన్ సీరియస్‌గా ఉందని పది రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే బతకడం కష్టమని డాక్టర్ అంటారు. ఇక ఆదికేశవ్ తన కండీషన్ గురించి టెన్షన్ పడతాడు. ఎందుకు ఇలా హాస్పిటల్‌లో ఉంచి ఇన్ని టెస్టులు చేస్తున్నారని అనుకుంటాడు. ఆదికేశవ్ పక్క బెడ్ మీదే విహారిని ఉంచుతారు. విహారి దగ్గర లక్ష్మీ ఉంటుంది. విహారి కోసం జ్యూస్ చేయడానికి ఫ్రూట్స్ తీసుకొచ్చి లక్ష్మీ జూస్ చేస్తుంది. పక్కనే తండ్రి ఉన్నా చూడదు.
విహారి బెడ్ ఎదురుగానే కనక మహాలక్ష్మీ తల్లి డాక్టర్‌తో మాట్లాడటం విహారి చూస్తాడు. విహారి షాక్ అయి అక్కడే ఉన్న కనకాన్ని సైగ చేసి పిలిచి గౌరీని చూపిస్తాడు. కనకం తల్లిని చూసి షాక్ అయిపోతుంది. తల్లి చూడకుండా వెనక్కి తిరిగిపోతుంది. ఇక గౌరీ ఆదికేశవ్ దగ్గరకు వెళ్తుంది.
ఆదికేశవ్: గౌరీ మనం ఇంటికి వెళ్లేది ఎప్పుడే. ఈ హాస్పిటల్ వాళ్లు మన దగ్గర డబ్బులు కాజేసే కార్యక్రమం ఏం పెట్టుకోలేదు కదా అలా అయితే మన దగ్గర ఈడ్చి కొట్టినా ఒక్క రూపాయి లేదని చెప్పేయ్.
విహారి: కనక మహాలక్ష్మీ మీ అమ్మావాళ్లు హాస్పిటల్‌కి వస్తున్నారు అని తెలుసుకానీ ఇదే హాస్పిటల్‌కి వస్తున్నారు అని తెలీదు.
లక్ష్మీ: వాళ్లు ఇదే హాస్పిటల్‌లో ఉన్నారని నాకు తెలుసు విహారి గారు అందుకే వాళ్లకి కనిపించకుండా తిరుగుతున్నాను.
విహారి: ఆక్సిజన్ మాస్క్ ఉంది కాబట్టి నన్ను గుర్తు పట్టలేదు నువ్వు ఇలా ఉంటే గుర్తు పట్టేస్తారు.
లక్ష్మీ నర్సులా డ్రెస్ వేసుకొని వస్తుంది. దాంతో రాజీ వచ్చి లక్ష్మీని సిస్టర్ ఆదికేశవ్ అనే పేషెంట్ ఎక్కడున్నారని అడుగుతుంది. లక్ష్మీ సైగ చేసి చూపిస్తుంది. రాజీ ఆదికేశవ్ దగ్గరకు వెళ్తుంది. ఎప్పుడు వెళ్తామని ఆదికేశవ్ అడిగితే త్వరగా వెళ్లిపోతామని రాజీ అంటుంది. ఇంతలో ఆదికేశవ్ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతాడు. ఆక్సిజన్ మాక్స్ ఉన్నా చాలా ఇబ్బంది పడతాడు. లక్ష్మీ, విహారి చూస్తారు. లక్ష్మీ కంగారు పడుతుంది. ఆక్సిజన్ పైపు ఊడిపోయిందని రాజీ అంటుంది. గౌరీ కంగారు పడుతుంది.
రాజీ వచ్చి లక్ష్మీని నర్సు అనుకొని పిలుస్తుంది. లక్ష్మీ వెళ్లి ఆక్సీజన్ పైప్ చూసి ఏం చేయాలో తెలిక విహారికి పెట్టిన ఆక్సిజన్ పైపు దగ్గరకు వచ్చి చూసి అలాగే తన తండ్రి ఆక్సిజన్ పైపును ఫిక్స్ చేస్తుంది. దాంతో ఆదికేశవ్‌కి ఆక్సిజన్ అందుతుంది. డాక్టర్‌ని పిలుస్తానని లక్ష్మీ వెళ్తే గౌరీ వెనకాలే వచ్చి మాట్లాడుతుంది. తన భర్తకి పది రోజుల్లో ఆపరేషన్ చేయాలని డబ్బు గురించి చెప్తుంది. ఏడుస్తుంది. లక్ష్మీ కూడా మీ కూతురిగా ఏం చేయలేకపోతున్నా నాన్న అని ఏడుస్తుంది. ఆయనకు ఏమైనా అయితే నేను నా కూతురు దిక్కులేని అనాథలు అయిపోతామని గౌరీ అంటుంది. దాంతో లక్ష్మీ నేను డాక్టర్‌తో మాట్లాడుతానని అంటుంది. ఇక లక్ష్మీ చాలా సేపు ఎదురు చూసి ఎవరూ లేని టైంలో తండ్రి దగ్గరకు వెళ్లి తండ్రి చేయి పట్టుకొని ఏడుస్తుంది.
ఉదయం గౌరీ డాక్టర్‌తో మాట్లాడటం లక్ష్మీ చాటుగా వింటుంది. డాక్టర్ వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయమని అంటాడు. మొత్తం కూతురికి పెట్టి పెళ్లి చేశాం ఇప్పుడేం చేయాలని గౌరీ డాక్టర్‌తో మొరపెట్టుకుంటుంది. ఏం చేయలేకపోతున్నానని లక్ష్మీ ఏడుస్తుంది. మరోవైపు విహారిని వీల్ చైర్ మీద కుటుంబ సభ్యులు తీసుకెళ్తారు. అందరూ లక్ష్మీ కనిపించడం లేదని లక్ష్మీని తిడతారు. నేనే మందుల కోసం పంపానని యమున చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షిని కాటేసిన పాము.. బయటపడ్డ సూర్య ప్రేమ.. మందారం తల పగలగొట్టిన దీపక్!