Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 9th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారికి ప్రశ్నల వర్షం.. అందర్నీ ఏడిపించేసి తాళితో ఇంటి నుంచి పారిపోయిన సహస్ర!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి సహస్రను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో పెట్రోల్ పోసుకున్న సహస్ర ఇంటి నుంచి పారిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి సహస్ర మెడలో తాళి కట్టకుండా ఆలోచిస్తూ ఉంటాడు. యమున, భక్తవత్సలం, పద్మాక్షి కట్టమని అంటారు. విహారి కట్టకుండా తాళి పడేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. తాళిని సహస్ర పట్టుకుంటుంది. లక్ష్మీ మేడ మీద నుంచి చూస్తుంటుంది. తాళి పట్టుకొని సహస్ర పైకి లేస్తుంది.
పద్మాక్షి: ఏం చేస్తున్నావ్ విహారి.
యమున: తప్పు నాన్న మంగళసూత్రాన్ని అలా వదిలేయకూడదు.
కాదాంబరి: విహారి తాళి తీసుకొని కట్టరా.
సహస్ర: బావ తాళి కట్టు బావ.
విహారి: నేను తాళి కట్టలేను. అందరూ షాక్ అయిపోతారు.
పద్మాక్షి: ఎందుకు కట్టవు విహారి. ఏమైంది.
విహారి: ఇప్పుడు నిజం చెప్తే లక్ష్మీని ఏం చేస్తారో. నాకు కొంత టైం కావాలి.
పద్మాక్షి: టైం ఏంటి విహారి పెళ్లి మండపంలో ముహూర్తం దగ్గర పడి తాళి కట్టే టైంకి ఎవరైనా టైం అడుగుతారా.
అంబిక: ఇప్పుటికే రెండు సార్లు పెళ్లి ఆగిపోయింది అని అందరూ ఎంత బాధపడుతున్నారో తెలుసుకదా మరి ఇలా ఎందుకు చేస్తున్నావ్ విహారి.
కాదాంబరి: విహారి సహస్రని పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు కలుస్తాయని నువ్వే చెప్పావు కదా మాలో లేని ఆశల్ని నువ్వు ఎందుకురా కల్పించావ్. అందరూ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటారు.
పద్మాక్షి: నువ్వు కూడా మీ నాన్నలాగే మాట మీద నిలబడవా. ముహుర్తానికి పెళ్లి వాయిదా వేసిన వాడిని నా ఇంటికి వచ్చి నా కూతురికి లేనిపోని ఆశలు ఎందుకు కల్పించావ్. నన్ను ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావ్ ఇన్ని నాటకాలు ఎందుకు ఆడావ్ చెప్పు విహారి. చెప్పు.
భక్తవత్సలం: నా విహారి ఎప్పుడూ తప్పు చేయడు అలాంటిది నువ్వు ఇలా చేయడం తప్పురా విహారి. ఈ కుటుంబం కలిపే బాధ్యత నాది అని మాట ఇచ్చావ్ మాట నిలబెట్టుకునే వాడివి అయితే ఇలా చేయవురా.
కాదాంబరి: ఆ తాళి తీసుకొని కట్టు విహారి.
యమున: ముందు నువ్వు ఆ తాళి తీసుకొని కట్టు విహారి. యమున విహారిని కొడుతుంది. ఏడుస్తూ నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా ఓ ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నావా. మనవాళ్లని మనతో కలుపుతా అని చెప్పి వాళ్లని మనకు ఆజన్మాంతం శత్రువుల్ని చేయాలి అనుకుంటున్నావా. ఏంటి నీ ఉద్దేశం ఎందుకు ఈ పెళ్లి ఆపుతున్నావో చెప్పకపోతే నా మీద ఒట్టు వేశావ్ కదా ఆ మాట ప్రకారం నేను చస్తాను. నాకు ఇప్పుడు సమాధానం కావాలి.
విహారి: దయచేసి అందరూ ఆపండి. మీ అందరి ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉంది.
సహస్ర: మనసులో ఇప్పుడు గానీ బావ లక్ష్మీ గురించి చెప్తేస్తే అని గదిలోకి పరుగులు పెడుతుంది. గదికి వెళ్లి సహస్ర పెట్రోల్ పోసుకుంటుంది. అందరూ సహస్ర వెనక పరుగులు తీస్తారు. అగ్గిపెట్టి తీసేటైంకి అందరూ ఆపుతారు.
విహారి: సహస్ర ఏం చేస్తున్నావ్.
పద్మాక్షి: ఎంత పని చేస్తున్నావే నువ్వు లేకుండా మేం ఏం అయిపోవాలి.
సహస్ర: ఒక్క నిమిషం అమ్మా. నన్ను ఎందుకు కాపాడావు బావ. నన్ను ఎందుకు కాపాడావ్. నీకు తెలుసు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని తెలిసి కూడా నువ్వే నన్ను కాపాడావ్. నన్ను కాపాడిన ప్రతీ సారి మరింత శూన్యంలోకి పంపేస్తున్నావ్. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం నా తప్పా బావ చెప్పు అని సహస్ర ఏడుస్తుంది. ఇదంతా కాదు నువ్వు ఫైనల్‌గా ఒక్క విషయం చెప్పు. నీకు నేను అంటే ఇష్టమా లేదా. సహస్ర ఎంత ఏడ్చినా విహారి సమాధానం చెప్పదు. దాంతో సహస్ర తాళి పట్టుకొని బయటకు పారిపోతుంది. విహారితో పాటు అందరూ తలో వైపు వెతుకుతారు. ఎవరికీ సహస్ర దొరకదు.
పద్మాక్షి చాలా ఏడుస్తుంది. ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని అందరూ ఏడుస్తారు. యమున సహస్ర ఎందుకు ఇలా చేస్తుంది వదినా అని అడుగుతుంది. దాంతో పద్మాక్షి యమునని లాగిపెట్టి కొడుకుతుంది. అమ్మాకొడుకు నీ శిష్యురాలు చేయాల్సింది అంతా చేసి ఇప్పుడు వచ్చి కపటనాటకాలు ఆడుతున్నారా అని అడుగుతుంది. కొడుకుని ఎవరూ ఏమీ అనకుండా ఉండాలని కొడుకుని నాలుగు దెబ్బలు వేసి బిల్డప్ ఇచ్చిందని అంటుంది. యమునమ్మ అలాంటిది కాదని లక్ష్మీ అంటే లక్ష్మీని పద్మాక్షి లాగిపెట్టి కొడుతుంది. లక్ష్మీకి దెబ్బ తగులుతుంది. చిన్న దెబ్బకి మీరు ఇలా అయితే నా కూతురు అలా వెళ్లింది అది ఏం చేసుకుంటుందో అని ఏడుస్తుంది. ఇదంతా లక్ష్మీ కళ్లు తిరిగి పడిపోవడం వల్ల వచ్చిందని కాదాంబరి అంటుంది. నా కూతురు నాకూతురు అని పద్మాక్షి ఏడుస్తుంది. విహారి మాయమాటలు చెప్పి తన కూతురు ప్రేమించేలా చేసి ఇప్పుడు దాన్ని చంపాలని చూస్తున్నారని అంటుంది. సహస్రకు ఏమైనా అయితే అందర్నీ చంపేస్తా అని పద్మాక్షి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!





















