Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 6th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: మూడు రోజుల్లో మదన్, లక్ష్మీల పెళ్లి.. లక్ష్మీని ఒప్పించిన విహారి!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode మదన్‌ని పెళ్లి చేసుకోమని విహారి లక్ష్మీని ఒప్పించడం మూడు రోజుల్లో పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ, మదన్‌ల పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి ఇంట్లో వాళ్లు ఏర్పాట్లు చేస్తారు. లక్ష్మీ రాను అని చెప్తే విహారి తాను తీసుకొస్తానని చెప్తాడు. ఇక విహారి లక్ష్మీతో మనం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. తప్పనిపరిస్థితుల్లో పెళ్లి జరిగింది. నీకు ఎలా న్యాయం చేయాలా అని నేను చాలా బాధపడేవాడిని ఇప్పుడు నాకు నీ సమస్యకు మదన్ రూపంలో పరిష్కారం దొరికిందని అంటాడు.
మదన్‌ది అమెరికానే తనని పెళ్లి చేసుకుంటే మీ నాన్న కోరుకున్నట్లు అమెరాకి అల్లుడు వస్తాడని చెప్తాడు. మనిద్దరం సముద్రంలో కొట్టుకుపోతే నాకు సహస్ర చేయి అందించినట్లు నీకు మదన్ లైఫ్ జాకెట్ ఇచ్చి నీ జీవితాన్ని కాపాడుతాడు తనని పెళ్లి చేసుకో అని చెప్తాడు. మన సమస్యకి ఇంతకి మించి పరిష్కారం దొరకదు అని చెప్పి చీర కట్టుకొని కిందకి వచ్చి మదన్‌తో పెళ్లికి ఒప్పుకో ఇక్కడితో మన బంధానికి స్వస్తి పలుకుదామని అంటాడు. లక్ష్మీ ఏడుస్తూ చీర తీసుకుంటుంది. లక్ష్మీ వస్తుందని విహారి చెప్తాడు. లక్ష్మీ చీర కట్టుకొని కిందకి వస్తుంది. ఏం చెప్పి లక్ష్మీకి ఈ పెళ్లికి ఒప్పించావని యమున విహారిని అడిగితే మదన్‌తో తన జీవితం గురించి చెప్పి ఒప్పించానని అంటాడు. ఇక పంతులు మదన్, లక్ష్మీలను కూర్చొపెట్టి ముహూర్తాలు చూస్తారు. లగ్నపత్రిక రాసి పద్మాక్షికి ఇస్తారు. తాంబూలం మార్చుకోమని అంటారు. లక్ష్మీ తరఫున వసుధ, చారుకేశవ నిల్చొంటే మదన్ తరఫున విహారిని తాంబూలం తీసుకోమని మదన్ చెప్తాడు. విహారి తాంబూలం తీసుకుంటాడు.
మరోవైపు అంబికకు ఓ వ్యక్తి కాల్ చేసి పేమెంట్స్ గురించి మాట్లాడుతాడు. లక్ష్మీ లెక్కవేసిన డబ్బు గురించి ప్రాబ్లమ్ కాదని మొదటి నుంచి చేసిన ఫ్రాడ్ తెలిస్తే పెద్ద ప్రాబ్లమ్ అవుతుందని అంటాడు. అంతా నేను చూసుకుంటానని అంబిక అంటుంది. లక్ష్మీ మదన్‌తో వెంటనే పెళ్లి చేసి అమెరికా పంపేసి విహారిని బోల్తా కొట్టించి తాను ఆధిపత్యం దక్కించుకోవాలని అనుకుంటుంది. ఇక సత్యకి విహారి కాల్ చేసి మదన్ కనకానికి పెళ్లి చేస్తానని చెప్తాడు. విహారి దగ్గరకు అంబిక వచ్చి తాను ఆఫీస్‌కి వస్తా అంటుంది. ఇక లక్ష్మీ ఆఫీస్‌కి రాదని అంటుంది. దాంతో విహారి సహస్ర చెప్పిందని అంటాడు. ఒక అడ్డు తొలగిపోయిందని అంబిక అనుకుంటుంది. ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్లిపోతారు.
యమున లక్ష్మీ దగ్గరకు వచ్చి నీ గతం మర్చిపో ఇప్పటి నుంచి నీ కొత్త జీవితం మొదలు పెట్టు మూడు రోజుల్లో నీ పెళ్లి షాపింగ్ అన్నీ చేయాలి అంటుంది. ఇంతలో మదన్ వచ్చి షాపింగ్‌కి వెళ్లక్కర్లేదని తనకు తెలిసిన ఫాషన్ డిజైనర్ ఉన్నారని లక్ష్మీకి కావాల్సిన బట్టలు, బంగారం అన్నీ వాళ్లే చూసుకుంటారని అంటారు. నీకు కాబోయే పెళ్లాం బయటకు వెళ్లి కందిపోకూదని అన్నీ ఇక్కడే ఏర్పాటు చేశావా అని అంటుంది. ఇక లక్ష్మీ ఎప్పుడూ బాధ పెట్టకూడదని అంటుంది. దాంతో మదన్ లక్ష్మీని ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటా అని ప్రామిస్ చేస్తాడు. ఇక వసుధ లక్ష్మీతో విహారి నీకు పెళ్లికి ఒప్పించాడు కదా. వాడికి నీ విలువ నీ తాళి విలువ తెలీదు అని అంటుంది. నాకు చావాలో బతకాలో అర్థం కావడం లేదని లక్ష్మీ ఏడుస్తుంది. ఇక సహస్ర లక్ష్మీ పీడ విరగడైపోతుందని సహస్ర తల్లితో చెప్పుకొని సంతోషపడుతుంది.
అంబిక వాళ్లు ఆఫీస్‌కి వస్తారు. ఇక విహారికి ఆదికేశవ్ ఫోన్ చేస్తాడు. లక్ష్మీ ఆఫీస్‌కి రాకుండా ఇంట్లో ఉంచానని అంబిక సంతోషంగా ఆఫీస్‌లోకి వెళ్తుంది. కానీ ఆఫీస్‌లో లక్ష్మీ ఉంటుంది. అంబిక చూసి షాక్ అయిపోతుంది. కనకంతో మాట్లాడాలి అని ఉందని ఆదికేశవ్ చెప్తాడు. కనకం దగ్గరకు వెళ్లగానే మీకు కాల్ చేయిస్తా అంటాడు. సహస్ర వద్దు అంటే ఎందుకు వచ్చావ్ అని అంబిక అంటే నాకు సహస్రమ్మ జాబ్ ఇవ్వలేదు నేను రాకపోవడానికి అని అంటుంది. ఇక అరగంటలో 57 కోట్లు కంపెనీ అకౌంట్‌కి రాకపోతే విహారికి సాక్ష్యాలతో సహా మీ పని చెప్తా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!





















