Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 30th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి ఇంట్లో బాంబ్! తన ఫ్యామిలీని లక్ష్మీ కాపాడుకుంటుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode December 30th విహారి ఇంట్లో వీర్రాజు బాంబ్ పెట్టడం లక్ష్మీకి ఆవిషయం తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి సెల్ పాయింట్‌కి వెళ్తాడు. వెనకాలే సహస్ర ఫాలో అవుతుంది. విహారి వాళ్లతో డేటా పొగొట్టొద్దని అంటాడు. ఇంకా రిపేర్ చేయలేదు అని వాళ్లు చెప్తారు. డేటా పోకుండా ఫోన్ రిపేర్ చేయాలి అంటే రెండు రోజులు టైం పడుతుందని అంటారు. డేటా చాలా చాలా ముఖ్యం అని విహారి చెప్పడం సహస్ర వింటుంది.
విహారి వెళ్లిపోయిన తర్వాత సహస్ర ఆ డేటా ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. అందుకు షాప్‌లోకి వెళ్తుంది. ఇక పానకాలు వీర్రాజుని పక్కకి తీసుకెళ్లి బాంబ్ ఎలా పెట్టబోతున్నారు.. వీళ్లని ఎలా చంపాలి అనుకుంటున్నారు అని అడుగుతాడు. దానికి వీర్రాజు నాతో ఉంటే బాంబ్ ప్రమాదానికి దూరంగా ఉన్నట్లేరా.. ఆ బాంబ్‌తో విహారి, మా పెద్ద నాన్న కుటుంబం మొత్తం చంపేయాలి అనుకుంటున్నా అంటాడు. ఆ మాటలు లక్ష్మీ వినేస్తుంది. విహారి గారి కుటుంబాన్ని చంపాలి అనుకున్నది ఎవరు అని అనుకుంటుంది. కంగారుగా మొత్తం వెతుకుతుంది.
వీర్రాజు పానకాలుని కొట్టి నీ వల్ల లక్ష్మీకి ప్లాన్ తెలిసిపోయిందిరా.. అయినా బాంబ్ ఎక్కడుందో తనకు తెలీదు కదా ఏం చేస్తుందో చూద్దాం పద అని వెళ్తారు. అందరూ పెళ్లి వేడుకలో ఉంటారు. లక్ష్మీ కంగారుగా అందరినీ అనుమానంగా చూస్తుంది. బాంబ్ ఎక్కడున్నా పేలకుండా చూడాలని అనుకుంటుంది. లక్ష్మీ కంగారు చూసిన పండు ఏమైందని అడుగుతాడు. ఈ ఇంట్లో బాంబ్ పెట్టారు పండు అని లక్ష్మీ చెప్తుంది. పండు బిత్తరపోతారు. ఎలా అయినా బాంబ్ పేలకుండా చూడాలని లక్ష్మీ అంటుంది. నాకు కాళ్లూ చేతులు ఆడటం లేదు అని పండు కంగారు పడతాడు. మనమే బాంబ్ కనిపెట్టాలి పండు అని లక్ష్మీ చెప్తుంది. ఇద్దరూ చెరో వైపు వెతుకుతూ ఉంటారు.
వీర్రాజు గమనిస్తూ ఉంటాడు. యమున, చారుకేశవలు చూసి ఏమైంది ఏం కావాలి.. ఏం వెతుకుతున్నావ్,, మాకు చెప్పు మేం వెతుకుతాం అంటారు. పర్లేదు మేం కూడా వెతుకుతాం అని లక్ష్మీ అంటుంది. లక్ష్మీ ఒంగుతూ కింద పడి మరీ వెతుకుతూ ఉంటే పద్మాక్షి చూసి ఏమైంది లక్ష్మీ.. ఏం వెతుకుతున్నావ్.. మాకు చెప్పు మేం కూడా వెతుకుతాం.. అలా ఒంగి ఒంగి వెతకకు మాకు చెప్పు మేం వెతుకుతాం అని అంటుంది. దానికి లక్ష్మీ కాలి పట్టీ పడిపోయిందని అందరికీ చెప్తుంది.
వీర్రాజు పానకాలుతో వాళ్లు ఎంత వెతికినా దొరకదురా.. ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు అని అంటాడు. లక్ష్మీ, పండులు బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఒకతను వచ్చి పూల దండలు ఇస్తాడు. ఇప్పుడు అవసరం లేదు ఉన్నాయి అని లక్ష్మీ అంటుంది. దానికి అతను ఈ టైంకే తీసుకురమ్మని చెప్పారని అంటాడు. లక్ష్మీ అవసరం లేదు అని చెప్పి పంపేస్తుంది. తర్వాత అన్నీ వెతికాను కానీ దండలు వెతకలేదు అని అనుకొని పరుగులు తీస్తుంది. తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటుంది. అందరూ లక్ష్మీని వింతగా చూస్తారు. ఇంతలో విహారి రావడంతో పండు విహారికి విషయం చెప్తాడు. లక్ష్మీ దేవుడికి వేసిన దండలు వెతుకుతుంది. తర్వాత లక్ష్మీకి అంబిక, సుభాష్ వేసుకున్న దండల మీద అనుమానం వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















