Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 28th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీని వీడియోతో సహా పట్టేసిన అంబిక.. యమున మీద ఒట్టేసిన లక్ష్మీ విహారినే తన భర్తని చెప్తుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ కుంకుమార్చన పూజ గురించి తెలుసుకున్న ఇంట్లో వాళ్లు లక్ష్మీని నిలదీసి నిజం చెప్పమని యమున మీద ఒట్టేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర, అంబికలు విహారిని వెతుక్కుంటూ రావడంతో వేరే దారి లేదు అనుకొని విహారి కనకాన్ని అక్కడే ఉండమని తానే వాళ్లకి ఎదురు వెళ్తాడు. అంబిక, సహస్రలు విహారిని చూస్తారు. సహస్ర అంబికలు విహారిని ఏదో అడగబోతే పద చెప్తా అని విహారి పద్మాక్షి వాళ్ల దగ్గరకు వెళ్తాడు. మేం రమ్మంటే రాలేదు ఇప్పుడెందుకు ఇక్కడ ఉన్నావ్ అని అడుగుతారు.
విహారి: అందరూ నేను చెప్పేది వినండి. ఉదయం గుడికి వెళ్లాలి అనే సంగతి మర్చిపోయి జాగింగ్‌కి వెళ్లిపోయా ఫోన్ కూడా తీసుకెళ్లలేదు. ఫోన్ చూస్తే చాలా కాల్స్ ఉన్నాయి అప్పుడు గుర్తొచ్చి పరుగున వచ్చా. తీరా చూస్తే మీరంతా పూజ కూడా పూర్తి చేసినట్లు ఉన్నారుగా.
యమున: పూజ అంతా అయిన తర్వాత వస్తే ఎలా నాన్న ఫలితం ఉండాలి కదా. అలా ఎలా మర్చిపోయావు.
విహారి: సారీ అమ్మ పదండి పదండి అందరూ సహస్ర రా.
సహస్ర: బావ నీతో పాటు ఇంకెవరైనా గుడికి వచ్చారా.
విహారి: ఆ వచ్చారు శ్రీలీల, సమంత ఇద్దరూ కలిసి పైన అర్చన చేయిస్తున్నారు వెళ్లి చూడు.
లక్ష్మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇక లక్ష్మీ తాళి పట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటుంది. లక్ష్మీ కుంకుమార్చన పూర్తి చేస్తుంటే అంబిక వచ్చి వీడియో తీస్తుంది. లక్ష్మీ షాక్ అయిపోతుంది. పూజని కూడా వీడియో తీస్తుంది. కుంకుమార్చన పూజ నువ్వు ఎందుకు చేస్తున్నావ్ అని అడుగుతుంది. ఎవరికీ తెలీకుండా ఇలా చేస్తున్నావ్ అంటే నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నిస్తుంది. ఇక లక్ష్మీని తీసుకొని అందరి దగ్గరకు వెళ్తుంది. లక్ష్మీని హాల్‌లో ఉన్న అందరి ముందు లాగి పడేస్తుంది. యమున వచ్చి లక్ష్మీకి ఏమైందని అడుగుతుంది. అంబిక అందరికీ తాను తీసిన వీడియో చూపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు.
పద్మాక్షి: ఇది కుంకుమార్చనకు సంబంధించిన పూజలా ఉంది. కుంకుమార్చన వ్రతం పెళ్లి కాని లక్ష్మీ ఎందుకు చేస్తుంది. భర్త బాగుండాలి అని చేసే వ్రతమే అది.. అది నువ్వు చేయడం ఏంటి.
అంబిక: నాకు ఎవరూ లేరు నేను అనాథ అని చెప్తుంది కానీ అదంతా అబద్ధం అక్క దీని జీవితంలో ఎవరో ఉన్నారు.
చారుకేశవ: నేను ఈ లక్ష్మీని మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఈ ఇంట్లో ఏదో చేయడానికే ఇన్ని నాటకాలు ఆడుతుందని నా అనుమానం.
యమున: మనసులో.. అర్థాంతరంగా వదిలేసిన భర్త కోసం పూజలు చేస్తూ ఇప్పుడు అందరి ముందు లక్ష్మీ దోషిలా నిలబడింది.
సహస్ర: ఏయ్ లక్ష్మీ అడిగేది నిన్నేనే అడిగిన దానికి సమాధానం చెప్పు. కుంకుమార్చన పూజ నువ్వు ఎందుకు చేస్తున్నావ్. విహారి కూడా వస్తాడు.
పండు: అయ్యో దేవుడు లక్ష్మీమ్మ ఇన్ని రోజులు జాగ్రత్తగా ఎవరికీ తెలీకుండా పూజ చేసింది పాపం చివరి రోజు దొరికిపోవడం ఏంటి.
యమున: వదిన కుంకుమార్చన పూజ పెళ్లి అయిన వాళ్లే చేయాలి అనేముందు మంచి భర్త రావాలి అని లక్ష్మీ చేయొచ్చు కదా.
పద్మాక్షి: నువ్వు మాట్లాడకు యమున. నువ్వు ఎప్పడూ ఈ లక్ష్మీని వెనకేసుకురావడానికి ప్రయత్నిస్తావు. మంచి భర్త కోసం అయితే వేరే ఏదో పూజ చేయకుండా ఈ వ్రతమే ఎందుకు చేయాలి. చెప్పవే లక్ష్మీ నీకు పెళ్లి అయిందా. నువ్వు ఒంటరిదానివి అని చెప్తుంటావ్ నీకు భర్త ఉన్నాడా. ఎవరే నీ భర్త. అసలు ఎవరి కోసమే ఈ పూజలు చేస్తున్నావ్.
లక్ష్మీ: మంచి భర్త రావాలి అని ఆ రాబోయే భర్త జీవితం బాగుండాలి అని ఈ వ్రతం చేశానమ్మా అంతే.
పద్మాక్షి: అవునా సరే అయితే ఇదే మాట ఒట్టు వేసి చెప్పు. నీ మీద నువ్వు ఒట్టు వేసుకోవడం కాదు. నీకు సాయం చేస్తున్న ఈ యమున మీద ఒట్టేసి చెప్పు.
యమున: మనసులో వీళ్లంతా లక్ష్మీని వదిలేలా లేరు తనకి పెళ్లి అయిందని తెలుసుకొని లక్ష్మీని ఓ తప్పుడు మనిషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది అది కాదు.. అదే ఇది.. ఇంటి వారసురాలి ఇడ్లీ బండి కథ షురూ!





















