Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 2nd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: సహస్ర దొంగతనాన్ని సీసీటీవీ ఫుటేజ్ పట్టించేసిందా? అదరగొట్టిన లక్ష్మీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode August 2nd సహస్ర సుభాష్‌కి డబ్బు ఇవ్వడం లక్ష్మీ చూసి ఎస్ఐతో కలిసి వాటిని తిరిగి తెప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక సుభాష్‌కి కాల్ చేసి సహస్రని బెదిరించి ఇరవై లక్షలు అడగమని చెప్తుంది. అంబిక లైన్‌లో ఉండగానే సుభాష్ సహస్రకి కాల్ చేస్తాడు. సహస్ర బయటకు వెళ్లి మాట్లాడుతుంది. సుభాష్ అర్జెంట్‌గా 20 లక్షలు ఇవ్వమని అంటాడు. నేను ఇవ్వలేను ఇవ్వను అని సహస్ర అంటుంది. దాంతో నా దగ్గర హాస్పిటల్ వీడియోలు ఉన్నాయని అంటాడు.
సహస్ర సుభాష్‌తో నేను వీడియోలు అన్నీ డిలీట్ చేసేశానని చెప్తుంది. దాంతో సుభాష్ నువ్వు డిలీట్ చేసిన సీసీ టీవీ ఫుటేజ్, నీతో పాటు అబద్ధం ఆడిన డాక్టర్‌ని తీసుకొని మీ ఇంటికి వచ్చి విహారికి మొత్తం చెప్పేస్తా అంటాడు. దాంతో సహస్ర భయపడి డబ్బు ఇస్తానని అంటుంది. డబ్బు ఎలా ఏర్పాటు చేయాలా అని అనుకొని తల్లి బీరువాలో వెతుకుతుంది.
పద్మాక్షి వచ్చి ఏం కావాలి సహస్ర ఎందుకు బీరువా వెతుకుతున్నావని అడుగుతుంది. నాకు ఇరవై లక్షలు కావాలమ్మా అని సహస్ర చెప్తుంది. ఇప్పుడు లేవని పద్మాక్షి చెప్పి నాన్నని అడుగు అని అంటుంది. నాన్న అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను నాకేం వద్దు అని సహస్ర అంటుంది. ఇక సహస్ర హాల్‌లో విహారి పద్మాక్షి, వసుధలకు ఇచ్చిన ఇరవై లక్షలు చూసి నా ఇంట్లో నేనే దొంగతనం చేయాల్సి వస్తుందని అనుకొని ఆ డబ్బు తీసుకొని బయటకు వెళ్తుంది.
సహస్ర బ్యాగు కొంగు చాటుగా పెట్టుకొని వెళ్లడం లక్ష్మీ చూస్తుంది. సహస్ర బ్యాగ్ సుభాష్‌కి ఇవ్వడం లక్ష్మీ చూసి సహస్రమ్మ వాడికి వార్నింగ్ ఇస్తుంది అంటే వాడు ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అర్థమైంది ఎలా అయినా ఆ డబ్బు తీసుకోవాలని అనుకుంటుంది. లక్ష్మీ వెంటనే ఎస్‌ఐ సంధ్యకి కాల్ చేసి విషయం చెప్తుంది. ఇక పండు అమ్మవారి దగ్గర ఉన్న 20 లక్షలు బాక్స్‌లు లేకపోవడం చూసి వసుధకి చెప్తాడు. ఇంట్లో అందరూ కంగారు పడతారు. లక్ష్మీ ఆలోచిస్తూ సహస్ర వాడికి డబ్బు ఇచ్చి ఎందుకు కంగారు పడుతుంది అని అనుకుంటుంది.
ఎస్‌ఐ సంధ్య సుభాష్‌ని అడ్డుకొని డబ్బు తీసుకుంటుంది. మిగతా పోలీసులు పరుగు పెట్టినా సుభాష్‌ని తప్పించుకుంటారు. ఇంట్లో అందరూ డబ్బు గురించి టెన్షన్ పడతారు. అంబిక ఇదంతా ఇంట్లో వాళ్ల పనే అని చెప్పి దేవుడి దగ్గరకు వెళ్లి గాజు తీసుకొచ్చి వచ్చి ఇదంతా ఆ లక్ష్మీ పనే అని గాజు తీసి చూపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు.
సహస్ర కూడా లక్ష్మీనే దొంగ అని ఇంట్లో లేదు అంటే తనే తీసేసుంటుందని అంటుంది. ఇంతలో లక్ష్మీ వస్తుంది. లక్ష్మీ తీసిందని అందరూ లక్ష్మీని డబ్బు ఇవ్వమని అంటారు. దాంతో లక్ష్మీ సహస్రమ్మ బయట ఇచ్చిన డబ్బు ఇదేనా అనుకుంటుంది. అందరూ లక్ష్మీనే నిలదీస్తారు. విహారి సీసీ టీవీ ఫుటేజ్ చూద్దామని తీసుకొస్తాడు. అందరూ చూస్తారు. దొరికిపోతానని సహస్ర భయపడుతుంది. ఇంతలో ఎస్‌ఐ సంధ్య ఇంటికి వచ్చి లక్ష్మీకి కాల్ చేస్తుంది. లక్ష్మీ పండుకి సీక్రెట్‌గా పిలిచి ఇద్దరూ బయటకు వెళ్తారు. లక్ష్మీ ఎస్‌ఐ దగ్గరకు వెళ్లి విషయం తర్వాత చెప్తా అని డబ్బు తీసుకుంటుంది. పండుకి డబ్బు ఇచ్చి తీసుకురమ్మని చెప్తుంది.
సహస్ర దొంగతనం ఫుటేజ్‌లో వచ్చే టైంకి పండు డబ్బు దేవుడి దగ్గర పెట్టి అందర్ని పిలిచి డబ్బు ఇక్కడే ఉందని చెప్తాడు. సహస్ర, అంబిక షాక్ అయిపోతారు. లక్ష్మీ వెంటనే ల్యాప్‌టాప్ మూసేస్తుంది. డబ్బు మీద పంచె పడిపోయిందని చూసుకోలేదని పండు అంటాడు. వసుధకి డబ్బు దాయమని పద్మాక్షి చెప్తుంది. యమున అంతా ఆలోచించి సహస్రతో వరలక్ష్మీ వ్రతం చేయిస్తేనే ఇంటికి విహారికి మంచి జరుగుతుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















