Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీకి డీఎన్‌ఏ టెస్ట్.. సీక్రెట్ కెమెరాతో ప్రకాశ్ ఏం చేయనున్నాడు? యమున అసహ్యానికి కారణమేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today August 20th లక్ష్మీ తల్లిదండ్రులుగా వచ్చిన వాళ్లు నిజంగా తల్లిదండ్రులేనా అని తెలుసుకోవడానికి డీఎన్ఏ టెస్ట్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ప్రకాశ్ లక్ష్మీ మెడలో దండం వేసే టైంకి ఇద్దరు దంపతులు వచ్చి ఆపుతారు. ఎవరు మీరు అని సహస్ర అడిగితే మేం ఎవరో చెప్తాం కానీ ముందు వాడికి దండ పక్కన పెట్టమని చెప్పండి అని అంటారు. ఎంత అన్యాయానికి ఒడిగట్టావురా అని ప్రకాశ్‌ని తిడతారు. మీరు ఎవరు అని సహస్ర అడిగితే మేం లక్ష్మీ అమ్మానాన్నలం లక్ష్మీ మెడలో తాళి కట్టింది వాడు కాదు అంటారు.
సహస్ర మనసులో లక్ష్మీ అమ్మానాన్నలు వీళ్లు కాదు కదా అనుకుంటుంది. ఇక ప్రకాశ్ వీళ్లు లక్ష్మీ అమ్మానాన్నలకు కాదు వాళ్లు నాకు తెలుసు అంటాడు. తెలిస్తే మరి నువ్వు ఎందుకు వచ్చినప్పటి నుంచి వాళ్ల గురించి చెప్పలేదు అని వసుధ అడుగుతుంది. ఇక చారుకేశవ ఆ ఫేక్ తల్లిదండ్రుల్ని తానే ఏర్పాటు చేసినట్లు లక్ష్మీ, విహారిలకు సైగ చేస్తాడు. లక్ష్మీ తనకు అమ్మానాన్న ఉన్నారని చెప్పలేదు కదా అని సహస్ర అంటుంది. పద్మాక్షి కూడా అనాథ అని చెప్పింది కదా అని అంటుంది. వాళ్లు మేమే లక్ష్మీ వాళ్ల తల్లిదండ్రులం అని చెప్తారు. అసలు ఆ లక్ష్మీ మా ఇంట్లోనే ఉండటం దండగ అనుకుంటే మీరు మళ్లీ మా కూతురు అని వచ్చారు అసలు మా ఇంట్లో ఈ సంత ఏంటి అని పద్మాక్షి తిడుతుంది. మమల్ని ప్రశాంతంగా ఉంచడం నీకు ఇష్టం లేదా లక్ష్మీ ఎవరో ఒకర్ని తీసుకొస్తున్నావ్ అని అంటుంది.
లక్ష్మీ తల్లిదండ్రులుగా వచ్చిన వాళ్లకి సాక్ష్యం అడుగుతారు. వాళ్లు ఏం తెచ్చుకోలేదని చెప్పడంతో నిరూపించడానికి ఏదో ఒక సాక్ష్యం ఉండాలి అని అందరూ అంటాడు. దాంతో సహస్ర డీఎన్‌ఏ టెస్ట్ చేయిద్దామని అంటుంది. అంబిక ల్యాబ్ టెక్నిషియన్‌ని పిలిపించి లక్ష్మీకి తల్లిదండ్రులుగా వచ్చిన వాళ్లకి డీఎన్‌ఏ టెస్ట్ చేయించడం కోసం బ్లడ్ సాంపిల్స్ తీసుకుంటారు. లక్ష్మీ, చారుకేశవ వాళ్లు కంగారు పడతారు. రెండు మూడు రోజుల్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్తారు. ఇక పద్మాక్షి అప్పటి వరకు వాళ్లని అవుట్ హౌస్‌లో ఉండమని చెప్తుంది.
లక్ష్మీ బయట బాధ పడుతూ ఉంటుంది. మోసంతో ముడి పడిన బంధం వల్ల యమునమ్మ, విహారిలు ఇబ్బంది పడుతున్నారు. అబద్ధాలు మీద మరో అబద్ధాలు అని తలచుకొని బాధ పడుతూ ఉంటుంది. యమున లక్ష్మీ దగ్గరకు వస్తుంది. నువ్వు నా దగ్గర ఒక్క నిజమే దాచావు అనుకున్నా కానీ నువ్వు నా దగ్గర అన్నీ అబద్ధాలే చెప్తున్నావ్ నిజాలే చెప్పలేదు.. నా కొడుకు విషయంలో నువ్వు చేసిన మోసం గుర్తొస్తే నిన్ను చూస్తే కోపం వచ్చేది.. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రతీది అబద్ధం మోసం అని తెలిశాక నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. నిన్ను నమ్మినందుకు నా మీద నాకు చిరాకు వస్తుంది. ద్రోహం చేసి మోసం చేసి ఇచ్చిన మాట తప్పి నీ మెడలో పడిన బంధానికి విలువ ఉంటుంది అనుకుంటున్నావా.. నీ మోసం బయట పడితే నీ పెళ్లి పెటాకులు అవుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్లు నీ తల్లిదండ్రులో కాదో నాకు తెలీదు కానీ నువ్వు నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తున్నావ్. నీ వల్ల కన్న వాళ్లకి నీ మెడలో తాళి కట్టిన వాళ్లకి ఎవరికీ ప్రశాంతత లేదు అని యమున లక్ష్మీని తిట్టి వెళ్లిపోతుంది.
లక్ష్మీ చాలా ఏడుస్తుంది. చారుకేశవ, వసుధలు లక్ష్మీకి సారీ చెప్తారు. నీ అమ్మానాన్నలుగా వాళ్లని నేనే తీసుకొచ్చా అని చెప్తాడు. డీఎన్‌ఏ రిపోర్ట్స్ గురించి చూసుకుంటా అని చారుకేశవ అంటాడు. అన్నీ వదిలేయండి విహారి గారి ఎలక్షన్ గురించి ఆలోచిద్దామని అంటుంది. మరోవైపు ప్రకాశ్ లక్ష్మీ గదిలో లక్ష్మీకి తెలీకుండా స్పై కెమెరా పెడతాడు. లక్ష్మీ ల్యాప్ టాప్ పాస్ వర్డ్ తెలిసేలా కెమెరా పెడతాడు. లక్ష్మీ వచ్చే సరికి దండలు పట్టుకొని నిల్చొని కింద ఎలాగూ మార్చుకోలేదు ఇప్పుడు అయినా మార్చుకుందామా అని అంటాడు. నన్ను విసిగించకు ఎక్కువ చేస్తే ఆ దండ నీ శవానికి వేస్తానని చెప్పి లక్ష్మీ పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ప్రకాశ్ చూసి పెన్ డ్రైవ్ కోసం వెతుకుతున్నావ్ కదా అయినా ఇందులో ఏం డేటా లేదు అని అంటాడు. వాడేంటి ఇలా అన్నాడు అని లక్ష్మీ పెన్ డ్రైవ్ పెట్టి ల్యాప్ టాప్‌లో చెక్ చేస్తుంది. మొత్తానికి లక్ష్మీ ల్యాప్‌టాప్ పాస్ వర్డ్ ప్రకాశ్ తెలుసుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















