Jyothi Rai: ఇప్పుడు కాదు.. అప్పుడు కూడా నేను ఇలాగే ఉండేదాన్ని, ఆ పాత్ర వల్లే అలా అనుకుంటున్నారు: జ్యోతిరాయ్
Jyothi Rai: యాక్టర్లు సీరియల్స్‌లో ఉన్నట్టే బయట కూడా ఉంటారని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. దానివల్లే ‘గుప్పెడంత మనసు’ ఫేమ్ జ్యోతి రాయ్‌పై నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. దానిపై ఆమె తాజాగా స్పందించారు.
Jyothi Rai: ఒకప్పుడు సినిమాల నుంచి సీరియల్స్‌కు షిఫ్ట్ అయ్యేవారు నటీనటులు. కానీ ఇప్పుడు అలా కాదు.. ముందుగా బుల్లితెరపై ఫేమ్ సాధించిన తర్వాత చాలామందికి వెండితెరపై అవకాశం దక్కుతోంది. ఆ లిస్ట్‌లో ఇప్పుడు జ్యోతి రాయ్ కూడా యాడ్ అయ్యారు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్‌గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు జ్యోతి. త్వరలోనే ‘ఏ మాస్టర్ పీస్’ అనే మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్‌కు హాజరయిన జ్యోతిని గ్లామర్ రోల్స్ గురించి, తనపై సోషల్ మీడియాలో వచ్చిన బ్యాడ్ కామెంట్స్ గురించి ప్రశ్నించగా తను చాలా పాజిటివ్‌గా స్పందించారు.
లీడ్ రోల్స్ మాత్రమే..
సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ ఫోటోలు పెడుతూ ఫాలోవర్స్‌ను షాక్‌కు గురిచేస్తుంటారు జ్యోతి రాయ్. కానీ సినిమాల్లో, సీరియల్స్‌లో మాత్రం తన పాత్రల సెలక్షన్ చాలా భిన్నంగా ఉంటుంది. మరి తెరపై ఆమెను గ్లామర్ పాత్రల్లో ఎప్పుడు చూడవచ్చు అని అడగగా.. ‘‘నేను ముందే ఏ పాత్ర కోసం ప్రిపేర్ అవ్వను. నేను నా టాలెంట్‌ను మాత్రమే నమ్ముతాను. నాకు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు కావాలి. నేను ఇప్పుడు చేయగలను కాబట్టి లీడ్ రోల్స్ మాత్రమే సెలక్ట్ చేసుకుంటున్నాను’’ అంటూ తన స్క్రిప్ట్ సెలక్షన్ గురించి చెప్పుకొచ్చారు జ్యోతి రాయ్. ఇక తన గ్లామర్ ఫోటోలపై సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తుండగా దానిపై కూడా తాను స్పందించారు.
ట్రెండ్‌ను ఫాలో అవుతున్నా..
‘‘ఆ నెగిటివ్ కామెంట్స్ గురించి నేనేం చెప్తాను. అలా చేసేవాళ్లను అడగాలి. ఇది మా ప్రొఫెషన్. మోడర్న్ రోల్ అయినా ట్రెడీషినల్ రోల్ అయినా, సినిమా అయినా సీరియల్ అయినా పర్ఫార్మ్ చేయాల్సిందే. అలా కాకుండా ఇది సీరియల్ కెమెరా నేను కొంచెమే నటిస్తాను. ఇది సినిమా కెమెరా నాకు ఎక్కువ లాభం వస్తుంది నేను మంచిగా యాక్ట్ చేస్తాను అని ఉండదు. ఒక యాక్టర్‌కు యాక్టింగ్ అనేదే కెరీర్. జనాలు.. వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి కామెంట్స్ చేస్తారు. వాళ్లు కామెంట్స్ పెట్టారని నేను పెట్టలేను. ఒకప్పుడు నేను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేను. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కటి సోషల్ మీడియా ద్వారానే జరుగుతోంది. ఏదైనా కూడా ట్రెండ్‌తో వెళ్లాల్సిందే’’ అని చెప్పుకొచ్చారు జ్యోతి.
పట్టించుకోను..
‘‘అందరూ నన్ను మోడర్న్ అని ఇప్పుడు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అందరూ నన్ను జగతి క్యారెక్టర్‌లోనే చూశారు. అదే నా క్యారెక్టర్ అనుకున్నారు. కానీ కన్నడలో మీరు చూస్తే అవే మోడర్న్ డ్రెస్సులతో ఒక షోను హోస్ట్ చేశాను’’ అని బయటపెట్టారు జ్యోతి రాయ్. ఇక సీరియల్ వల్లే తనకు అంత పాపులారిటీ లభించిందని, తాను బయటికి ఎక్కడికి వెళ్లినా జగతి మేడమ్ అనే గుర్తుపడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్‌ను అందరూ మెచ్చుకుంటూ అంతకంటే వారికి ఇంకేం కావాలి. ఇప్పుడు నటీమణుల విషయానికొస్తే ఈరోజు ఒక హీరోకు హీరోయిన్‌గా నటించిన వాళ్లే రేపు అదే హీరోకు తల్లి పాత్ర పోషిస్తారు. అందుకే నేను అలాంటివాటిని పట్టించుకోను’’ అని తెలిపారు జ్యోతి.
Also Read: బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, భయంగా ఉంది - ఎట్టకేలకు స్పందించిన శ్యామల