Janaki Kalaganaledu May 4th: జానకి బూజు దులుపిన జెస్సి- రామ మీద మరో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసిన ఎస్సై
జానకి వల్ల జ్ఞానంబ కుటుంబం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి వల్లే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని జ్ఞానంబ కోపం పెంచుకుంటుంది. మధుకర్ జానకికి ఫోన్ చేసి మళ్ళీ బెదిరిస్తాడు. వెంటనే జాబ్ కి రిజైన్ చేయాలని లేదంటే తను ఇచ్చే షాక్ కి తట్టుకోలేవని మధుకర్ డిమాండ్ చేస్తాడు. మనోహర్ వెనుక ఉండి ఇలా మాట్లాడిస్తాడు. తన దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది అందుకే అది నా ఇంటికి వచ్చి మరీ నన్ను బెదిరించింది. నీ వాలకం చూస్తుంటే నన్ను జైలుకు పంపించి సారి చెప్పేలా ఉన్నావని భయపడతాడు. జానకిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావ్ చాలా తెగింపు కనిపిస్తుంది ఆడది అనుకుంటున్నావ్ ఏమో చిరుతలా దూసుకుపోతుందని వణికిపోతాడు. జానకి జెస్సితో మాట్లాడుతుంది.
జానకి: ఈ ఇంట్లో ఏం జరిగినా నీకు తెలుస్తుంది కానీ నువ్వు చెప్పడం లేదు ఏం జరిగింది. మీ బావ విషయంలో స్టేషన్ లో జరిగినవన్నీ ఇంట్లో ఎలా తెలుస్తున్నాయ్ ఎవరు చెప్తున్నారు. మన వాళ్ళు ఎవరైనా స్టేషన్ కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారా
Also Read: గదిలో కావ్య అరుపులు, కేకలు- ఇంద్రాదేవి ముందు అడ్డంగా బుక్కైన రాజ్, ఫుల్ కామెడీ
జెస్సి: మీ ఎస్సైకి తప్ప ఆ అవసరం ఎవరికీ లేదు. ఆయనే ఇంటికి వచ్చి నువ్వు దాచిపెట్టిన సీక్రెట్స్ అన్నీ ఇంట్లో చెప్పాడు. బావ దొంగ కేసులో అరెస్ట్ అవడానికి కేవలం నీ మొండితనమే కారణమని చెప్పాడు. నువ్వు తలుచుకుంటే గంటలో బావ కేసు క్లోజ్ అయ్యి ఇంట్లో ఉండేవారు. వేరే ఎవరు చెప్పినా నమ్మేవాళ్ళు కాదు ఎస్సై చెప్పాడు అందుకే నమ్ముతున్నాం. అందుకే ఇంట్లో అందరూ కోపంతో ఉన్నారు
జానకి: నువ్వు కూడానా
జెస్సి: అవును ఇలాగే మొండితనానికి పోతే శత్రువులు బావని వదిలిపెట్టరని చెప్పారు అలాగే జరిగింది. ఖాకీ యూనిఫాం వేసుకున్నందుకు నీ కుటుంబ క్షేమాన్ని తాకట్టు పెట్టడం ఎంత వరకు కరెక్ట్. ఈరోజు దెబ్బలతో వదిలేశారు రేపు ఏమైనా చేస్తారని భయం లేదా
జానకి: భయపడే వాళ్ళు ఖాకీ యూనిఫాం కి పనికిరారు
జెస్సి: అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ నీ బతుకు ఏదో నువ్వు బతకాలి. ఈ కుటుంబాన్ని సమస్యల ఊబిలో పడేసే హక్కు నీకు ఎక్కడిది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావ్ ఏమో ఆలోచించు ప్రవర్తన మార్చుకో. కుదరకపోతే అది మా ఖర్మ అని సరి పెట్టుకుంటాం
రామ అరెస్ట్ కావడానికి ఎస్సై కారణమని పూర్తిగా అర్థం అయ్యింది ఎలాగైనా సీసీటీవీ ఫుటేజ్ సంపాదించాలని అనుకుంటుంది. అప్పుడే మలయాళం భోజనం తిరిగి తీసుకువెళ్తుంటే జానకి ఏమైందని అడుగుతుంది. జ్ఞానంబ తినలేదని చెప్పేసరికి జానకి ఆ భోజనాన్ని తీసుకెళ్తుంది.
Also Read: లాస్యని మెడ పట్టుకుని బయటకి గెంటేసిన నందు- రాజ్యలక్ష్మిపై దివ్యకు మొదలైన అనుమానం
జ్ఞానంబ: నేను నా వయసు పక్కన పెట్టి నిన్ను బతిమలాడుతున్నా కదా రామని విడిపించమని అడుగుతుంటే ఎందుకు వినడం లేదు.
జానకి: కలిపి ముద్దలు పెడతాను తింటూ మాట్లాడుకుందాం ప్లీజ్
జ్ఞానంబ: నేనేమీ చిన్న పిల్లని కాదు నువ్వు మాయం చేయడానికి
జానకి: నేను మీకు కిడ్నీ ఇస్తానని అన్నప్పుడు నా లక్ష్యం గురించి ఆలోచించారు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు
జ్ఞానంబ: నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటే నేను సమర్ధించలేను. నీ స్వార్థం కోసం నువ్వు కుటుంబాన్ని వాడుకున్నావ్. నా బిడ్డని విడిపించే నిర్ణయం తీసుకో అప్పటి వరకు నువ్వు నాకు శత్రువువే