Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
భార్యగా బాధ్యతలు నిర్వర్తించమని జ్ఞానంబ కోడలికి హితబోధ చేస్తుంది. నీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు కలిగే ఆనందం మాతృత్వం పొంది బిడ్డని ఎత్తుకున్నప్పుడే కలిగే ఆనందం కంటే గొప్పది కాదు. ఆడదానికి అమ్మ అని పిలిపించుకోవడం కంటే మరొక అదృష్టం లేదని చెప్తుంది. జానకి గదికి వచ్చి రామని చూస్తుంది. భర్త తన ఇష్టాలని ఎప్పుడు రుద్దలేదని తన వెనుకే నడుస్తూ ఉన్నారని జానకి అనుకుంటుంది. జానకి దిగులుగా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. రెండు రోజుల పాటు భార్య చెప్పినట్టు వినాలని ఎదురు చెప్పకూడదని అంటుంది. రామ ఎక్కడికని అంటే ఎదురు ప్రశ్నలు వేయొద్దని చెప్పేస్తుంది. పొద్దున్నే నిద్రలేచి జానకి భర్తతో సరసాలు మొదలు పెడుతుంది. బయటకి వెళ్దామని లేచి రెడీ అవమని అంటుంది. వెళ్ళేది ఎక్కడికో చెప్పొచ్చు కదా అని రామ బతిమలాడతాడు. కానీ జానకి మాత్రం చెప్పదు.
Also Read: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్
సినిమాకు వెళ్తున్నామా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు కానీ జానకి మాత్రం నో అంటే నో అంటుంది. మీరు థ్రిల్ మిస్ అవకూడదని చెప్పడం లేదని మనసులో అనుకుంటుంది. ఇక జ్ఞానంబ బాబుకి ఆయిల్ రాసి మసాజ్ చేస్తూ ఉంటుంది. భర్త గోవిందరాజులు పక్కనే కూర్చుని సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. మనవడు వచ్చేసరికి తాతయ్య నానమ్మ అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నారని రామ మురిసిపోతాడు. జ్ఞానంబ బాబు సేవలో మునిగిపోతుంది. వాడిని రెడీ చేస్తూ సంతోషంగా ఉంటుంది. మనవడి ధ్యాసలో పడి మందులు వేసుకోవడం మర్చిపోయావని గోవిందరాజులు అంటే వీడు చాలు అన్ని అనారోగ్యాలు పోతాయని అంటుంది. నా పెద్ద కోడలు మనసు మారి బిడ్డని ఎత్తుకునే ఆలోచన వచ్చేలా చూడమని జ్ఞానంబ మనసులోనే దేవుడిని మొక్కుకుంటుంది. జానకి బట్టల బ్యాగ్ సర్దేసి బయటకి వెళ్ళడానికి వస్తారు.
Also Read: చెల్లి అదృష్టాన్ని చూసి అసూయ పడిన స్వప్న- కావ్య తొందరపాటుతో దొరికిపోయిన కనకం
ఎక్కడికి బయల్దేరారని గోవిందరాజులు అడుగుతాడు. ఎక్కడికో తెలియదని రామ జానకి వైపు చూస్తాడు. అసలు ఏం జరుగుతుంది జ్ఞానం అని అంటాడు. ఏదో చెప్పాలని అనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది కళ్ళలో సిగ్గు కనిపిస్తుందని జ్ఞానంబ అనుకుంటుంది. బయటకి వెళ్తున్నారా అని అడుగుతుంది. అవును రెండు రోజులు ఇంటికి రామని జానకి అంటుంది. ఎక్కడికో చెప్పడం లేదు నువవైన అడగమని రామ అంటాడు. జ్ఞానంబ సైగలతో అడిగితే జానకి సిగ్గుతో తలదించుకుంటుంది. ఎక్కడికైన వెళ్లేటప్పుడు అలా అడగకూడదని క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని చెప్తుంది ఆశీర్వదిస్తుంది. వాళ్ళకి డబ్బులు ఇచ్చి జ్ఞానంబ సంతోషంగా పంపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారో తెలియక గోవిందరాజులు బిక్క మొహం వేస్తాడు. జానకి రామని షాపింగ్ కి తీసుకెళ్తుంది. తనకి ఇప్పుడెందుకు అంటుంటే అవును నిజమే స్నానానికి వెళ్తున్నట్టు ఆ మెడలో టవల్ మీరు అని కామెంట్ చేస్తుంది. ఇది తనకి బాగా కలిసొచ్చిన టవల్ గబ్బర్ సింగ్ టవల్ అని అంటాడు. టవల్ గబ్బర్ సింగ్ తనకి వద్దని షర్ట్ వేసుకున్న గబ్బర్ సింగ్ కావాలని చెప్పి డ్రస్ సెలెక్ట్ చేస్తుంది.