News
News
X

Janaki Kalaganaledu February 6th: మలయాళం వంటలు తినలేకపారిపోయిన విష్ణు - మల్లికకి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన జానకి

రామా చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం అప్పుల పాలు అవుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

మల్లికతో వంటలు చేయించి సోషల్ మీడియాలో పెట్టి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేస్తుంది. అటు వంకాయ కూర ఇంకా ఘుమఘుమలాడటం లేదు ఏంటా అని గోవిందరాజులు ఎదురుచూస్తాడు. సోషల్ మీడియాలో బోలెడు వంటలు ఉంటాయని మల్లిక చెప్తుంది. వంటలు చేసేది నువ్వు నీ పేరు పెట్టుకుని నేను డబ్బులు సంపాదిస్తానని మనసులోనే తెగ డాన్స్ లు వేస్తుంది. ఆవిడ దగ్గరకి వంటలు నేర్చుకోవాలని మలయాళం ప్లాన్ వేస్తాడు. మల్లిక మాటల అల్లిక అంటూ యూట్యూబ్ లో వీడియోలు పెట్టేందుకు రెడీ అయిపోతుంది. సందు దొరికింది కదా అని మల్లికతోనే మలయాళం వంట చేయించేస్తాడు.

Also Read: స్వప్నకి కుజదోషం, కనకం నెత్తిన పిడుగు- మళ్ళీ గొడవపడిన రాజ్, కావ్య

రామా పెట్టిన వ్యాపారం బాగా సాగుతోంది. అక్కడికి సిఐ వచ్చి స్వీట్స్ కావాలని అడుగుతాడు. మీ షాపు కూడా చూద్దామని వచ్చానని చెప్తాడు. ఆ పోలీసాఫీసర్ ని రామా అలాగే చూస్తూ ఉంటాడు. యూనిఫామ్ వేసుకోవాలని చిన్న నాటి కల అని రామా చెప్తాడు. బాగా చదువుకుంటే పోలీస్ ఉద్యోగం సంపాదించవచ్చని పోలీస్ చెప్తాడు. ఉద్యోగం సంపాదించాలంటే ముందు ఫిట్ గా ఉండాలి, బాగా కసరత్తులు చేయాలని అంటాడు. ఆడవాళ్ళు కూడా చేయాలా అని అమాయకంగా అడుగుతాడు. ఎవరైనా సరే ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలని అనేసరికి జానకిని శారీరకంగా ధృడంగా ఉండేలా చూసుకోవాలని అనుకుంటాడు. మల్లిక కూడా వంట చెయ్యడం చూసి విష్ణు భయపడతాడు.

మలయాళం చేసిన వంట రెడీ అయిపోయిందని గోవిందరాజులు తెగ సంబరపడిపోతాడు. కూర చూసి జ్ఞానంబ బిత్తరపోతే గోవిందరాజులు మాత్రం సూపర్ ఆహా.. ఓహో అని తెగ మాటలు చెప్తాడు. తీరా కూర చూసి ఏంటి ఇది అని కాసేపు తిడతాడు. అది చూసి జ్ఞానంబ నవ్వుతుంది. విష్ణు కోసం మల్లిక గుత్తి బంగాళాదుంప అని కొత్త కూర వండాను అని చెప్పేసరికి అందరూ నోరెళ్ళబెడతారు. అందరూ తినకుండా తప్పించుకుని వెళ్లిపోతే విష్ణు మాత్రం బలైపోతాడు. ఆ చేసిన వంటలన్నీ తినలేక పారిపోతాడు. రామా బండి దగ్గరకి జానకి వచ్చి డబ్బులు ఏమైనా మిగిలాయా అని అడుగుతుంది.  జానకి కాలేజ్ ఫీజు అడగటానికి వచ్చి ఆగిపోతుంది. సరుకుల షాపులో పెట్టిన అప్పు తీర్చాలని రామా చెప్తాడు. దీంతో జానకి ఫీజు కోసం డబ్బులు ఆడకుండా ఉండిపోతుంది. 

Also Read: ఇగో మాస్టర్ వంకర ప్రశ్నలు, పొగరు తిక్క సమాధానాలు- రిషిధారని కలిపేందుకు మహేంద్ర స్కెచ్

మల్లిక ఫోన్ చూస్తూ మలయాళం చేసిన వంట వీడియో కి మంచి లైక్లు వచ్చాయని అబద్ధం చెప్తుంది. అదంతా విని మలయాళం తెగ పొంగిపోతాడు. అప్పుడే రామ వాళ్ళు వస్తారు. వాళ్ళని అవమానించడం కోసం మల్లిక కావాలని మాటలు అంటుంది. ఆయన సొంతంగా వ్యాపారం చేసుకోవడం కదా ఎప్పుడంటే అప్పుడు వస్తారు కానీ విష్ణు అలా కాదు కదా ఒకరి కింద పని చేయాలని జానకి గట్టిగానే సమాధానం ఇస్తుంది.

Published at : 06 Feb 2023 11:19 AM (IST) Tags: janaki kalaganaledu serial today episode Janaki Kalaganaledu Serial Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial February 6th Update

సంబంధిత కథనాలు

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Aakhil Sarthak - BB jodi: ‘బీబీ జోడీ’ ఎలిమినేషన్‌పై అఖిల్ ఆగ్రహం? నా నొప్పి తెలియాలంటూ వీడియో!

Aakhil Sarthak - BB jodi: ‘బీబీ జోడీ’ ఎలిమినేషన్‌పై అఖిల్ ఆగ్రహం? నా నొప్పి తెలియాలంటూ వీడియో!

Janaki Kalaganaledu March 20th: జానకి మీద పిచ్చికుక్కలా విరుచుకుపడిన మనోహర్- ఐపీఎస్ కల చేదిరిపోతుందా?

Janaki Kalaganaledu March 20th: జానకి మీద పిచ్చికుక్కలా విరుచుకుపడిన మనోహర్- ఐపీఎస్ కల చేదిరిపోతుందా?

Gruhalakshmi March 20th: అందరి ముందు తులసిని క్షమాపణలు అడిగిన నందు- పంతం నెగ్గించుకున్న రాజ్యలక్ష్మి

Gruhalakshmi March 20th: అందరి ముందు తులసిని క్షమాపణలు అడిగిన నందు- పంతం నెగ్గించుకున్న రాజ్యలక్ష్మి

Guppedanta Manasu March 20th: ఇద్దరూ ఇద్దరే తగ్గేదెలే- రిషిధార చిలిపి గిల్లికజ్జాలు, పెళ్లి చేద్దామన్న మహేంద్ర

Guppedanta Manasu March 20th: ఇద్దరూ ఇద్దరే తగ్గేదెలే- రిషిధార చిలిపి గిల్లికజ్జాలు, పెళ్లి చేద్దామన్న మహేంద్ర

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌