Janaki Kalaganaledu మే 26 (ఈరోజు) ఎపిసోడ్: జానకీ,రామా వైజాగ్ వెళ్లొద్దన జ్ఞానాంభ- విష్ణు ప్లాన్‌తో బుక్కైన మల్లిక
మల్లిక, లీలావతి వేసిన ప్లాన్‌ను తెలుసుకున్న విష్ణు... జానకి, రామాను పెళ్లికి పంపేలా ప్రయత్నిస్తాడు. మల్లికనే పావుగా వాడి వాళ్లిద్దరు పోటీలకు వెళ్లేలా చేస్తాడు.
అంతా కలిసి జ్ఞానాంభను ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు. మధ్యలో కలుగజేసుకున్న మల్లీ... తాను భర్తతో కలిసి వెళ్తామని చెబుతుంది. సైలెంట్‌గా ఉండమని గోవిందరాజు ఆమెను వారిస్తాడు. రామను జానికిని పెళ్లికి పంపిద్దామని అని జ్ఞానాంభను అడుగుతాడు గోవిందరాజు. సరే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది జ్ఞానాంభ.
మల్లి వేసిన ప్లాన్ ప్రకారం చిట్టిబాబు అనే వ్యక్తిని లీలావతి పంపిస్తుంది. అతనికి లక్ష రూపాయలు ఇచ్చి.. స్వీట్స్ ఆర్డర్ ఇవ్వమని చెబుతుంది. చిట్టిబాబు ఇంట్లోకి వచ్చి... తన ప్లాన్ వర్కౌట్ చేస్తాడు.
పెళ్లి కోసం రెండు వేల మందికి స్వీట్స్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చానని చెబుతాడు చిట్టిబాబు. లక్షరూపాయలు అడ్వాన్స్ కూడా ఇస్తాడు. అయితే అదే రోజు తమ కుమారుడు పెళ్లికి వెళ్తున్నాడని... అందుకే ఆర్డర్ తీసుకోలేమని గోవిందరాజు సమాధానం చెప్తాడు. ఆడపిల్ల పెళ్లని సెంటిమెంట్‌ను వాడతాడు చిట్టిబాబు. మధ్యలో మల్లిక కలుగజేసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ వారిస్తారు. చిట్టిబాబు మాత్రం తన పట్టు విడవకుండా జ్ఞానాంభను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.
చిట్టిబాబు ప్రయత్నం ఫలిస్తుంది. జ్ఞానాంభ ఆర్డర్ తీసుకుంటుంది. స్వీట్స్ ఇచ్చి పంపిస్తామంటూ మాట ఇస్తుంది. రామ లేకపోతే స్వీట్స్ ఎవరు రెడీ చేస్తారని గోవిందరాజు ప్రశ్నిస్తాడు. రామ ఆ పెళ్లికి వెళ్లకపోయిన ఫర్వాలేదని... మల్లికను విష్ణును పెళ్లికి పంపిద్దామని సలహా ఇస్తుంది. మొత్తానికి మల్లిక వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. పెళ్లిపేరుతో పోటీలకు వెళ్దామనుకున్న జానకీ రామ ప్లాన్ బెడిసి కొడుతుంది.
జానకీ,రామను వైజాగ్‌కు వెళ్లకుండా లీలావతితో కలిసి మల్లి వేసిన ప్లాన్ వరౌట్ అవుతుంది. లీలావతికి పట్టుచీర ఇచ్చేందుకు వచ్చిన మల్లికను విష్ణు చూస్తాడు వాళ్లిద్దరి డిస్కషన్ దొంగచాటున షూట్ చేస్తాడు. లీలావతికి చీర ఇచ్చేసి మల్లిక బయల్దేరుతుంది. వైజాగ్‌కు వెళ్తామన్న ఆనందంలో ఉంటుంది మల్లిక. అక్కడే ఉన్న విష్ణు షూట్ చేసిన వీడియో చూపిస్తాడు. ఏదోలా జానకి,రామను వైజాగ్ పెళ్లికి వెళ్లేలా చేయాలని మల్లికకు వార్నింగ్ ఇస్తాడు భర్త విష్ణు.
వైజాగ్ ట్రిప్క్ క్యాన్సిల్ అయిందని బాధలో ఆలోచిస్తూ కూర్చుంటారు జానకి, రామా. వాళ్ల పరిస్థితి చూసి జ్ఞానాంభ... అంతలా ఆలోచించే విషయం ఏంటని ప్రశ్నిస్తుంది. ఈ మధ్య నా రామా... రామాలా లేడని అంటుంది జ్ఞానాంభ. అంత పెద్ద ఆర్డర్ వస్తే ఎగిరి గంతేసేవాడని.. దేని గురించి ఆలోచిస్తున్నావో తనకు తెలుసంటుంది జ్ఞానాంభ. స్వీట్స్ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావని కవర్ చేస్తుంది జ్ఞానాంభ. ఇంతలో గోవిందరాజు అక్కడకు వచ్చి... జానకీరామా వైజాగ్ వెళ్తుంటే ఈ ఆర్డర్ తీసుకోవడం అవసరమా అని అడుగుతాడు. పెళ్లికి మల్లికను వెళ్లమని చెప్పాం కదా.. సమస్యేంటని ప్రశ్నిస్తుంది జ్ఞానాంభ. ఇంతలో మల్లిక వచ్చి లక్షరూపాయలు ఇచ్చేస్తే చిట్టిబాబుకు తిరిగి ఇచ్చేద్దామని అంటుంది. అతను నీకు తెలుసా అని జ్ఞానాంభ ప్రశ్నిస్తే... అతన్ని పంపించిందే నేనని ఫ్లోలో చెప్పేస్తుంది.. అంతే ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అవుతారు.