అన్వేషించండి

Jagadhatri Serial Today May 13th: అవినాష్‌ను త్రిశూలంతో పొడిచి చంపేసిన జేడీ..కేదార్‌ సుధాకర్‌ కొడుకేనన్న సాక్ష్యాలు కాపాడిన జగధాత్రి

Jagadhatri Serial Today Episode May13th: అవినాష్‌ను త్రిశూలంతో పొడిచి చంపేసిన జేడీ..కేదార్‌ సుధాకర్‌ కొడుకేనన్న సాక్ష్యాలు కాపాడిన జగధాత్రి

Jagadhatri Serial Today Episode: అవినాష్‌ పెట్టిన బాంబుతోనే అతని ఫ్రెండ్‌ను కేడీ చంపడంతో భయపడిపోయిన మీనన్‌...అవినాష్‌ను తీసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు.ఆ జేడీ సంగతి నీకు తెలియదని...ఖచ్చితంగా నిన్ను చంపేస్తుందని చెబుతాడు. నీ దగ్గర ఉన్న జేడీకి సంబంధించిన సాక్ష్యాలు నాకు ఇచ్చేసి నువ్వు విదేశాలకు పారిపోతే కనీసం ప్రాణాలు అయినా దక్కుతాయని అంటాడు.దీనికి అవినాష్‌ ససేమీరా ఒప్పుకోడు. ఆ జేడీని చంపిన తర్వాతే నేను ఇక్కడ నుంచి వెళ్తానని అంటాడు. ఇంతలో భక్తులందరినీ క్లియర్‌ చేసి పోలీసులు జాతర సాఫీగా సాగేట్లు చేస్తారు.

మినిస్టర్‌ రాయుడు బయటకు రాగా...పోలీసులు అతన్ని సెక్యూరిటీ రీజన్‌తో లోపలికి పంపిస్తారు. ఇప్పుడు అవినాష్‌ను పట్టుకోవడం ఎలా అని రమ్య అనగా...నేను కనిపిస్తే చాలు వాడంతట వాడే వస్తాడని జేడీ చెబుతుంది. అనుకున్నట్లే మీనన్‌ అవినాష్‌ను తీసుకుని జేడీ వ‌ద్దకు వస్తాడు. తన ఫోన్‌లో ఉన్న ఫొటోలు చూపిస్తూ....నేను జేడీని చంపిన తర్వాత ఈ ఫోన్‌ నీకు ఇస్తానని అప్పుడు ఈ ముసుగు వెనక ఉన్న ముఖం అందరికీ తెలిసేలా చేయమని చెబుతాడు. దీంతో జేడీ అవినాష్‌ను రెచ్చగొట్టి తనతో తలపడేలా చేస్తుంది.

Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున కలలో కనిపించిన బిడ్డ ఎవరు? విహారికి ప్రమాదం పొంచి ఉందా! కడుపులో బిడ్డకా!

జేడీ మీదకు వెళ్లిన అవినాష్‌ను ఇరగ్గొడుతుంది. ఈ క్రమంలో అవినాష్‌ చేతిలో ఉన్న ఫోన్‌ జేడీ లాక్కోగా.....జేడీ ముఖానికి ఉన్న ముసుగు అవినాష్‌ లాగేస్తాడు. జేడీ ముఖం కనిపిస్తుందని మీనన్‌ ఆశపడగా... జేడీ తన ముఖానికి పసుపు, కుంకమ రాసుకుని త్రిశూలం పట్టుకుని వస్తుంది. అదే త్రిశూలంతో  అవినాష్‌ను పొడిచి చంపేస్తుంది. అవినాష్‌ చనిపోగానే....మినిస్టర్‌ అక్కడికి పరుగులు పెట్టుకుంటూ వస్తాడు. మేం ముందే చెప్పాంకదా తప్పు  ఒప్పుకుంటే కనీసం ప్రాణాలు అయినా దక్కేవని అని జేడీ  అంటుంది. ఈగొడవ జరుగుతుండగానే మీనన్‌ పారిపోతాడు.

Also Read:బయటపడుతున్న పార్లలమ్మ పాపాల చిట్టా, ఎంక్వైరీ మొదలుపెట్టిన బాలు - గుండెనిండా గుడిగంటలు మే 13 ఎపిసోడ్

సాక్ష్యాలు నాశనం చేసేందుకు యువరాజు మహల్‌కు వచ్చి వీరశంకర్‌ను కొడతాడు. చంపడానికి ట్రై చేస్తుండగా వీరశంకర్‌ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని జగధాత్రికి ఫోన్ చేస్తాడు. యువరాజు వచ్చాడని సాక్ష్యాల కోసం గొడవ చేస్తున్నాడని చెబుతాడు. వెంటనే సాక్ష్యాలు ఇచ్చేయమని పోలీసులు వచ్చి మిమ్మల్ని కాపాడతారని చెబుతాడు. యువరాజు సాక్ష్యాలు సంపాధించి బూడిద చేసి వీరశంకర్‌ను చంపడానికి ప్రయత్నించేలోగా  పోలీసుుల వచ్చి కాపడతారు. పోలీసులను చూసి యువరాజు అక్కడికి నుంచి పారిపోతాడు.

Also Read:నిండు మనసులు: మామ కుటుంబాన్ని రంజిత్‌ కలుపుతాడా! ప్రేరణని ఎత్తుకొని సిద్ధూ ముడుపు కట్టిస్తాడా!

ఇంటికి వెళ్లి సాక్ష్యాలు నాశనం చేశానని నిషిక, వైజయంతికి చెబుతాడు. ఆ ముసలోడిని కూడా చంపేద్దామనుకునేసరికి పోలీసులు వచ్చారని చెబుతాడు.ఇది విన్న సుధాకర్‌ కొడుకుపై మండిపడతాడు. అసలు మీరు ఇంత రాక్షసుల్లా ఎలా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మీరు చేసిన తప్పులను నేను సరిదిద్దుతుంటే నాకు కృతజ్ఞతలు చెప్పాల్సిందిపోయి కోప్పడతారా అని యువరాజు తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేసి  వెళ్లిపోతాడు.

Also Read:మేఘసందేశం’ సీరియల్‌: శరత్ చంద్రను ఓదార్చిన భూమి – కొత్త ప్లాన్‌ వేసిన అపూర్వ

యువరాజు సాక్ష్యాలు నాశనం చేయడంతో వీరశంకర్‌ వీరావేశంతో సుధాకర్‌ వద్దకు వచ్చి నిలదీస్తాడు. మర్యాదగా కేదార్ నీకొడుకు అన్న నిజం ఒప్పుకోమని అడుగుతాడు. ఇప్పుడు నేను ఏం మాట్లాడలేనని సుధాకర్ చెబుతాడు. నిషిక,వైజయంతి మాటిమాటికి మా ఇంటికి వచ్చి గొడవ చేస్తారేంటని నిలదీస్తుంది. ఈ యువరాజు సాక్ష్యాల కోసం వచ్చి ఉంటే  వదిలిపెట్టేవాడనని కానీ తాతయ్య ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడని మండిపడతాడు. దీంతో కౌషికి యువరాజును నిలదీస్తుంది.అసలు నువ్వు మహల్‌కు వెళ్లావా లేదా అని అడుగుతుంది.తాను వెళ్లలేదని అబద్ధం చెబుతాడు.

Also Read:మాధవ్ ఇంటికి భర్తతో కలిసి భోజనానికి వచ్చిన గాయత్రి...అడ్డుచెప్పబోయిన తల్లిపై మండిపాటు

వాళ్ల దగ్గర సాక్ష్యాలు లేవన్న ధైర్యంతో నిషిక....జగధాత్రికి ఛాలెంజ్ చేస్తుంది. కేదార్‌ మామయ్య కొడుకేనన్న సాక్ష్యాలు ఉంటే ఇవ్వండని...మేమే అందరి ముందు కేదార్ మామమ్య కొడుకని ప్రకటిస్తామని అంటుంది.వైజయంతి వారిస్తున్నా వినకుండా సవాల్ విసురుతుంది.యువరాజు కూడా ఒప్పుకుంటానని అంటాడు.అయితే ఇవిగో సాక్ష్యాలని కేదార్ చూపిస్తాడు. అవి చూసిన నిషిక, యువరాజు షాక్‌ తింటారు. అవన్నీ డూప్లికేట్ సాక్ష్యాలని ఒరిజనల్ నేను కాల్చివేశానని మాట జారతాడు. నువ్వు మామధ్య మనిషిని పెడితే మేం కనుక్కోలేమనుకున్నావా అని జగధాత్రి యువరాజును నిలదీస్తుంది. మేం ఒరిజనల్ దాచిపెట్టి డూప్లికేట్ అక్కడ పెట్టామని....నువ్వు కాల్చివేసింది అవేనని చెప్పడంతో కంగుతింటాడు. 

మరిన్ని ఆసక్తికరమైన ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget