Jagadhatri Serial Today November 7th: జగద్ధాత్రి సీరియల్: వనజ నిజంగా శ్రీవల్లి తల్లేనా! వైజయంతి మోసం బయటపడుతుందా?
Jagadhatri Serial Today Episode November 7th శ్రీవల్లి తల్లిగా వైజయంతి ఒకామెను తీసుకు వచ్చి ఇంట్లో అందరికీ చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode వైజయంతిని అందరూ అసహ్యించుకుంటారు. వైజయంతి సుహాసిని ఫొటో చూసి ఇదంతా నీ వల్లే కదా.. శ్రీవల్లి అడ్డు తొలగించుకుంటా.. నా మీద పడిన నింద తుడిచేసుకుంటా.. అమ్మతోడు దాన్ని ఇక ఎప్పటికీ కనిపించకుండా చేస్తా అని అనుకుంటుంది.
మీనన్ జేడీని తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అసలీ జేడీ ఎవరు.. నా వల్ల నష్టపోయిన వారిలో ఎవరికి చెందింది అని అనుకుంటుంది. నా నుంచి నాకు అన్నీ దూరం చేస్తుంది. నా మనుషుల్ని దూరం చేస్తుంది. అసలు జేడీకి నేనేం అన్యాయం చేశాను అని ఆలోచిస్తుంటాడు. జేడీ కూడా ఇదే టైంలో మాట్లాడుకుంటూ ఉంటుంది. నేను ఎవరో తెలుసా నేను కావ్య కూతురు అని తెలిసిన రోజే ఈ భూమ్మీద నీకు ఆఖరి రోజు అని అంటుంది. ఇక మీనన్ అయితే నాకు ఈ భూమ్మీద చివరి రోజు వచ్చినా సరే ఈ జేడీ ఎవరో తెలుసుకుంటా అని అనుకుంటాడు. నన్ను నేల మీదకి జేడీ తెచ్చేసింది.. జేడీని ఆపాలి అని మీనన్ దేవాతో చెప్తాడు. జేడీ కాళికా మాత.. తనో సముద్రం.. అయినా సరే నేనేంటో ఆ జేడీకి చూపిస్తా అని అంటాడు. ఇక జేడీ కూడా నువ్వు చంపింది నా తల్లిని మీనన్.. వెంటాడి వేటాడి నిన్ను చంపుతా.. అని అనుకుంటుంది.
వైజయంతి వైజయంతి అనుకుంటూ వనజ అనే పెద్దావిడ వస్తారు. ఎవరు అని వైజయంతి వస్తుంది. ఇక వనజ వైజయంతితో నేను వనజ అండీ నా బిడ్డ ఎక్కడుందో చెప్పండి అని ఏడుస్తుంది. వైజయంతి గుర్తు పట్టి నువ్వా వనజ 20 ఏళ్లు అయింది కదా గుర్తు పట్టలేదు అని అంటుంది. నా బిడ్డని చూడాలి అని అంటుంది. వైజయంతి శ్రీవల్లిని చూపించి తనే నీ కూతురు అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు.
వనజ శ్రీవల్లిని ముద్దాడి ఎంత ఎదిగిపోయావు అమ్మా.. దుర్మార్గురాలిని.. నిన్ను కని నడిరోడ్డు మీద వదిలేశా నన్ను క్షమించు అమ్మా అని ఏడుస్తుంది. అందరూ షాక్ అయి చూస్తారు. శ్రీవల్లికి నేను కన్నతల్లిని అమ్మా.. నవమాసాలు మోసి కనింది నేనే దానికి సాక్ష్యం ఈ వైజయంతి గారే అని అంటుంది. ఊరిలో గొడ్లసావడిలో బిడ్డను కని ఇంటికి తీసుకెళ్లలేక ఏం చేయాలో తెలీక ఉంటే దేవతలా వైజయంతి గారు వచ్చి కాపాడారు అని అంటుంది.
వైజయంతి అంతా నిజమే ఈ వనజ ఎక్కడుందో తెలీక ఇన్ని రోజులు మీకు సమాధానం చెప్పలేక ఉండిపోయా.. ఏ దేవుడో కరుణించాడు. వనజ అనాథాశ్రమంలో అడగానే నా గురించి చెప్పారంట అందుకే ఇక్కడికి వచ్చిందని అంటుంది. శ్రీవల్లి ఈవిడే నీకు జన్మనిచ్చిన తల్లి అని వైజయంతి అంటుంది. దానికి శ్రీవల్లి నాకు నమ్మకం కుదరడం లేదు.. ఈవిడ నాకు తల్లి అయితే మరి నాకు వేరే ఫోటో ఎందుకు ఇచ్చారు అని అంటుంది. గురువుగారు నా ఫోటో ఇవ్వకుండా వేరేది ఇచ్చేసుంటారు అని అంటుంది వైజయంతి.
కేథార్ శ్రీవల్లికి నీకు ఇచ్చిన ఫోటో తీసుకురమ్మని అంటాడు. శ్రీవల్లి వెళ్లి తీసుకొచ్చి జగద్ధాత్రికి ఇస్తుంది. జగద్ధాత్రి చూసి షాక్ అయిపోతుంది. వైజయంతి తీసుకొని అందరికీ చూపిస్తుంది. అందులో వనజ ఫొటోనే ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో సుహాసిని ఫోటో తీసేసి వనజ ఫొటో పెట్టుంటుంది. శ్రీవల్లి కూడా చూసి షాక్ అయిపోతుంది. గురువుగారు నాకు ఈ ఫొటో ఇవ్వలేదు అది వేరే ఫొటో అని శ్రీవల్లి చెప్తుంది. గురువుగారు వేరే ఫోటో ఇచ్చుంటారు అని అంటుంది. వనజ శ్రీవల్లిని తీసుకెళ్లిపోవాలి అంటుంది. జగద్ధాత్రి ఆపి ఏ సంవత్సరం పుట్టింది.. ఏ ఊరిలో కన్నారు అని అడిగితే వనజ మనసులో ఈ వైజయంతి నాకు ఏం చెప్పలేదు అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















