అన్వేషించండి

Jagadhatri Serial Today June 30th:కాత్యాయినీ కళ్లల్లో కంగారు ఎందుకు..? కాచీ తీసుకెళ్తున్న బ్యాగ్‌లో ఏముంది..?

Jagadhatri Serial Today Episode June 30th: కాత్యాయినీని అనుమానించిన భర్త బుజ్జిబాబు..దయామయి ఆశ్రమానికి వెళ్తున్నానని చెప్పిన కాత్యాయినీ మాటలు విని షాక్‌ తిన్న జగధాత్రి, కేదార్‌

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. కాత్యాయినీ తనతో చెప్పకుండా ఈ మధ్య బయటకు వెళ్తుందని భర్తు బుజ్జి అనుమానిస్తాడు. దీంతో తాను పిల్లల కోసం దయామయి ఆశ్రమానికి వెళ్లి పూజలు చేస్తున్నానని చెప్పడంతో జగధాత్రి,కేదార్ కంగారుపడతారు. ఆమెను అనుసరిస్తూ వెళ్లి రౌడీల బారీ నుంచి కాచీని కాపాడటంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా మారుతుంది.
స్వయంగా వంటలుచేసిన నిషిక
                     చెల్లెలు నిషికలో వచ్చిన మార్పులు చూసి జగధాత్రి ఆనందంతో ఉబ్బితబ్బివుతుంది. అక్క చేతికి దెబ్బ తగిలిందని ఉదయాన్ని లేచి నిషిక ‌స్వయంగా  టిఫిన్ రెడీ చేస్తుంది. జగధాత్రికి ఇష్టమని దోసెలోకి చికెన్ కర్రీ చేసి ...అక్కాబావా త్వరగా రండంటూ పిలవడంతో కేదార్ షాక్‌ తింటాడు. మీ చెల్లికి ప్రేమ వచ్చినా,కోపం వచ్చినా తట్టుకోలేమని అంటాడు.కిందకు వెళ్లి అందరూ సంతోషంగా  టిఫిన్ తినడానికి కూర్చుంటారు. నిషికలో వచ్చిన మార్పు చూసి సుధాకర్‌, కౌషికి చాలా సంతోషపడతారు. వైజయంతి మాత్రం రుసరుసలాడుతుంది.యువరాజు ఎక్కడ అని అడిగితే అప్పుడే తల పట్టుకుని కిందుకు వచ్చిన యువరాజును కౌషికి నిలదీస్తుంది. నువ్వు అసలు ఆ సోనీ ఇంటికి ఎందుకు వెళ్లావని అడుగుతుంది.కారు టైరు పంక్చర్‌ అయితే ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తానని చెప్పి సోనీ వాళ్ల ఇంటికి తీసుకెళ్లిందని అక్కడ అనుకోకుండా మందు తాగాల్సి వచ్చిందని చెప్పి సారీ చెబుతాడు. నువ్వు నాకు కాదు నిషికకు సారీ చెప్పమని చెప్పడంతో యువరాజు ఆమెకు సారీ చెబుతాడు.
కాచీని అనుమానించిన బుజ్జి
                        కాచీ బయటకు వెళ్తుంటే అడ్డుకున్న ఆమె భర్త బుజ్జి ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకపోతే ఇప్పుడు పంపించేది లేదని అంటాడు. మర్యాదగా ఎవరిని కలవడానికి వెళ్తున్నావని నిలదీస్తాడు. దీంతో కౌషికి వచ్చి ఎందుకు కాచీపై కోపంగా ఉన్నావని అడుగుతుంది. మీచెల్లి ఈ మధ్య కాలంలో నాకు చెప్పకుండా బయటకు వెళ్తుందని....పదేపదే ఫోన్‌లు మాట్లాడుతుందని చెబుతాడు. అంటే కాచీనీ అనుమానిస్తున్నావా అని సుధాకర్‌ నిలదీస్తాడు. ఇప్పుడు నిజం చెప్పకపోతే అదే పని చేయాల్సి ఉంటుందని అంటాడు. దీంతో జగధాత్రి కలుగజేసుకుని కాచీని అడుగుతుంది. ఎక్కడకి వెళ్తున్నావో కనీసం నీ భర్తకు అయినా చెప్పాలి కదా అని అంటుంది. మాకు పిల్లలు లేకపోవడంతో దయామయి ఆశ్రమానికి వెళ్లి పూజలు చేస్తున్నానని....మళ్లీ ఈయనకు చెబితే ఆశలు పెంచుకుంటాడని చెప్పడం లేదని అంటుంది. ఆ మాటలు విన్న జగధాత్రి, కేదార్ షాక్‌ తింటారు. కాచీ కళ్లల్లో కంగారు చూసి వాళ్లు కూడా  అనుమానిస్తారు. ఆ తర్వాత కాచీ బయటకు వెళ్లిపోతుంది.
కాచీని కాపాడిన జేడీ, కేడీ
                           కాచీ బ్యాగ్‌లో ఖచ్చితంగా మత్తు పదార్థాలు ఉన్నాయని అనుమానించిన జేడీ,కేడీ ఇద్దరూ ఆమెను ఫాలో అవుతారు. ఆమె ఆ డ్రగ్స్‌ పోలీసులకు ఇవ్వడానికి వెళ్తుందని తెలుసుకుని రౌడీలు అడ్డగించి కాచీని చంపడానికి ప్రయత్నించగా జేడీ, కేడీ ఇద్దరూ అడ్డుకుని వారిని విరగ్గొడతారు. ఇంతలో రౌడీలు కాచీ దగ్గర ఉన్న మత్తుపదార్థాలు లాక్కుని పారిపోతారు. ప్రాణభయంతో వణికిపోతున్న కాచీ దగ్గరకు వచ్చిన జేడీ...మరేం భయం లేదని చెబుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పమని అంటుంది.నేను చెప్పేది మీరు నమ్మలేరని,....అందుకు కావాల్సిన ఆధారాలు నా దగ్గర లేవని కాచీ అంటుంది. దయామయి ఆశ్రమంలో డ్రగ్స్‌ దందా గురించేనా నువ్వు చెప్పేది అని చెప్పగానే కాచీ షాక్ తింటుంది.అసలు నువ్వు ఎలా ఈవలలో చిక్కావని అడుగుతుంది జేడీ. పిల్లల కోసం ఆశ్రమానికి వెళ్లగా...పదిరోజుల తర్వాత ఓ భక్తురాలికి డబ్బులు అవసరం వచ్చిందని....తక్కువ ధరకే నగలు వస్తున్నాయని అవి తీసుకుని ఆమెను ఆదుకోవాలని మాతాజీ చెప్పిందని అంటుంది.అవి కొన్న తర్వాత మరో పదిరోజులకు డ్రగ్స్‌ తీసుకొచ్చి నా ముందు పెట్టారని....నువ్వు వజ్రపాటి వారి కూతురువి కాబట్టి నిన్ను ఎవరూ చెక్‌ చేయరని...కాబట్టి ఇవన్నీ అమ్మిపెట్టాలంటూ నాపై ఒత్తిడి తెచ్చారని చెబుతుంది.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget