అన్వేషించండి

Jagadhatri Serial Today June 3rd: చిలకమ్మపై బలపడిన నిషిక అనుమానం....జగధాత్రిని ఇంట్లో నుంచి తరిమివేయడానికి ఎత్తులు

Jagadhatri Serial Today Episode June3rd:చిలకమ్మ మాటలకు నిషికకు అనుమానం మరింత పెరుగుతుంది. ఆవిడ మా రాగిణి అత్తయ్యేనంటూ యువరాజుతో చెప్పడంతో ఇవాల్టి ఏపీసోడ్ ఆసక్తిగా మారుతుంది.

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు  ట్విస్టులతో అదిరిపోయింది. చిలకమ్మ  మాటలతో నిషిక అనుమానం బలపడటంతో ఆవిడ సంగతి చూడాలని యువరాజు,కౌషికితో అంటుంది.వీల్‌ఛైర్‌ నుంచి పడబోయిన సుధాకర్‌ను కేదార్‌ కాపాడినా...నిషికి వాళ్లు అవమానించడంతో ఇవాల్టి  ఏపిసోడ్ అద్భుతంగా సాగుతుంది.

చిలకమ్మకు నిషిక వార్నింగ్

చిలకమ్మ మాటలు విని దగ్గరకు వచ్చిన నిషిక...మా ఇంట్లో పదేళ్ల క్రితం జరిగిన విషయాలు నీకు ఎలా తెలుసునని అంటుంది. ఇంతలో కేదార్ కల్పించుకుని ఆవిడ చిలకమ్మ శ్రీకాకుళం నుంచి వచ్చిందని చెప్పాం కదా అని అంటాడు. నాకు అదే డౌట్ వస్తుందని నిషిక అంటుంది. శ్రీకాకుళంలో ఉన్న చిలకమ్మకు...హైదరాబాద్‌లో పదేళ్ల క్రితం జరిగిన విషయాలు ఎలా తెలిశాయా అని అనుమానం వస్తోందని నిలదీస్తుంది. ఇంతలో జగధాత్రి కల్పించుకుని నేనే చెప్పానని అంటుంది. బడిలో ఖాళీ సమయంలో నా దగ్గరకు వచ్చి మీ లవ్‌స్టోరీ చెప్పమంటే అప్పుడప్పుడు నేనే చెప్పేదాన్నని అంటుంది. మా నాన్నను పిలిచి నువ్వు చెప్పిందంతా నిజమో కాదో తెలుసుకుంటానని నువ్వు అబద్ధం చెప్పినట్లు తేలితే పోలీసులను పిలిపిస్తానని నిషిక హెచ్చరిస్తుంది. ఆమెపై కోపంతో మండిపడిన నిషిక రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరింత మంది సీరియల్ నటులు గురించి ఇక్కడ తెలుసుకోండి

1 నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా..
2 గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఇంటి పెద్ద సత్యం అసలు పేరు
3 బుల్లితెరపై రాణిస్తున్న అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
4 గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్ గ్రౌండ్ తెలుసా!
5 ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి.. కలవారి కోడలు 'కనకమహాలక్ష్మి' రియల్ లైఫ్ విషయాలు

నిషికకు నాపై అనుమానం మరింత పెరిగిందని రాగిణి భయపడిపోతుంది. ఒకవేళ నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే...మీరు అబద్ధం చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని కౌషికికి చెప్పి మిమ్మల్ని బయటకు గెంటివేయిస్తుందని అంటుంది.అందుకే నన్ను బయటకు వెళ్లనివ్వండని కోరుతుంది. దీంతో జగధాత్రి వాళ్ల అత్తయ్యకు సర్దిచెబుతుంది.నిషిక కోపం నీకు తెలిసిందే కదా అని అంటుంది.దీంతో రాగిణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నిజంగా  నిషికకు అనుమానం రాలేదా అని కేదార్ అంటాడు. ఖచ్చింతగా వచ్చిందని ఆవిషయం అత్తయ్యకు తెలిస్తే మనకు ఇబ్బంది అవుతుందేమోనని చెప్పకుండా వెళ్లిపోయినా వెళ్లిపోతుందని అందుకే అలా చెప్పానని అంటుంది.ఇప్పుడు నిషిక వాళ్లు ప్లాన్ వేస్తూనే ఉంటారని కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలని అంటుంది.

రాగిణి అత్తయ్య బతికే ఉంది

చిలకమ్మను చూస్తుంటే నాకు చాలా అనుమానం వస్తుందని నిషిక అంటుంది. అచ్చం మా అత్తయ్య చేసినట్లే చేస్తుందని మా ఇద్దరినీ కోడలు అనిపిలుస్తోందని...మా నాన్నను అన్నయ్య  అంటుందని చెబుతుంది. మాకు మాత్రమే తెలిసిన విషయాలన్నీ చెబుతుందని నిషిక అంటుంది. అయినా మీ అత్తయ్య చనిపోవడం మనం ఆమె అంత్యక్రియలు చేయడం కళ్లారా చూశాం కదా అని యువరాజు అంటాడు.చనిపోయిన ఆవిడ ఎలా బతికి వస్తుందని అంటాడు. అవన్నీ నాకు తెలియదు కానీ చిలకమ్మను చూస్తే మాత్రం మా రాగిణి అత్తయ్యలాగే అనిపిస్తుందని చెబుతుంది. ఇప్పుడు వదిన ఇంట్లో లేదని మామయ్య కూడా మన పక్షమే ఉన్నాడు కాబట్టి ఈ సమయంలోనే జగధాత్రి వాళ్లను బయటకు పంపించేయాలని అంటుంది. అందుకే మా యామినిని తీసుకొస్తే...కూతురుని చూసి ఆగలేక మా అత్తయ్య బయటపడిపోతుందని నిషిక చెబుతుంది.

మరింత మంది సీరియల్ నటులు గురించి ఇక్కడ తెలుసుకోండి

1 'నిండు మనసులు' సీరియల్ సిద్ధు గురించి ఈ విషయాలు తెలుసా?
2 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ చిన్నోడు.. నితిన్ అద్వి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
3 కార్తీక దీపం 2 విలన్ రోల్ జ్యోత్స్న.. హోస్ట్, సీరియల్స్.. ఇంకా మరెన్నో!
4 పెద్దికి 'పొదరిల్లు' సీరియల్‌లో పెళ్లికాలేదు కానీ రియల్ వైఫ్ ఫొటోస్ చూశారా!
5 'పొదరిల్లు' సీరియల్ సూర్యప్రతాప్ ( ఆనంద్) ఏ ఏ సినిమాల్లో నటించారు, రోజుకి ఆయన రెమ్యునరేష్ ఎంతో తెలుసా?

సుధాకర్‌కు తప్పిన ప్రమాదం

గార్డెన్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సుధాకర్‌ను చూసి వైజయంతి అక్కడికి వస్తుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్లాలంటే నన్ను పిలవొచ్చు కదా అని అంటుంది.ఎంతోసేపటి నుంచి నిన్ను పిలుస్తూనే ఉన్నానని...నువ్వే రావడం లేదని మండిపడతాడు.సరే నేను తీసుకెళ్తానులే పదా అని వెళ్తుండగా..సుధాకర్‌ మంచినీళ్లు కావాలని అడగడంతో వైజయంతి తీసుకుని రావడానికి వెళ్తుంది. వీల్‌చైర్‌కు లాక్‌ వేయకపోవడంతో హాల్‌లో ముందుకు వెళ్లిపోతుంది. సుధాకర్‌ గుమ్మం తగిలి కిందపడబోయే సమయానికి కేదార్ చూసి వీల్‌చైర్‌ పట్టుకుని ఆపుతాడు. దీంతో అతని చేతికి దెబ్బతగులుతుంది.అదిచూసి సుధాకర్‌ కరిగిపోతాడు. దీంతో వాళ్లు మళ్లీ కలుస్తారని భయపడిపోయిన నిషిక తన కడుపుపోవడానికి జగధాత్రియే కారణమని సుధాకర్‌కు గుర్తుచేస్తుంది.

Frequently Asked Questions

నిషిక చిలకమ్మపై ఎందుకు అనుమానం పెంచుకుంది?

చిలకమ్మ శ్రీకాకుళం నుండి వచ్చినప్పటికీ తమ ఇంట్లో పదేళ్ల క్రితం జరిగిన విషయాలు ఎలా తెలుసునని నిషిక అనుమానం పెంచుకుంది. చిలకమ్మ తన అత్తయ్య చేసినట్లే చేస్తుందని నిషిక వాదిస్తోంది.

చిలకమ్మ విషయంలో జగధాత్రి ఎలా కల్పించుకుంది?

చిలకమ్మకు పదేళ్ల క్రితం జరిగిన విషయాలు తానే చెప్పానని జగధాత్రి నిషికతో అబద్ధం చెప్పింది. బడిలో ఖాళీ సమయంలో చిలకమ్మ తన లవ్‌స్టోరీ అడిగితే చెప్పేదాన్నని కవర్ చేసింది.

రాగిణిని బయటపెట్టడానికి నిషిక ప్రణాళిక ఏమిటి?

చిలకమ్మ రాగిణి అత్తయ్య అని అనుమానించిన నిషిక, యామినిని (రాగిణి కూతురు) తీసుకొస్తే ఆమె బయటపడిపోతుందని ప్లాన్ చేసింది. ఈ సమయంలో జగధాత్రిని ఇంట్లో నుంచి పంపించేయాలని కూడా అనుకుంది.

సుధాకర్ ప్రమాదం నుంచి కేదార్ ఎలా కాపాడాడు?

వైజయంతి వీల్‌ఛైర్‌కు లాక్ వేయకపోవడంతో సుధాకర్ కిందపడబోతుండగా కేదార్ పట్టుకుని కాపాడాడు. ఈ క్రమంలో కేదార్ చేతికి దెబ్బతగిలింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Embed widget