Jagadhatri Serial Today June 2nd: జగధాత్రి, కేదార్‌పై అనుమానపడిన కౌషికి....నిషికకు మరోసారి దొరికిపోయిన చిలకమ్మ
Jagadhatri Serial Today Episode June2nd: కేదార్,జగధాత్రిపై అనుమానపడిన కౌషికి...బయట మీరు ఏం పనులు చేస్తున్నారంటూ నిలదీసింది..మరోవైపు చిలకమ్మ తన మాటలతో నిషికకు అడ్డంగా దొరికిపోయింది.

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు ట్విస్టులతో అదిరిపోయింది. సినిమాహాల్లో ఉన్నామని అబద్ధం చెప్పిన జగధాత్రి,కేదార్‌ను కౌషికి నిలదీస్తుంది.అసలు మీరు బయట ఏం పనులు చేస్తున్నారంటూ..ఏ సినిమాకు,ఏ టైంకు వెళ్లారంటూ ప్రశ్నలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో జగధాత్రి,కేదార్ ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో ఈరోజు ఏపిసోడ్ ఆసక్తిగా మారింది.
కౌషికి నిలదీత
మీనన్ మనుషులతో జగధాత్రి ఫైట్ చేస్తున్నప్పుడు కౌషికి ఫోన్ చేయడం...ఆ గొడవ ఏంటని అడిగితే యాక్షన్ సినిమాకు వెళ్లామని చెప్పడంతో కౌషికికి అనుమానం వస్తుంది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ ఎలాగైనా జగధాత్రిని నిజం అడగాల్సిందేనని నిర్ణయించుకుంటుంది. బయట పని ముగించుకుని ఇంటికి వచ్చిన వెంటనే జగధాత్రి, కేదార్‌ను ఎక్కడ నుంచి వస్తున్నారని అడుగుతుంది.బయట చిన్నపని ఉంటే వెళ్లి వస్తున్నామని చెబుతారు. మధ్యాహ్నం మీరు ఇద్దరూ ఎక్కడ ఉన్నారని అడిగితే....సినిమాకు వెళ్లామని చెప్పాం కదా అని జగధాత్రి సమాధానమిస్తుంది. నిన్నఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగింది...పైగా పాపారాయుడు మామయ్య కేదార్‌పై హత్యాయత్నం చేస్తే మీరు అవన్నీ పట్టించుకోకుండా సినిమాకు ఎలా వెళ్లారని అడుగుతుంది. నాకు తెలిసిన జగధాత్రి అయితే ఇలా అన్నీ మర్చిపోయి సినిమాలు,షికార్లకు తిరగదని అంటుంది.
మేము కూడా సినిమాకు వెళ్లాలని అనుకోలేదని...కానీ స్కూల్‌లో టీచర్లు అంతా కలిసి వెళ్దామని బలవంతంపెడితే తప్పక వెళ్లాల్సి వచ్చిందని అంటుంది. నేను ఎంక్వైయిరీ చేశానని మన ఊరిలో తెలుగులో ఇప్పుడు యాక్షన్ మూవీస్ ఏమీ లేవని తెలిసిందని అంటుంది.మేం తెలుగు సినిమాకు వెళ్లలేదని...ఇంగ్లీష్ మూవీకి వెళ్లామని చెబుతారు. ఏ ధియేటర్‌కు వెళ్లారని...ఏ షోకు వెళ్లారని ప్రశ్నలపై ప్రశ్నలు గుప్పిస్తుంది. టిక్కెట్లు మేం బుక్ చేయలేదు కాబట్టి మాకు కూడా సరిగ్గా అది ఏ షో కూడా తెలియదని మధ్యలోనే నుంచే చూశామని జగధాత్రి చెబుతుంది. మీరు ఈమధ్య తరుచూ బయటకు వెళ్తున్నారని నేను అడిగిన ప్రతిసారీ నా కళ్లల్లో చూసి నిజం చెప్పడం లేదని అంటుంది. మీరిద్దరూ ఏదో దాచే ప్రయత్నం చేస్తున్నారని నాకు అనుమానంగా ఉందని కౌషికి అంటుంది. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పండని అంటుంది. లేదంటే మీరు మోసం చేశారని తెలిస్తే నేను అస్సలు సహించలేనని అంటుంది. ఇప్పటికీ మీరు చెబుతుంది అబద్ధమేనని నా మైండ్ చెబుతుంది కానీ నా మనసు మిమ్మల్ని నమ్మమని చెబుతోందని అందుకే నేను మనసు మాట వింటున్నానని చెబుతుంది.మీరు అనుకున్నట్లు మేం ఎలాంటి తప్పుడు పనులు చేయడం లేదని....మీరు తలదించుకునేలా ఎప్పటికీ చేయమని జగధాత్రి హామీ ఇస్తుంది.
యువరాజుపై నిషిక కోపం
నిషికను వెనక నుంచి కౌగిలించుకునేందుకు యువరాజు ప్రయత్నించగా...నిషిక కోపంతో మండిపడుతుంది. అసలు ఏమైందినీకు ఆఫీసు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎందుకు చిర్రుబుర్రులాడుతున్నావని యువరాజు నిలదీస్తాడు.నాకు కోపం ఎందుకు ఉందో నీకు తెలియదా అని నిషిక ఎదురు ప్రశ్నిస్తుంది. ఆ సెక్రటరీ ఏం చేసినా నీకు ముందే తెలిసిపోతుంది కానీ....నేను ఎందుకు కోపంగా ఉన్నాననే విషయం మాత్రం తెలియదా అని అంటుంది. ఆ సోనీ గురించే ఇంకా ఆలోచిస్తున్నావా అని అంటాడు. ఎవరు ఉన్నా నాకు నువ్వు ప్రత్యేకమని చెప్పడంతో కొంత కూల్ అవుతుంది. ఇక ఆ సోనీతో వీలైనంత దూరంగా ఉండమని చెబుతుంది.అప్పుడే సోనీ ఫోన్ చేసి మాట్లాడగా....యువరాజు ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్లిపోతాడు.దీంతో నిషిక యువరాజు ఫోన్ లో నుంచి సోనీ నెంబర్ తీసుకుని తన ఫోన్‌లో సేవ్ చేసుకుంటుంది.
దొరికిపోయిన చిలకమ్మా
వంటగదిలో కేదార్, జగధాత్రి, చిలకమ్మ మాట్లాడుకుంటారు. జగధాత్రి, కేదార్ పెళ్లికాక ముందు సంగతులు చెప్పుకుంటారు. జగధాత్రి వల్లే నువ్వు మా ఇంట్లో ఉండగలిగావని లేకుంటే ఎప్పుడో తరిమేసేవాళ్లమని అప్పుడు జరిగిన విషయాలన్నీ చెబుతుండగా నిషిక అక్కడికి వస్తుంది.అసలు ఈవిషయాలన్నీ నీకు ఎలా తెలిశాయని నిలదీస్తుంది.మర్యాదగా చెప్పకుంటే పోలీసులను పిలిపిస్తానని బెదిరిస్తుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















