యువరాజు తన ఆఫీసులో సోనీతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి నిషిక అసూయపడింది. ఆమె కోపం యువరాజు ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు మరింత పెరిగింది.
Jagadhatri Serial Today June 1st: పాటిల్ హత్యకేసులో ఊహించని ట్విస్టు...లక్ష్మణ్‌తోపాటు మీనన్‌ను చూసి జేడీ,కేడీ షాక్
Jagadhatri Serial Today Episode June1st: పాటిల్ హత్య కేసులో వాళ్ల తమ్ముడు లక్ష్మణ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన జేడీ, కేడీ అక్కడ ఏం చూశారు..?

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు ట్విస్టులపై ట్విస్టులతో అదిరిపోయింది. యువరాజు పూర్తిగా సెక్రటరీ సోనీ మాయలో పడిపోవడం చూసి నిషిక కుళ్లుకోవడంతోపాటు..పాటిల్ హత్యకేసులో జేడీ,కేడీకి ఊహించని షాక్‌లు తగలడం వంటి ట్విస్టులతో ఈరోజు జగధాత్రి సీరియల్ రసవత్తరంగా సాగుతుంది.
నిషిక కాపురంలో నిప్పు
యువరాజు ఆఫీసుకు వెళ్లిన తొలిరోజే సోనీ అతన్ని బుట్టలో వేసుకోవడం చూసి నిషిక రుసరుసలాడుతుంది.ఇంతలో సోనీ కిందపడిపోతుంటే యువరాజు పట్టుకోవడంతో నిషిక కోపం తారాస్థాయికి చేరుతుంది. దగ్గరకు వెళ్లి యువరాజుపై చిర్రుబుర్రులాడుతుంది. పడిపోతుంటే హెల్ఫ్ చేశానంతేనని చెబుతాడు. ఇంతలో వైజయంతి అక్కడికి రావడంతో ముందు మీ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్లండని అంటుంది.నేను ఆఫీసుకు వచ్చింది ఇప్పుడే కదా అని అంటే...ఇప్పటికి ఇదిచాలని చెబుతుంది.దీంతో యువరాజు బయటకు వెళ్లిపోతాడు. నిషిక సోనీ దగ్గరకు వచ్చి నిన్ను ఎక్కడో బాగా చూసినట్లు ఉందని అంటుంది.లేదు మేడం మీరు ఆఫీసుకు ఎప్పుడూ రాలేదు..నేను కూడా మీ ఇంటికి రాలేదు కదా ఎలా చూస్తారని అడుగుతుంది. ఆఫీసు,ఇంట్లో కాదని ఎక్కడో చూశానని చెప్పడంతో అలాంటిదేమీ లేదని సోనీ అంటుంది.ఇంతలో సోనీకి ఫోన్ రావడంతో వెళ్లిపోతుంది. నాకు నువ్వు ఎవరో గుర్తుకురావాలి అప్పుడు చెబుతాను నీపని అంటూ నిషిక కూడా వెళ్లిపోతుంది.
లక్ష్మణ్ పాటిల్ కోసం జేడీ ఎత్తులు
పాటిల్ హత్య కేసులో కీలక నిందితుడు వాళ్ల తమ్ముడు లక్ష్మణ్‌పాటిల్ అని తెలుసుకున్న జేడీ..అతన్ని అరెస్ట్ చేసేందుకు రవీందర్‌సింగ్‌తో నాటకం ఆడిస్తుంది. అతని అక్కాబావల మాదిరిగా లక్ష్మణ్ పాటిల్‌ను కలవడానికి వెళ్తుంది. నువ్వు ఏం భయపడకుండా మేం చెప్పినట్లు వెళ్లమని సలహా ఇస్తుంది.దీనికి రవీందర్‌సింగ్ సరేనంటాడు. వెళ్లేప్పుడు గన్‌లు తీసి రమ్యకి ఇచ్చి జేడీ,కేడీ వెళ్తారు. ఇంటి బయటే రవీంద్రసింగ్ కారు గూండాలు ఆపుతారు. వీళ్లు ఎవరని అడిగితే పార్టీ ఉందని చెప్పాను కదా వీళ్లేనని అంటాడు.నేను అన్నతో మాట్లాడుకుంటానులే అంటే వాళ్లు వెంటనే లక్ష్మణ్‌కు ఫోన్ చేసి అడుగుతారు.పక్కనే ఉన్న మీనన్‌కు అనుమానం వస్తుంది. వెంటనే సీసీ ఫుటేజ్ పరీశీలిస్తాడు.మాస్కు పెట్టుకుని ఉన్న జేడీ,కేడీని గుర్తించలేకపోతాడు. వాళ్లను లోపలికి రమ్మని పిలవగానే అందరూ వెళ్తారు.
జేడీ వలలో చిక్కిన మీనన్
జేడీ,కేడీరాకను గమనించి మీనన్ మేడపైకి వెళ్తాడు. వచ్చీరాగానే మీనన్‌ను చూసి గుర్తుపడుతుంది జేడీ. లక్ష్మణ్‌కు వాళ్లు ఎవరో తెలియక తికమకపడుతుంటే....మేం ఎవరో నీకు తెలియకపోవచ్చు.కానీ ఆ పైన ఉన్నవాడికి బాగా తెలుసునని అంటారు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తుపట్టలేదా అని అంటారు.రెండేళ్ల క్రితమే హత్యకు ప్లాన్ వేసి పకడ్బందీగా అమలు చేసే అంత నాలెడ్జ్ ఈమట్టి బుర్రగాడికి ఎలా వచ్చిందా అనుకుంటున్నాం...దీని వెనక నువ్వు ఉన్నావన్నమాట అని అంటుంది. అసలు నేను ఏ ప్లాన్ వేసినా నీకు ఎలా తెలిసిపోతుందని నీ మనిషి ఎవరో నా దగ్గర ఉన్నారు కదా అని అంటాడు. అసలు నువ్వు ఈ కేసులో ఉన్నసంగతే మాకు తెలియదని...మేం లక్ష్మణ్‌కోసమే వచ్చామనిఅంటాడు.అనూహ్యంగా నువ్వు ఇక్కడ తగిలావని చెబుతారు. అంటే నాకు నేనుగా వచ్చి ఇరుక్కున్నానా అని అంటాడు. మేం ఎంత టార్చర్ పెట్టినా వీడీ ఫ్యామిలీ ప్రాణాల కోసం నోరు తెరిచి నీ పేరు చెప్పేవాడు కాదని...కానీ నీ అంతట నువ్వే వచ్చి మాకు దొరికిపోవడం వల్ల మా ప్లాన్ సులవైందని జేడీ అంటుంది..
ఎక్కువ మంది చదివిన ఈ వార్తలు మిస్ అవ్వొద్దు | |
| 1 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం |
| 2 | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే |
| 3 | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ |
| 4 | ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే |
| 5 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్ |
జేడీ ఎవరో కౌషికికి తెలిసిపోయిందా..?
మీనన్ మనుషులను చితక్కొడుతుంటేనే కౌషికి జగధాత్రికి ఫోన్ చేస్తుంది. ఫైల్ కనిపించడంలేదని అడుగుతుంది.అప్పుడే ఆక్కడ ఫైట్ జరుగుతుంటే ఏంటి ఆ సౌండ్ అని కౌషికి అడగ్గా...యాక్షన్ సినిమాకు వచ్చామని అబద్ధం చెబుతుంది. ఈ టైంలో సినిమాకు ఎందుకు వెళ్లారా అని కౌషికి అనుమానం వస్తుంది. ఇంతలో ఫోన్ కట్ చేసి అందరినీ చితకబాది...పాటిల్ కేసులో లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసినట్లు జేడీప్రెస్‌మీట్ పెట్టి చెబుతుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Frequently Asked Questions
యువరాజుని సోనీ బుట్టలో వేసుకోవడంతో నిషిక ఎందుకు కుళ్లుకుంది?
లక్ష్మణ్ పాటిల్ ను అరెస్ట్ చేయడానికి జేడీ ఎలాంటి నాటకం ఆడింది?
జేడీ, లక్ష్మణ్ పాటిల్ యొక్క సోదరి మరియు బావల వలె నటించి, అతన్ని కలవడానికి వెళ్లి, రవీందర్ సింగ్ సహాయంతో అతనిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించింది.
మీనన్ ఎలా జేడీ వలలో చిక్కుకున్నాడు?
లక్ష్మణ్ పాటిల్ కేసులో తన ప్రమేయాన్ని బహిర్గతం చేయకుండా ఉండేందుకు జేడీ, మీనన్ ను ముప్పు తిప్పలు పెట్టింది. మీనన్ అనుకోకుండా అక్కడికి వచ్చి చిక్కుకుపోయాడు.
కౌషికి కి జేడీ ఎవరో తెలిసిపోయిందా?
కౌషికికి మీనన్ అక్కడ ఉండటం, ఫైల్ కనిపించకపోవడం గురించి అనుమానం వచ్చింది. జేడీ లక్ష్మణ్ పాటిల్ ను అరెస్ట్ చేసినట్లు పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ట్రెండింగ్ వార్తలు






















