Jagadhatri Serial Today July 30th: జగద్ధాత్రి సీరియల్: యువరాజ్‌ని వణికించేసిన కౌషికి.. ఇకనైనా మారుతాడా! జగద్ధాత్రి, కేథార్‌లపై మత్తు ప్రయోగం!
Jagadhatri Serial Today Episode July 30th నిషిక జగద్ధాత్రి, కేథార్‌లు గుడికి రాకుండా ఆపాలని వాళ్లు తినే స్వీట్‌లో మత్తు మందు కలపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode యువరాజ్ కౌషికి బాబు గురించి ఆలోచిస్తూ ఉంటే కౌషికి అక్కడికి వస్తుంది. తిన్నావా అని తమ్ముడిని అడుగుతుంది. ఏమైనా మాట్లాడాలా అక్కా అని యువరాజ్ అడుగుతాడు. ఏం మాట్లాడుతా అని అనుకుంటున్నావ్ అని అడుగుతుంది. యువరాజ్ తల దించుకుంటాడు.
కౌషికి తమ్ముడితో ఫ్రెండ్స్ పార్టీలు అని తిరిగితే చిన్న పిల్లాడివనుకున్నా.. పెళ్లి తర్వాత కంపెనీ కోసం తప్పులు చేస్తుంటే మారుతావు అనుకున్నా. మీనన్‌తో చేతులు కలిపి ఇల్లీగల్ పనులు చేస్తే దారితప్పావు దారిలో పెడితే సరిపోతుంది అనుకున్నా. ఆస్తి కోసం నన్ను మెంటల్ హాస్పిటల్‌కి పంపాలని చూస్తే తమ్ముడే కదా అని ఊరుకున్నా.. ఎన్ని తప్పులు చేసినా ఇన్ని అవకాశాలు ఇచ్చింది ఒక అక్కగా ఆలోచించి యువరాజ్. కానీ ఒక అమ్మగా నా కొడుకు విషయంలో ఊరుకోను. ఆ డైరీలో నీ పేరు చూసినా సరే నువ్వు అలా చేయవు అన్న నమ్మకంతో వదిలేశా.. యువరాజ్ నువ్వు మాత్రం తప్పు చేసుంటే ఇప్పటి వరకు నాలో అక్కని చూశావ్ వజ్రపాటి కౌషికి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో చూస్తావ్. నీ ఆలోచనలో తప్పు ఉందా ఆచరణలో తప్పు ఉందో నాకు తెలీదు.. కానీ నువ్వు మారాలి యువరాజ్ మారి తీరాలి.. నీకు నాకు మధ్య ఒక తప్పు దూరం ఉంది.. అది దాటితే నీకు నాకు సంబంధం ఉండదు.. నా మొండితనం గురించి తెలుసుకదా క్షమాపణ కూడా ఉండదు.. మారుతా అక్క మారుతా అక్క అని యువరాజ్ అంటాడు.
కేథార్ జగద్ధాత్రి కోసం స్వీట్ చేస్తుంటాడు. జగద్ధాత్రిని ఏం మాట్లాడకుండా ఉండమని ఇష్టం వచ్చినంట్లు షుగర్ వేసి చేస్తుంటాడు. నిషిక, వైజయంతి అది చూస్తారు. ఆ పాయసంలో ఎలా మత్తు మందు కలపాలి అనుకుంటారు. స్వీట్ చేసి కేథార్ వెళ్లిపోతాడు. జగద్ధాత్రి ఒక్కర్తే కిచెన్లో ఉంటుంది. నిషిక అత్తతో జగద్ధాత్రి వాళ్ల కోసం స్వీట్ ప్లేట్‌లో వేసేటప్పుడు మీరు సౌండ్ చేయండి తను బయటకు వస్తుంది నేను లోపలికి వెళ్లి వాళ్లు తినే స్వీట్‌లో మత్తు మందు కలిపేస్తా అంటుంది. జగద్ధాత్రి స్వీట్‌ని తనకోసం కేథార్ కోసం రెండు ప్లేట్‌లలో వేస్తుంది. తీసుకెళ్లే టైంకి వైజయంతి సౌండ్ చేస్తే జగద్ధాత్రి బయటకు వెళ్తుంది. నిషిక మత్తు మందు కలిపేస్తుంది.
జగద్ధాత్రి స్వీట్స్ గదిలోకి తీసుకెళ్లి ఇద్దరూ తినిపించుకొని మొత్తం తినేస్తారు. నిషిక, వైజయంతి అదంతా చూస్తారు. జగద్ధాత్రి, కేథార్ ఇద్దరూ మత్తుతో పడుకుండిపోతారు. ఉదయం అందరూ గుడికి బయల్దేరుతారు. కౌషికి జగద్ధాత్రి, కేథార్‌ల గురించి అడగకపోవడంతో నిషిక, వైజయంతిలు సంతోషపడతారు. ఇక జగద్ధాత్రి, కేథార్‌ల గురించి కౌషికి అడుగుతుంది. పూజకు లేటు అవుతుంది వెళ్దామని అత్తాకోడళ్లు అంటారు. కౌషికి వాళ్ల గదిలోకి వెళ్లి చూసొస్తా అంటే నిషిక తాను వెళ్లి చూస్తా అంటుంది. గదిలో వెళ్లి జగద్ధాత్రి వాళ్లు దుప్పటి కప్పుకోవడం చూసి తన ప్లాన్ సక్సెస్ అనుకుంటుంది. నిషిక అత్తతో మత్తుతో పడుకున్నారు పిడుగు పడినా లేవరు అంటుంది. కౌషికి వాళ్లతో గదిలో లేరని చెప్తుంది. ఎక్కడికి వెళ్లారా అని అందరూ అనుకుంటే యువరాజ్ ఉదయం వాళ్లు కంగారుగా వెళ్లారని చెప్తాడు. వాళ్లు గుడికి వస్తారులే మనం వెళ్దామని సుధాకర్ చెప్పడంతో కౌషకి వాళ్లు గుడికి వెళ్తారు.
గుడికి వెళ్లిన నిషిక బ్యాచ్‌కి పెద్ద షాక్ తగులుతుంది. జగద్ధాత్రి, కేథార్‌లు పొర్లు దండాలు పెడుతూ కనిపిస్తారు. ముగ్గురూ బిత్తరపోతారు. మత్తు మందు ఇచ్చామని చెప్పారు కదా అని యువరాజ్ అంటే అదే అర్థం కావడం లేదని నిషిక అటుంది. ఎప్పుడు వచ్చారు అని సుధాకర్ అడిగితే మీది పిన్నిది పెళ్లి రోజుని మీరు సంతోషంగా ఉండాలని పొర్లు దండాలు పెట్టాలని వచ్చామని చెప్తారు. వైజయంతి కేథార్ మీద కేకలేస్తుంది. దానికి కేథార్ కోపం ఎందుకు పిన్ని మీరు నాన్న సంతోషంగా ఉండాలి అనే కదా మొక్కుకున్నా అంటాడు. దానికి యువరాజ్ కోపంగా వచ్చి కేథార్ కాలర్ పట్టుకొని ఎవర్రా నీకు నాన్న. మా నాన్నని నాన్న అంటే నిన్ను చంపేస్తా అని చెప్పాను కదా అంటాడు. జగద్ధాత్రి కోపంగా యువరాజ్ కేథార్ షర్ట్ వదులు అంటుంది. కౌషికి తమ్ముడితో ఎక్కడున్నాం ఏం చేయాలి అనుకున్నాం అది ఆలోచించాలి కదా అని ఆపి అందర్నీ తీసుకెళ్తుంది.
నిషిక వెళ్తుంటే జగద్ధాత్రి ఆపి మత్తుతో పడుకుండాల్సిన మేం నీ కంటే ముందు ఎలా గుడికి వచ్చామా అని ఆలోచిస్తున్నావా అని నిషిక మత్తు మందు కలపడం చూసినట్లు చెప్తుంది. ఆ రెండు బౌల్స్‌ని పడేసి కొత్తగా మళ్లీ స్వీట్ తీసుకొని వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















