Jagadhatri Serial Today January 12th: జేడీ, కేడీ ఇద్దరూ జగధాత్రి, కేదార్ అని తెలిసిపోయిందా..? కౌషికి దగ్గర నిజం బయటపడకుండా ఎలా తప్పించుకున్నారు..?
Jagadhatri Serial Today Episode January 12th: మాధురి బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చిన జేడీ,కేడీని ఇరికించాలని యువరాజు ప్రయత్నిస్తాడు.కానీ వాళ్లద్దరూ చాకచక్యంగా బయటపడతారు.

Jagadhatri Serial Today Episode: మాధురి బాబును మార్చేసి ఇచ్చినందుకు జగధాత్రి ఆస్పత్రి డాక్టర్‌ను అరెస్ట్ చేయిస్తుంది. అలాగే అక్కడ బాబు సమాచారం ఇచ్చి కిడ్నాప్ చేసేందకు సహకరించిన నర్సును కూడా జేడీ పోలీసులకు పట్టిస్తుంది. ఆ తర్వాత మాధురి బాబును తీసుకుని జేడీ, కేడీ ఇద్దరూ వాళ్ల ఇంటికే వెళ్తారు. బాబు దొరికాడని చెబుతారు. బాబును ఎవరు కిడ్నాప్ చేశారని కౌషికి అడగ్గా....మీనన్ మనుషులు కిడ్నాప్ చేశారని చెబుతారు. పుట్టిన బిడ్డ మీద పగసాధిస్తున్నాడా మీనన్ అని ఇంట్లో అందరూ తిట్టగా...వాడు మీ బాబు అని తెలిసి కిడ్నాప్ చేయలేదని...ఇది వాళ్ల బిజినెస్ అని జేడీ,కేడీ చెబుతారు. ఆస్పత్రుల్లో ఉన్న పిల్లలను ఎత్తుకెళ్లి పెద్దింటి వాళ్లకు అమ్మేస్తుంటారని వివరిస్తారు. వీడి వల్ల ఇవాళ ఓ పెద్ద రాకెట్‌ను చేధించామని చెబుతారు. ఇంతలో దొంగలను పట్టుకున్నారా అని నిషిక అడుగుతుంది. కొద్దిలో తప్పించుకున్నారని చెప్పగా...ఇది చెప్పడానికే ఇంత బిల్డప్ ఇచ్చారని నిషిక నిష్టురంగా మాట్లాడుతుంది. కేసు పట్టుకుంటే వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పగా....జేడీ నిషికకు గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో యువరాజు నోరుమూసుకుని ఉండమని హెచ్చరిస్తాడు.
అయితే జేడీ,కేడీయే జగధాత్రి, కేదార్ అని తెలుసుకున్న యువరాజు వాళ్లిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా కౌషికి పట్టించాలని చూస్తాడు. బాబును ఇచ్చి వారు తిరిగి వెళ్లిపోతుండగా....కావాలనే ఉండమని చెబుతాడు. బాబు దొరికిన విషయం మీరే జగధాత్రి, కేదార్‌కు చెప్పండని అంటాడు. దీంతో కౌషికి కూడా ఉండమని చెబుతుంది. వెంటనే జగధాత్రికి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మనమని యువరాజు సూచిస్తాడు. దీంతో జేడీ, కేడీ ఇద్దరూ భయపడతారు. కౌషికి కేదార్‌కు ఫోన్ చేయగా..అది స్విచ్ఛాప్ వస్తుంది. హమ్మయ్యా అనుకునేలోపే కౌషికి ధాత్రికి ఫోన్ చేస్తుంది. దీంతో ఇక దొరికిపోయారని యువరాజు అనుకుంటాడు. కౌషికి ఫోన్ చేయగానే....అది జేడీ జేబులో మోగుతుంది. ఇంట్లో అందరూ జేడీ వైపు చూస్తుంటారు. మా జగధాత్రి ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉందని వైజయంతి నిలదీస్తుంది.కౌషికికూడా ఫోన్ నీదగ్గర ఎందుకు రింగ్ అవుతుందని అడుగుతుంది. ఫోన్ నా దగ్గర లేదని...ఇక్కడ ఇంట్లో ఉందని కుర్చీలో మోగుతున్న ఫోన్ తీసి ఇస్తుంది. అంతకు ముందే జేడీ ఆ ఫోన్‌ను మెల్లగా కుర్చీలో పెడుతుంది. బహుశా జగధాత్రి ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్లిపోయిందేమోనని అంటుంది. ఆ విధంగా తప్పించుకున్న జేడీ, కేడీ ఇద్దరూ మెల్లగా ఇంట్లో నుంచి బయటపడతారు. ఎలాగో ఈరోజు తప్పించుకున్నామంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
బయట నుంచి వచ్చిన జగధాత్రి, కేదార్‌ను కౌషికి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారని అడగ్గా....బాబును వెతికేందుకు ఆస్పత్రులన్నీ తిరుగుతున్నామని అబద్ధం చెబుతారు. బాబు ఎక్కడ అని అడగ్గా....వంశీ వచ్చి భార్యబిడ్డలను తీసుకుని వెళ్లిపోయాడని సుధాకర్ చెబుతాడు. కొంచెం ముందు వచ్చి ఉన్నట్లయి చూసేవాళ్లని అడగ్గా...మేం ఆల్రెడీ చూశాం కదా అని కేదార్ నోరుజారతాడు. మళ్లీ ఏదోవిధంగా అబద్ధం చెప్పి ధాత్రి, కేదార్ తప్పించుకుంటారు.
రేపు శ్రీవల్లిని చూసుకోవడానికి పెళ్లివాళ్లు వస్తున్నారని వైజయంతి చెబుతుంది. ఆమె అనుకున్నట్లే ఓ అనామకుడిని పెళ్లికొడుకుగా ఇంటికి తీసుకొస్తుంది. శ్రీవల్లిని పెళ్లికూతురిలా రెడీ చేస్తారు.





















