Jagadhatri Serial Today December8th: గుడిలో బాంబులు పేలి భక్తుల ప్రాణాలు పోవడంతో జేడీ చేసిన శపథం ఏంటి..?
Jagadhatri Serial Today Episode December8th: గుడిలో బాంబులు పేల్చి 34 మంది చావుకు కారణమైన వారిని వారంలో పట్టుకోకుంటే పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని జేడీ శపథం చేస్తుంది.

Jagadhatri Serial Today Episode: బాంబు పేలిన హడావుడిలో జేడీ కౌషికిని వదిన అనిపిలవడంతో ఆమెకు అనుమానం వస్తుంది.నువ్వు ఎవరని అడుగుతుంది. మీకు దెబ్బలు తగలడం వల్ల అలా అనుకుని ఉంటారని జేడీ మాటమారుస్తుంది.ఈలోగా కౌషికిని ఆస్పత్రికి తరలిస్తారు. బాంబులు పేలడంతో ఆలయంలో చాలామంది భక్తులు గాయపడతారు. కొందరు చనిపోతారు. బర్త్‌డే అని చెప్పి జేడీకి చాక్లెట్ ఇచ్చిన చిన్నారి కూడా చనిపోతుంది. ఆస్పత్రిలో ఒక్కొక్కరి ధీనగాథలు వింటూ జేడీ చాలా బాధపడుతుంది. మొత్తం 34 మంది చనిపోవడంతోపాటు, మరో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉందంటూ జేడీ పై అధికారులకు చెప్పి బాధపడుతుంది. బాంబు పేలుళ్లకు మీరు కారణం కాదు...కాబట్టి మీరు అంతలా ఫీల్ అవ్వొద్దని ఆయన ఓదార్చుతాడు. కానీ జేడీ మేం కొంచెం ముందు వెళ్లి ఉండాల్సింది...మినిష్టర్ బయటకు రాకుండా ఆపి ఉండాల్సి అంటుంది.
కంటైనర్ మిస్ అయ్యిందని తెలిసిన వెంటనే రియాక్ట్ అయ్యి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదని కేడీ అంటాడు. ఎవరూ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఈ బాంబు బ్లాస్ట్ జరిగిందని అంటాడు. ఒక రెండు బాంబులు కనుక్కుని ఆపడంతో కొంత ప్రభావం తగ్గిందని చెబుతాడు. హోంమినిష్టర్ ఏమంటున్నారని జేడీ అడగ్గా...మనం మన డ్యూటీ చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని చెబుతాడు. ఈ బాంబు బ్లాస్ట్‌కు కారణమైన వారిని మనం పట్టుకోలేకపోతే..నన్న సస్పెండ్ చేస్తానని హెచ్చరించినట్లు చెప్పాడు. వెంటనే మనం విచారణ ప్రారంభించాలని చెబుతాడు. వైజాగ్ నుంచి ఓ కంటైనర్ మిస్ అయ్యిందని...దాని ద్వారానే పేలుడు పదార్థాలు హైదరాబాద్‌కు వచ్చాయని అనుమానంగా ఉందని అధికారి ప్రెస్‌కు చెబుతాడు. ఈ దిశగానే విచారణ చేపడుతున్నామని వివరిస్తాడు. వారం రోజుల్లోనే నిందితులను పట్టుకుని న్యాయస్థానం ముందు ఉంచుతామని జేడీ శపథం చేస్తుంది. లేదంటే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తుందని అంటుంది.
ప్రెస్‌మీట్‌లో జేడీ మాటలను మీనన్ టీవీలో చూసి బిగ్గరగా నవ్వుకుంటాడు. వారం రోజుల్లో జేడీ పొగరు అనిగిపోతుందని అంటాడు. తనకు ఎంతో ఇష్టమైన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసేలా చేస్తానని అంటాడు. నా వాళ్లందరినీ నా కళ్లముందే చంపిన ఆ జేడీ,కేడీ ఇద్దరినీ నేనే చంపేస్తానని అంటాడు. ఇంతలో మీనన్ అనుచరుడు దేవా అక్కడికి వచ్చి ఓ పొరపాటు జరిగిందని చెబుతాడు. బాంబు బ్లాస్ట్‌లో మనవాడు కూడా ఒకడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలోఉన్నాడని చెబుతాడు. వాడు జేడీకి దొరికితే మనపని అయిపోయినట్లేనని అంటాడు. మనవాళ్లను పంపించి వాడిని ఆస్పత్రి నుంచి తప్పించండని దేవాకు మీనన్ చెబుతాడు. అటు మినిష్టర్ కూడా జేడీపై మనం మళ్లీ మళ్లీ గెలుస్తూనే ఉండాలని మీనన్‌కు చెబుతుంది.
ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన కౌషికి..గుడిలో జరిగిన దాని గురించే ఆలోచిస్తుంటుంది. తనను వదిన అని పిలిచింది ఎవరు అని పదేపదే గుర్తుచేసుకుంటుంది. జేడీ నిజంగానే నన్ను వదిన అనిపిలిచిందా..లేక నేనే ఊహించుకుంటున్నానా అని ఆలోచిస్తుంది. జేడీతో మాట్లాడిన ప్రతిసారీ సొంతమనిషితో మాట్లాడినట్లే ఉంటుంది ఎందోకోనని అనుకుంటుంది. గతంలోనూ తాను తనకి అండగా ఉన్న విషయాలన్నీ గుర్తుకు వస్తాయి. ఇంట్లోనూ జగధాత్రి గుడిలో జరిగిన బ్లాస్ట్ గురించే ఆలోచిస్తుండటంతో కేధార్ వచ్చి ఆమెతో మాట్లాడతాడు. మనం కొంచెం ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వాల్సింది కేదార్...నా కళ్లముందే అన్ని ప్రాణాలు పోయాయని బాధపడుతుంటుంది. మీనన్ క్రైమ్‌చేసే ప్రతిచోట మనం ఉండలేం కదా...అతని సామ్రాజ్యం చాలా పెద్దదని చెబుతాడు. మీనన్‌ను చంపకుండా తప్పుచేశామేమోనని అనిపిస్తుందని ధాత్రి అంటుంది. నువ్వు అలా మాట్లాడకు ధాత్రి...మీనన్‌ను చంపితే వాడి కుర్చీలోకి మరొకరు వస్తారని నీకు తెలుసు...మన లక్ష్యం వాడ్ని చంపడం కాదు...వాడి చీకటి సామ్రాజ్యం కూకటి వేళ్లతో కూల్చడమే అని కేడీ అనడంతో ఈరోజు ఏపీసోడ్ ముగిసిపోతుంది.





















