Jagadhatri Serial Today December 23rd: ‘జగధాత్రి’ సీరియల్: డ్రగ్స్ దందాలో షామిలి – హీరోయిన్ ఇంట్లో దొరికిన నెక్లెస్
Jagadhatri Today Episode: హీరోయిన్ ఇంట్లోకి వెళ్లిన ధాత్రి కీలకమైన ఆధారాలు తీసుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: హీరోయిన్ కలవడానికి ముందు గేటు వైపు నుంచి కేదార్, వెనక గేటు నుంచి ధాత్రి వెళ్తారు. లోపలికి వెళ్లిన కేదార్ హీరోయిన్ ను కలిసి తాను చిత్తూరు డిస్ట్రిక్ నుంచి మీ అభిమాన సంఘం ప్రెసిడెంట్ ను అని కేదార్ చెప్తాడు. నువ్వు ప్రెసిడెంట్ కాదు కదా..? అని హీరోయిన్ అడగ్గానే నిన్ననే నన్ను ఎన్నుకున్నారని కేదార్ చెప్తాడు. మరోవైపు లోపలికి వెళ్లిన ధాత్రి ఇంట్లో అంతా చెక్ చేస్తుంది.
హీరోయిన్: రాధ..
రాధ: చెప్పండి మేడం..
హీరోయిన్: చెప్పండి ఏం తీసుకుంటారు.. కాఫీ, టీ..
కేదార్: మాకు కావాల్సిన ఆధారాలు దొరికితే చాలు..
హీరోయిన్: వాట్ ఏమన్నారు..?
కేదార్: ఏమీ వద్దు మేడం మిమ్మల్ని కలవడం మీతో ఇలా మాట్లాడటం..మీ ముందు ఇలా కూర్చోవడం ఇచ్చే కిక్కు కాఫీ టీలు ఇవ్వవు అని నా ఉద్దేశం.
హీరోయిన్: ఇలాంటి మాటలు విన్నప్పుడు నిజంగా మేము గాలిలో తేలినట్టు ఉంటుంది. ఫ్లీజ్ నా కోసం ఏమైనా తీసుకోండి.
కేదార్: మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మీ కోసం కాఫీ తాగుతాను.
హీరోయిన్: రాధ వెళ్లి కాఫీ తీసుకురా…? వెళ్లు రాధ.
రాధ: జ్యూస్ అడిగితే వెజిటేబుల్స్ అయిపోయాయి అంటావు. కాఫీ తీసుకురా అంటే కాఫీ పొడి అయిపోయింది అంటావేంటి…?
కేదార్: టీ అయినా పర్వాలేదు మేడం. నాకు మీతో కంపెనీ ముఖ్యం కానీ ఏదైనా తాగుతాను.
అని కేదార్ చెప్పగానే టీ తీసుకురమ్మని రాధకు చెప్తుంది హీరోయిన్. ఇంతలో పైన తనిఖీలు చేస్తున్న ధాత్రికి కొన్ని ఆధారాలు దొరుకుతాయి. ఇంతలో హీరోయిన్ కు ప్రొడ్యూసర్ కాల్ చేయడంతో కాల్ మాట్లాడుతుంది. పనిమనిషి రాధ పైకి వచ్చి రూంలో ఎవరో ఉన్నారని చూసి డోర్ వేసి వెళ్తుంది. ధాత్రి కర్టెన్ వెనక దాక్కుంటుంది. ఆధారాలు తీసుకుని ధాత్రి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పనిమనిషి కిందకు వెళ్లి ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని చెప్తుంది. పైకి వెళ్లి చూసిన హీరోయిన్ అందరినీ తిడుతుంది. హీరోయిన్ కిందకు రాగానే కేదార్ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చి ఉంటాడు. మరోవైపు వైజయంతి గట్టిగా అరుస్తుంది. యువరాజ్, నిషిక వచ్చి అరవొద్దని చెప్తారు.
నిషిక: అయినా ఆ జగధాత్రికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది. అత్తయ్యకు సేవలు చేస్తానని చెప్పి ఇలా అన్నంలో కారం కలిపి పెడుతుందా..?
వైజయంతి: మీకు కూడా నేను సైగలు చేస్తూనే ఉన్నాను. అయినా మీరు ఏమైనా గమనించారా..? ఒకరు పోతే ఇంకొకరు ఆ కారంతో ఉన్న అన్నం నా నోట్లో కుక్కడం. బెల్లం తెప్పించమన్నాను తెప్పించారా..?
యువరాజ్: తెప్పించాను అమ్మా..
నిషిక: సారీ అత్తయ్య ఆ ధాత్రి ముందు మేము కూడా యాక్టింగ్ చేయాలి కాబట్టి చేశాము .
వైజయంతి: యాక్టింగ్ అంటే గుర్తు కొచ్చింది. కొంపదీసి నేను యాక్టింగ్ చేస్తున్నాను అని ఆ జగధాత్రికి తెలిసిపోయిందేమో..?
అని వైజయంతి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. హీరోయిన్ ఇంటి నుంచి వస్తున్న ధాత్రి, కేదార్ విగ్రహం కేసు గురించి ఆరా తీస్తుంటారు. పంతులు ఎక్కడున్నాడో కనిపెట్టాలని అనుకుంటారు. ఇంతలో నిషిక ఫోన్ చేసి టాబ్లెట్స్ దొరకలేదా అని అడుగుతుంది. దొరకలేదని ధాత్రి చెప్పగానే యువరాజ్ తెచ్చాడు మీరు ఇంటికి రండి అంటుంది నిషిక. సరే అంటుంది ధాత్రి. ఇంతలో సాధు ఫోన్ చేసి సిటీలో డ్రగ్స్ దందా అంతా అమ్మాయిల చేతి మీదుగా జరగుతుందని వాళ్లను కనిపెట్టాలని చెప్తాడు. ధాత్రి ఒకే అంటుంది. సాధు పంపించిన లోకేషన్ కు వెళ్లి డ్రగ్స్ దందా చేస్తున్న వాళ్లను పట్టుకుంటారు. ఇంతలో షామిలికి గన్ పెట్టి కారులోంచి దిగుతాడు మరో రౌడీ దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!