అన్వేషించండి

Jagadhatri Serial Today August 12th: ‘జగధాత్రి’ సీరియల్‌: దివ్యాంకను చంపబోయిన కౌషికి – వజ్రపాటి ఇంట్లోకి మరో వారసుడి ఎంట్రీ

Jagadhatri Today Episode: మ్యాట్రిమోనిలో కౌషికి పేరుతో రిజిస్టర్ చేసి నకిలి పెళ్లి కొడుకును దివ్యాంకే పంపిందని ధాత్రి, కేదార్ నిరూపించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: సత్యప్రసాద్‌ విషయలో జగధాత్రి చెప్పింది నిజమే అయితే మన మాధురి జీవితాన్ని కాపాడింది అవుతుంది అని కౌషికి అనడంతో నేను చెప్పింది తప్పే అయితే  ఆయనకు క్షమాపణలు చెప్పడమే కాదు. ఆయన కాళ్లు పట్టుకోవడానికి కూడా నేను సిద్దమే అంటుంది ధాత్రి. దీంతో నిజానిజాలు తెలిశాకే పెళ్లి గురించి మాట్లాడుదామని కౌషికి చెప్పడంతో అంతేనని సుధాకర్‌ చెప్పి ధాత్రి, కేదార్‌లను పైకి వెళ్లమని చెప్తాడు. సరేనని పైకి వెళ్తారు. బూచి వచ్చి నిషికను తన మాటలతో రెచ్చగొడతాడు. తర్వాత ధాత్రి, కేదార్‌ ఏదో షూటింగ్‌ దగ్గరకు వెళ్లి బాబును వెతుకుతారు.

ధాత్రి: ఈ బాబుతో చిన్న పని ఉండి వచ్చాము.. పది నిమిషాలు టైం ఇస్తే మాట్లాడేసి వెళ్తాము. బాబు మీ పేరెంట్స్‌ ఎక్కడ.

బాయ్‌: పక్కనే ఉన్నారండి.. అమ్మా ఇటు రామ్మా..

బాబు తల్లి: నేనేనండి బాబు తల్లిని..

కేదార్‌: మీరు పేరెంట్స్‌ అయితే రెండు రోజుల క్రితం బాబును తీసుకుని మా ఇంటికి వచ్చిన అతను ఎవరు?

ధాత్రి: మాకైతే అతనే తండ్రి అని మా వదినను పెళ్లి చేసుకుంటానని చెప్పారు.

 బాబు గురించి కౌషికిని రెండో పెళ్లి చేసుకుంటానని ఇంటికి వచ్చిన మన్మథ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారు. షూటింగ్‌ లో ఉన్న మన్మథ దగ్గరకు వెళ్లి పెళ్లిచూపులకు ఎందుకు వచ్చావని ఎవరు చెప్తే వచ్చావని అడిగేసరికి మన్మథ బెదిరిస్తాడు. రెండు తగిలించాక మన్మథ తనను దివ్యాంక ఆ నాటకం ఆడమని డబ్బులిచ్చారని చెప్తాడు. దీంతో మన్మథను తీసుకుని ఇంటికి వస్తారు ధాత్రి, కేదార్‌. నిజం తెలియడంతో కౌషికి ఆవేశంతో దివ్యాంకను కొడుతూ.. చంపేయబోతుంది. దీంతో అందరూ అడ్డుకుంటారు.    

నిషిక: అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? వదిన

ధాత్రి: నువ్వు అడగాల్సింది వదినను కాదు నిషి. ఈ దివ్యాంకను. పగ ప్రతికారం పేరుతో హద్దులు దాటి ప్రవర్తిస్తుంది.

నిషిక: మధ్యలో మాట్లాడావంటే చెంప పగులుద్ది. ఇది నీకు సంబంధించిన విషయం కాదు. నోరు మూసుకుని ఉంటే ఉండు లేకుంటే వెళ్లిపో..

ధాత్రి: ఇంకోక్కసారి దివ్యాంక విషయంలో ఆమెను వెనకేసుకొస్తే నువ్వు కాదు నేనే నీ చెంప పగులగొడతాను.

నిషిక: నాకే ఎదురు మాట్లాడతావా? ఎంత ధైర్యమే నీకు

అంటూ ధాత్రిని నిషిక కొట్టబోతుంటే కౌషికి అడ్డు వస్తుంది. ధాత్రి నా మనిషి. నా విషయంలో ధాత్రికి మాట్లాడే హక్కు ఉంది. అనగానే దివ్యాంక, వైజయంతి ఇద్దరూ కలిసి ఇదంతా నాటకం అన్నట్లుగానే దివ్యాంకే చేయించింది అనేది కూడా నాటకం అయ్యుండొచ్చు కదా అని ప్రశ్నిస్తారు. దీంతో ధాత్రి, మన్మథ ఫోన్‌ తీసుకుని దివ్యాంక అతనితో ఇదంతా చేయించకపోతే మన్మథకు ఎందుకు డబ్బులు వేసింది. అని మన్మథ ఫోన్‌ తీసుకుని చూపించగానే సుధాకర్‌, దివ్యాంకను తిడతాడు.

కౌషికి: నీకెలా థాంక్స్‌ చెప్పాలో తెలియడం లేదు ధాత్రి. నా భర్త కూడా నన్ను నమ్మనప్పుడు నిజాన్ని బయటపెట్టి నా గౌరవాన్ని కాపాడారు. థాంక్స్‌.

ధాత్రి: నాకు థాంక్స్‌ చెప్తున్నారేంటి వదిన. ఇది నేను చేసిన సహాయం కాదు. నేను తీర్చుకోవాల్సిన బాధ్యత.

సురేష్‌: కౌషికి సారీ..

కౌషికి: సారీయా? చెప్పకు సురేష్‌. ఆ రోజు ఒకడు వచ్చి చెప్పాడని కోపంతో నన్ను అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు ఇదంతా దివ్యాంక ప్లాన్‌ అనగానే సారీ చెప్తున్నావు. ఇందులో నా మీద నమ్మకం ఎక్కడుంది సురేష్‌.

  అని కౌషికి చెప్తుంటే ధాత్రి ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూడాలనుకుంటుంది. ఇంతలో కమలాకర్‌ కౌషికి మనసులో అపార్థం పెరిగేలా మాట్లాడతాడు. కౌషికి వెళ్లిపోతుంది. సురేష్‌ కూడా కౌషికి దగ్గరకు వెళ్తాడు. ఏమోషనల్‌‌గా ఫీలవుతూ ఏడుస్తుంటాడు. ఇంతలో కౌషికి స్పృహ తప్పి పడిపోతుంది. డాక్టర్‌ వచ్చి పరీక్షించి తను ప్రెగ్నెంట్‌ అని చెప్పడంతో నిషిక, వైజయంతి, కమలాకర్‌, యువరాజ్‌ షాక్‌ అవుతారు. సుధాకర్‌, సురేష్‌, ధాత్రి, కేదార్‌ హ్యాపీగా ఫీలవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: 'లైగర్' ఫ్లాప్... పూరికి రాజమౌళి తండ్రి ఫోన్... ఎమోషనలైన డైరెక్టర్!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget