Jabardasth Varsha Love: మీ మమ్మీకి కోడలు వస్తుందని చెప్పు - పబ్లిక్‌గా 'జబర్దస్త్' వర్ష పెళ్లి ప్రపోజల్
'జబర్దస్త్' వర్ష పబ్లిక్‌గా పెళ్లి ప్రపోజల్ చేసింది. 'మీ అమ్మకు కోడలు వస్తుందని చెప్పు' అని ఆర్డర్ వేసింది. ఆ కథేంటో తెలుసా?
![Jabardasth Varsha Love: మీ మమ్మీకి కోడలు వస్తుందని చెప్పు - పబ్లిక్‌గా 'జబర్దస్త్' వర్ష పెళ్లి ప్రపోజల్ Jabardasth Varsha asks Emmanuel to tell about their story in his family, sent wedding proposal on Extra Jabardasth stage Jabardasth Varsha Love: మీ మమ్మీకి కోడలు వస్తుందని చెప్పు - పబ్లిక్‌గా 'జబర్దస్త్' వర్ష పెళ్లి ప్రపోజల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/18/7cc68cd1a2fdbdb9f7bce4a38f9fae7d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jabardasth Emmanuel and actress Varsha are going to tie knot?: 'జబర్దస్త్' షోలో కామెడీ కోసం, బుల్లితెర వీక్షకులను ఆకట్టుకోవడం కోసం లవ్ ట్రాక్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. 'సుడిగాలి' సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ మధ్య లవ్ అందులో భాగమే. ఇమ్మాన్యుయేల్, వర్ష ట్రాక్ కూడా అటువంటిదే అని చాలా మంది ఫీలింగ్. అయితే, 'ఎక్స్ట్రా జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో చూస్తే... వాళ్ళిద్దరి ట్రాక్ పెళ్లి పీటల వరకూ వెళుతుందేమో? అన్నట్టు ఉంది.
''సాధారణంగా ప్రేమించుకుంటున్న వాళ్ళ మధ్య అనుమానాలు రావడం సహజమే. ఎప్పుడైనా మీ మధ్య అటువంటిది ఉందా? ఇమ్మూ అనుమాన పడటం వంటివి?'' అని ఇంద్రజ అడిగారు.
''నా జీవితంలో ఏదైనా అదృష్టం ఉందంటే... అది నా ఇమ్ము మాత్రమే. ఎవరు ఏం అనుకున్నా నో ప్రాబ్లమ్. వీడేంటి? ఆ అమ్మాయి ఏంటి? అదీ... ఇదీ... వీళ్ళిద్దరిదీ అలా ఇలా? అని! ఈ రోజు నేను చెబుతున్నా... ఇమ్మూ అంటే నిజంగా నాకు ఇష్టం'' అని వర్ష మరోసారి ప్రేమను బయట పెట్టారు.అంతటి ఆగలేదు. ఆ తర్వాత ''మీ మమ్మీకి చెప్పు... కోడలు వస్తుందని'' అని చెప్పిన వర్ష, స్టేజి మీద నుంచి వెళ్ళింది. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. టీమ్ లీడర్ బుల్లెట్ భాస్కర్ అయితే ఇమ్మూకి షేక్ హ్యాండ్ ఇవ్వడం గమనార్హం.
Also Read: 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ: కామకోరిక ఎంత దూరం తీసుకువెళుతుంది? ఏయే పనులు చేయిస్తుందంటే?
'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో ఈ మధ్య టీఆర్పీ కోసం స్పెషల్ స్కిట్స్ చేస్తున్నారు. ఆ షో ప్రొడ్యూస్ చేస్తున్న మల్లెమాల సంస్థ 'ఎక్స్ట్రా జబర్దస్త్' షో కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్ల, ఇది మరో టీఆర్పీ స్టంట్ అని నెటిజన్స్ తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్‌లో ప్రోమో కింద కామెంట్స్ చేస్తున్నారు. అదీ సంగతి!
Also Read: 'విరాట పర్వం' రివ్యూ: రానా, సాయి పల్లవి సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)