అన్వేషించండి

Brahmamudi August 24th: కోడలిని రఫ్ ఆడించిన ఇందిరా దేవి - అపర్ణకు మాములు షాక్ ఇవ్వలేదుగా!

అపర్ణకు తన అత్త, మామయ్య గట్టిగా క్లాస్ పీకటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Brahmamudi August 24th: కావ్య తన అత్త దగ్గరికి క్షమాపణలు చెప్పడానికి వెళ్లగా ఆవిడ మాత్రం పొగరుగా సమాధానం ఇస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి చెడ్డ పేరు తెచ్చావు.. అందుకే నా కొడుకు నిన్ను గెంటేశాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరితే నా కొడుకు శాంతిస్తాడని ఎలా అనుకుంటున్నావు.. నీకు తెలివితేటలు నాకు అర్థం కావాలనుకుంటున్నావా అని  గట్టిగా మాట్లాడుతుంది అపర్ణ.

దాంతో కావ్య తనకి అన్ని తెలివితేటలు ఉంటే తన అక్క లాగా అందరికి నచ్చే విధంగా మేనేజ్ చేసే దాన్ని.. కానీ అలా చేతకాకే ఇలా ఉంటున్నాను.. మీరు నన్ను కోడలుగా చూసినా చూడకపోయినా.. నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ అత్తయ్యలానే గౌరవిస్తుంటాను అని క్షమాపణలు చెబుతుంది. కానీ అపర్ణ మాత్రం చీదరించుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక కావ్యకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తనపై బాగా ఫైర్ అవుతూ ఉంటుంది.

అంతేకాకుండా ఎప్పటికీ కోడలిగా ఒప్పుకోను అని గట్టిగా చెప్పేస్తుంది. దాంతో కావ్య ఆ మాటలు తట్టుకోలేక తన గదిలోకి వెళ్లి అక్కడున్న కృష్ణుడి విగ్రహం దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నీకు సంతోషమే కదా.. ఈ రోజు నేను నా తల్లిదండ్రుల కోసం పడుతున్న కష్టం ఒక అబ్బాయి పడితే అది బాధ్యత అవుతుంది కదా.. మరి నేను చేస్తే తప్పు ఎలా అవుతుంది అని అంటుంది.

ఇక ఇంత అవమానం జరుగుతున్న కూడా ఇక్కడే ఎందుకు ఉంటున్నాను అంటే.. నా భర్త బంగారం.. నన్ను భార్యగా అంగీకరించకపోవడానికి ఆయనకున్న అభ్యంతరాలను జయిస్తే ఆయన నా సొంతం అవుతారు.. ఎలాగైనా ఆయన మనసులో స్థానం దొరుకుతూనే అందుకే ఇక్కడ ఉన్నాను అని అంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా పరిస్థితుల్లో పుట్టింటికి వెళ్ళిపోతే తల్లితండ్రులు కృంగిపోతారు..

పైగా అత్తారింటి పరువు కూడా పోతుంది అందుకే ఇక్కడ ఉన్నాను అని అంటుంది. నాకు పోరాటం చేసే శక్తి ఇవ్వు అంటూ దేవుడిని కోరుకుంటుంది. ఆ తర్వాత రాజ్ తన చేతికి ఉన్న బ్యాండేజ్ ఇవ్వటానికి ప్రయత్నిస్తుండగా వెంటనే కావ్య వచ్చి ఆపుతుంది. కానీ వినకుండా ఆ బ్యాండేజ్ పక్కకి పడేస్తాడు. ఇక కావ్య మీతో ఒక విషయం మాట్లాడాలంటూ.. మా నాన్నకి సహాయం చేస్తారని మాట ఇచ్చాను కదా అక్కడికి వెళ్లాలా వద్దా అని అడుగుతుంది.

కానీ రాజ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. మరోవైపు కళ్యాణ్ కు అనామిక ఫోన్ చేసి 9 నెంబర్లు చెప్పి ఇంకొక్క నెంబర్ కనుక్కోమని అంటే నెంబర్ కనిపెట్టలేకపోయారు. అయితే ఇప్పుడు ఒక క్లూ ఇస్తాను అని ఒక క్లూ ఇచ్చి దాని ద్వారా నెంబర్ కనుక్కోమని చెబుతుంది. దాంతో కళ్యాణ్ కనుక్కుంటాను అని అంటాడు.

ఆ తర్వాత తన భర్త ఏమి చెప్పకపోతే సరికి కావ్య ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లకు చెప్పడానికి వెంటనే తన తాత దగ్గరికి వెళ్లి ఇంటికి వెళ్లడానికి పర్మిషన్ అడుగుతుంది. అప్పుడే సప్న మధ్యలో కలుగజేసుకొని.. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదని చెబుతున్న కూడా అక్కడికి వెళ్తానంటావ్ ఏంటి అను ప్రశ్నిస్తుంది. దాంతో కావ్య తిరిగి.. ఇంట్లో వాళ్ళు ఏమైతే నాకేంటి అని నువ్వు అనుకున్నంత సులువుగా నేను ఉండలేను అని నువ్వు మధ్యలో మాట్లాడకు అని అంటుంది.

ఇక సీతారామయ్య ఇంట్లో పెద్దరికం ఇంకా బతికే ఉందని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు.. అంతేకాకుండా ఇక్కడ నీ మాటకే కాదు నా మాటకి కూడా విలువ లేదు అని.. మీ అత్తగారు నీకు విలువ ఇవ్వట్లేదు నా కోడలు నాకు విలువ ఇవ్వట్లేదు అని కాస్త బాధ పడితే చెబుతాడు.అప్పుడే అపర్ణ మామయ్య గారు అని అనటంతో వెంటనే ఆయన.. నీ ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడానా అని ప్రశ్నిస్తాడు.

అప్పుడే ఇందిరా దేవి.. మీ మామయ్య అన్నదాంట్లో తప్పేముంది అని వచ్చి ప్రశ్నిస్తుంది. మేము లేకుంటే ఇక్కడ ఎవరూ లేరు ఈ ఇంటికి పెద్ద నా భర్త.. ఈ ఇంటికి కోడలుగా మొదటిగా వచ్చింది నేనే.. మా మాట విలువ లేకుండా చేశావు నువ్వు.. కావ్య వర్షంలో నిలబడితే ఆ అమానుషత్వాన్ని ఖండించడానికి మాకు వీలు లేకుండా చేశావు అని కోడలిపై కోప్పడుతుంది దాంతో అపర్ణ అలా చేసింది నేను కాదు కదా రాజ్ కదా అనటంతో.. వాడు నీ కొడుకే కదా అని తిరిగి ప్రశ్నిస్తుంది ఇందిర.

దాంతో అపర్ణ అందరూ కలిసి తనను తప్పుపడుతున్నారా అని అంటుంది. అంతేకాకుండా ఏ విషయంలో అయితే ఇంత రాద్ధాంతం జరిగిందో మళ్లీ అదే విషయం తిరగదడాల్సిన అవసరం ఈ అమ్మాయికి ఉందంటారా అని అడుగుతుంది. దాంతో ఇందిరా ఉంది అంటూ.. ఈ అమ్మాయికి తన తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంది అని.. నువ్వు ఒక కోడలిగా తనను అంగీకరించినప్పుడు తన మీద ఆంక్షలు విధించే అవసరం నీకు ఏముంది అని ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా తను మళ్ళీ ప్రశ్నించకుండా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

ఇక సీతారామయ్య తమ వంశం గురించి గొప్పగా చెప్పి 
అటువంటి వంశంలో ఒక ఆడపిల్లకు స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించి అందరి నోర్లు మూయిస్తాడు. ఇక కావ్య ధైర్యంగా ఇంటికి వెళ్ళమని చెబుతాడు. ఇక ఇందిరా దేవి ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. మరోవైపు రాజ్ కు ఒక క్లైంట్ ఫోన్ చేసి.. మిడిల్ క్లాస్ వాళ్ల కోసం చేసిన డిజైన్స్ అన్ని బాగున్నాయని అంటాడు. అందులో మూడు డిజైన్స్లలో మాత్రం చిన్న మార్పులు చేస్తే బాగుంటుంది అని మా టీం వాళ్ళు చెప్పారు అంటూ..  మీ డిజైనర్ కావ్య గారికి ఏదైనా డౌట్ వస్తే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పండి అనటంతో వెంటనే రాజ్ కు కోపం వస్తుంది.

also read : Janaki Kalaganaledu serial: సీరియల్‌కు గుడ్ బై, శ్రీశైలంలో ‘జానకి కలగనలేదు’ ఫ్యామిలీ ట్రిప్ - ఆ ఒక్కరు మిస్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget