Illu Illalu Pillalu Serial Today September 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: కల్యాణ్‌ని చితక్కొట్టిన ప్రేమ.. తండ్రి ఆశీర్వాదం తీసుకున్న సాగర్ అసలు రహస్యమేంటి?
Illu Illalu Pillalu Serial Today September 8th ప్రేమ కల్యాణ్‌ని రోడ్డు మీద పరుగెత్తించి కొట్టడం, లేచిపోయి పెళ్లిళ్ల వల్ల విశ్వ పెళ్లి సంబంధం క్యాన్సిల్ కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద సాగర్‌కి దగ్గరుండి పరీక్షకు రాయడానికి దేవుడికి దండం పెట్టించి జాగ్రత్తలు చెప్తుంది. సాగర్ రామరాజు ఆశీర్వాదం తీసుకుంటానని చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా మా నాన్న ఆశీర్వాదం తీసుకున్నానని అంటాడు. ఏంటో రా అని ఇద్దరూ రామరాజు దగ్గరకు వెళ్తారు.
వల్లి చూసి ఆ పేపర్ ఏంటో అని దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. సాగర్, నర్మద రామరాజు దగ్గరకు వెళ్తారు. సాగర్ రామరాజుతో నాన్నగారు మీ ఆశీర్వాదం ఇవ్వండి అని అంటాడు. తిరుపతి సాగర్‌తో అప్పుడు ఇలాగే ఆశీర్వాదం అడిగి ఈమెను పెళ్లి చేసుకొని వచ్చావ్.. ఇప్పుడు ఆశీర్వాదం అడిగావు అంటే ఏదో పెద్ద స్కామే ఉందని అంటాడు. దానికి రామరాజు వీడికి బుర్ర లేదు అనుకున్నా కానీ వీడికి బుర్ర ఉందిరా ఏంట్రా విషయం అని అంటాడు. దానికి సాగర్ ఎగ్జామ్ అని అనేస్తాడు. అందరూ ఎగ్జామా అని అడుగుతారు. పెళ్లి అని నర్మద కవర్ చేస్తుంది.
వల్లి మరిది గారితో ఏ పరీక్షకు వెళ్లేవారో ఇంటర్వూకి వెళ్లేవారో ఇలా ఆశీర్వాదం తీసుకుంటారు కానీ ఇలా పెళ్లికి వెళ్తూ ఆశీర్వాదం ఏంటి అని అడుగుతుంది. దానికి సాగర్ చిన్నప్పటి నుంచి అలవాటు అని అంటాడు. ఇక తిరుపతి టక్ వేసుకున్న సాగర్‌తో నీ డ్రస్సింగ్ మీద అనుమానంగా ఉందని అంటాడు. రామరాజు ఆ బట్టల్లో నా కొడుకు దొరబాబులా ఉన్నాడు అని ఆశీర్వదించి వెళ్లమని అంటాడు. ఇంతలో వల్లి ఆపి మీరు నర్మద ఇందాక ఏదో పూజ చేశారు.. ఏదో ఒక కాగితం ముక్కకి పూజ చేశారు.. తర్వాత ఆ కాగితం కళ్లకు అత్తుకొని జేబులో పెట్టుకున్నారు ఏంటి అని అడుగుతుంది. ఆ కాగితం ఇవ్వమని అడుగుతుంది.
రామరాజు కూడా అడగటంతో ఆ కాగితం ఇస్తారు. అది చూసి తిరుపతి బియ్యం బస్తాల లెక్కలు అని వాటిని చదువుతాడు. బాగా తప్పించుకున్నారని కానీ నేను వదలను అని వల్లీ అనుకుంటుంది. మరోవైపు ప్రేమ కల్యాణ్ గురించి తన ఫ్రెండ్స్ అందరినీ అడుగుతూ ఉంటుంది. మొత్తం వెతికి వాడు నన్ను ఫాలో అవుతుంటాడు.. వాడిని ఎలా అయినా బయటకు తీసుకురావాలి అని పరుగులు పెడుతుంది. అది చూసి కల్యాణ్ కూడా ప్రేమ వెనకాలే పరుగులు పెడతాడు. ఓ చోట ప్రేమ వాడిని పట్టుకొని ఏరా నా కోసం వెతుకుతున్నావ్ కదా.. నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావారా అని చితక్కొడుతుంది. దెబ్బకి కల్యాణ్ పారిపోతే ప్రేమ వెనకాలే పరుగులు పెట్టి కొడుతుంది.
భద్రావతి ఇంటికి పెళ్లి వాళ్లు వస్తారు. కట్నాల గురించి మాట్లాడుతారు. దాంతో పెళ్లి వాళ్లు ఏ ముఖం పెట్టుకొని కట్నం అడుగుతున్నారు.. మీకు పిల్లని ఇవ్వడమే ఎక్కువ అని అంటారు. వందల కోట్ల ఆస్తికి నా మేనల్లుడు వాడిని ఇలా కట్నం ఎందుకు అంటారు అని అరుస్తారు. దాంతో పెళ్లి వాళ్లు మీ చెల్లి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా.. మీకు పెళ్లి కాలేదు కదా.. మీ మేనకోడలు లేచిపోయి పెళ్లి చేసుకుంది కదా అని అనడంతో వాళ్లతో ప్రేమ తండ్రి సేన గొడవ పడి పంపేస్తాడు. విశ్వ సైలెంట్‌గా కూర్చొంటాడు.
భద్రావతి, సేన వాళ్లని చంపేయాలి అనుకుంటే విశ్వ రచ్చ చేస్తాడు. అన్నీ విసిరేసి వాళ్లు అలా అనడానికి తప్పు అంతా మీదే.. ఆ రోజు ఆ రామరాజు గాడు చిన్నత్తని తీసుకొని వెళ్లినా ఏం చేయకుండా వదిలేశాం అందుకే వీళ్లకి చులకన అయిపోయాం అని అంటాడు. ఇలాగే అయితే మనల్ని అందరూ చులకన చేస్తారు. చివరకు చిన్న పిల్లలు కూడా మనల్ని చూసి ఎగతాళి చేస్తారు. మీరు నాకు ఎన్ని సంబంధాలు చూసినా ఇలాంటి అవమానాలే జరుగుతాయి అని అంటాడు. ఈ ఊరిలో ఇలాంటి అవమానాలతో చచ్చే కంటే వేరే ఏదైనా ఊరు వెళ్లి దాక్కొని చద్దాం అని అంటాడు. ఆపరా అని భద్రావతి అరిచి ఇది మన ఊరురా మన ఇంట్లో మనం బతకడానికి మన ఇంట్లో పనోడిగా ఉన్న ఆ రామరాజుకి భయపడి మనం వెళ్లడం ఏంటి ఇక నుంచి ఆ రామరాజుని ప్రతీ క్షణం భయపడేలా చేస్తా.. అలా చేయకపోతే నా పేరు భద్రావతే కాదు అని అంటుంది. నర్మద, సాగర్‌లు పరీక్ష సెంటర్‌కి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















