అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 28th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: బిందెక్కి చిందులేసిన శ్రీవల్లి! తిక్క కుదురుతుందా!

Illu Illalu Pillalu Serial Today Episode March 28th నర్మద, ప్రేమలు శ్రీవల్లిని ఓ ఆట ఆడుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu  Serial Today Episode: ఇడ్లీబాబాయ్‌ భాగ్యానికి జడ వేస్తూ ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదూ.. అని పాడుతూ ఉంటాడు. నా కూతురు ఆ బ్రహ్మ రాక్షసుల చేతిలో చిత్రహింసలు పడుతుంటే నీకు సరసాలు కావాలా అని తిట్టి దూరంగా కూర్చొపెడుతుంది. 

శ్రీవల్లికి కాల్ చేస్తుంది. శ్రీవల్లి ఆరు బయట కూర్చొని ఫోన్ లిఫ్ట్ చేసి ఏడుస్తుంది. అక్కడ అంతా సేఫేనా అని భాగ్యం అడుగుతుంది. కుళ్లబొడిచేస్తున్నారు అంటే సేఫ్‌ఏనా అని అడుగుతావేంటే.. ఇవాళో రేపో అన్నట్లు ఉందే నా పరిస్థితి అని అంటుంది. ఆ పచ్చిమిరపకాయ్.. పొట్టి మిరపకాయ్ ఆట కట్టించాలి అంటే నువ్వు ఆ ప్రేమ ఫోన్ లేపేయ్ అని అంటుంది భాగ్యం. బయట పడే మార్గం చెప్పవే అంటే బావిలో పడే మార్గం చెప్తావేంటే అని శ్రీవల్లి అంటుంది. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఇద్దరూ ప్రేమ ఫోన్ ఎలా దొంగతనం చేయాలా అని వల్లీకి చెప్తారు. ఈ సారి ఈ గజ దొంగ వల్లీ ఎవరికీ దొరకదు అని ఫోన్ కొట్టేయడానికి వల్లీ ప్రేమ గదికి వెళ్తుంది. 

ప్రేమ ఫోన్ ఛార్జింగ్‌లో ఉండటం చూసి ఫోన్ తీసుకొని బయటకు వెళ్తుంది. ప్రేమ, నర్మద బయటే ఉంటారు. ఎక్కడికి వెళ్లావ్ అక్కా అంటే వల్లీ ఫోన్ చూపిస్తుంది. ప్రేమ, నర్మద ఇద్దరూ వల్లీ అక్కా ఫోన్ ఇచ్చేయ్ అక్కా ప్లీజ్ అని బతిమాలినట్లు నటిస్తారు. వల్లీ ఫోన్ బకెట్ వాటర్లో పడేస్తుంది. శ్రీవల్లి వాళ్లని చూసి శ్రీరామనావమి క్లైమాక్స్ అని అన్నావ్ ఇప్పుడేంటి అని అంటుంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసేసింది అని నర్మద పాటలు పాడుతుంది. ఇదంతా తొండి నర్మద అని వల్లీ అంటే ఇన్ని చేస్తున్న మాకు నువ్వు ఫోన్ కొట్టేస్తావని తెలీదా.. దొంగతనం చేసినందుకు నీకు శిక్ష వేయాలి పద అని బయటకు తీసుకొస్తారు. 

వల్లీకి పనిష్మెంట్‌గా బయటకు తీసుకొచ్చి ఓ సర్కిల్ గీసి అందులో నుంచి బయటకు రాకుండా పెర్ఫ్మామెన్స్ చేయాలి అని చెప్తారు. నువ్వు చేసిన పాపాలకు శిక్ష పడాల్సిందే అని అ అంటారు. శ్రీవల్లీ బతిమాలినా వదలరు.. తొక్కుడు బిల్ల ఆడుతా అని అంటే నర్మద ఓ బిందె తీసుకొని వచ్చి దాని మీద డ్యాన్స్ వేయమని అంటారు. అందుకు కండీషన్‌గా బిందె మీద నుంచి కాలు కిందకు పెట్టకూడదు ఒకవేళ పెడితే వాయిస్ రికార్డ్ అందరికీ పంపేస్తామని అంటారు. దాంతో వల్లీ సరే అని డ్యాన్స్ చేస్తానని బిందె ఎక్కుతుంది. ఇందాక చేసిన ముద్రలు చేయమని నర్మద చెప్తుంది. వల్లీ డ్యాన్స్ చేస్తుంటే నర్మద, ప్రేమలు నవ్వుకుంటారు. డ్యాన్స్ చేసి చేసి వల్లీ కింద పడిపోతుంది. ఇద్దరూ వెళ్లి వల్లీ అక్కాయ్ ఉన్నావా అని అడిగితే లేదు పోయాను అని చెప్పి పడుకుండిపోతుంది. సరే ఈ రోజుకి రెస్ట్ తీసుకో రేపు కొత్త కచేరీ మొదలు పెడదాం అని ఇద్దరూ వెళ్లిపోతారు. రేపు కొత్త కచేరీనా వీళ్లు నన్ను చంపేసేలా ఉన్నారని వల్లీ కూనిరాగాలు తీస్తుంది. 

సాగర్ ఆఫీస్‌కి రెడీ అవుతూ పర్స్ చూసి నాలాగే దీనికి కష్టాలే పెట్రోల్ కొట్టించడానికి కూడా డబ్బులు లేవు అని అనుకుంటాడు. ఇంతలో నర్మద బాక్స్ తీసుకొని వస్తుంది. నర్మద సాగర్తో ఒక వైపు సంధికి దిగితే ఏం లాభం నా మొగుడు కూడా సంధికి రెడీ అవ్వాలి కదా.. లేదు వార్ చేస్తా అంటే ఏం లాభం అని అంటుంది. నర్మద అని సాగర్ అంటే ఏంటి సంధికి రెడీనా అని అంటుంది. అది నా పర్స్ అని సాగర్ అంటే నర్మద ఇస్తుంది. అది పర్సులో అని సాగర్ అంటే ఏంటి నా ఫొటో పెట్టుకున్నావా అని చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
Embed widget