అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతికి ధీరజ్‌ షాకింగ్ కండీషన్! విశ్వక్‌ని చిన్నోడు బయటకు తీసుకొస్తాడా!

 Illu Illalu Pillalu Serial Today Episode March 25th రేవతి ప్రేమ దగ్గరకు వచ్చి విశ్వక్‌ని విడిపించమని అడగటం ధీరజ్ భద్రావతికి షాక్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu  Serial Today Episode ధీరజ్‌ ఉదయం లేచే సరికి పక్కనే ప్రేమ ఉండటం చూసి తను లేచి ప్రేమకి దుప్పటి కప్పి వెళ్లిపోతాడు. తర్వాత ప్రేమ లేచి తనకి దుప్పటి కప్పి ఉండటం చూసి ధీరజ్‌నే కప్పాడని హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు భద్రావతి, సేనాపతిలు విశ్వక్‌ గురించి మాట్లాడుకుంటారు. రామరాజు కూతుర్ని పెళ్లి పీటల మీదకు తీసుకురారా అంటే ఇలా చేశాడని అనుకుంటారు. రేవతి ఆ మాటలు విని ఓహో ఇదంతా మీ కుట్ర అన్నమాట. నా కొడుకుని బలి చేసేశారా.. వాడిని బయటకు తీసుకురాకపోతే వేరేలా ఉంటుందని అంటుంది.

సేనాపతి రేవతిని కొట్టడానికి వెళ్తే భద్రావతి ఆపుతుంది. పోలీసులు చెప్పారు కదా వెళ్లి రామరాజుతో రాజీ పడండి అని అంటే అది జరగని పని అని భద్రావతి అని నీ కూతురిని అడుగు అని అంటుంది. అడుగుతా నా కొడుకు కోసం నా కూతుర్ని అడుగుతా.. అవసరం అయితే దాని కాలు కూడా పట్టుకుంటా అని వెళ్తుంది. రోజు రోజుకి దిగజారిపోతున్నాం అని సేనాపతి అక్కతో చెప్తాడు. మరోవైపు శ్రీవల్లి భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఏం జరిగింది అని భాగ్యం అడిగితే నా కొంప కొల్లేరు అయిపోయింది.. నా కాపురం కూలిపోతుంది అని వాయిస్ రికార్డ్ గురించి చెప్తుంది. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు అమ్మా.. ఆ నర్మద, ప్రేమల నుంచి నన్ను కాపాడమ్మా అని అంటుంది. భాగ్యం షాక్ అయిపోతుంది. ఇంట్లో విషయం చెప్పకుండా నీతో ఆడుకుంటున్నారు అంటే ఇంకేదో ప్లాన్ చేశారు.. వాళ్లు బయట పెట్టకముందే నువ్వు బయట పడిపోవద్దు.. జాగ్రత్తగా ఉండు.. అని భాగ్యం కూతురికి చెప్తుంది. 

వల్లీ చిరాకుగా ఉంటే చందు వచ్చి వెనక నుంచి వచ్చి హగ్ చేసుకుంటాడు. ఏమైంది వల్లీ ఇలా ఉన్నావ్ అంటే కూరలో కారం ఎక్కువైంది.. అత్తమామయ్య ఏమంటారని భయపడుతున్నా అని అంటుంది. ఇంత అమాయకం ఏంటి వల్లీ.. నేను చూసుకుంటా అని అంటాడు. నర్మద వాకిట్లో  ముగ్గు పెడుతుంటే ప్రేమ సంతోషంగా వచ్చి రాత్రి నాకు దుప్పటి కప్పాడు అని సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇంతలో రేవతి అక్కడికి వస్తుంది. ప్రేమని పిలుస్తుంది. ప్రేమ వెళ్లి తల్లిని హగ్ చేసుకుంటుంది. వల్లీ అది చూసి షాక్ అయిపోతుంది. ప్రేమతో రేవతి మాట్లాడుతూ ఉంటే చూసి నాకు మీరు టార్చర్ చేస్తారా మీ పని చెప్తా అని వేదవతి దగ్గరకు వెళ్లి అత్తయ్యారండి అయోధ్య లాంటి మన ఇంట్లో సాకిని డాకినీలు ఆ రాక్షసులతో ఎలా చేతులు కలిపారో చూడండి అని అంటుంది. వేదవతి లాగిపెట్టి కొట్టి వాళ్లు నా శత్రువులు వాళ్లని చూడమని అంటావా అని అడుగుతుంది. 

రేవతి ప్రేమని విశ్వక్‌ గురించి బతిమాలుతుంది. ప్రేమ మాత్రం నేను ఏ సాయం చేయలేను.. నీకు కూతురు ఉంది కదమ్మా అలాంటిది నీ కొడుకు ఇంకో ఆడపిల్లని ఇబ్బంది పెట్టాడు. అలాంటి వాడిని కాపాడమని అడుగుతున్నావ్.. అమూల్యకి న్యాయం జరగాలి వాడికి శిక్ష పడాలి అని ప్రేమ అంటుంది. దాంతో భద్రావతి ప్రేమని లాగిపెట్టి కొడుతుంది. ధీరజ్ దూరం నుంచి చూస్తాడు. వేదవతి, శ్రీవల్లి కూడా అక్కడికి వెళ్తారు. భద్రావతి ప్రేమతో నా చెల్లికి ఆ రామరాజు మందు పెట్టేసినట్లు నీకు కూడా వాడి కొడుకు మందు పెట్టేశాడే అందుకే ఇలా మాట్లాడుతున్నావ్.. తోడపుట్టిన వాడికి శిక్ష పడాలి.. పుట్టిళ్లు నీకు నేరస్తుల కొంపలా కనిపిస్తుందా అని తిడుతుంది. ఇంతలో ధీరజ్ చప్పట్లు కొట్టుకుంటూ అక్కడికి వస్తాడు. వావ్ అదిరిపోయింది.. పొద్దు పొద్దున్నే భద్రావతి నాటక కంపెనీ మా ఇంటి ముందు పెట్టేశారు.. తీయండి తీయండి అని అంటాడు. 

భద్రావతి కోపంగా రేయ్ ధీరజ్ నా మేనల్లుడినే అరెస్ట్ చేయించి నా ముందే వేషాలు వేస్తారా.. వాడిని బయటకు తీసుకొచ్చి అప్పుడు చెప్తారా మీ సంగతి అని అంటుంది. నాకు భయం వేస్తుంది కాళ్లు చేతులు వణికిపోతున్నాయ్ ఇప్పుడు ఎలా.. ముందు వాడిని బయటకు తీసుకురండి అప్పుడు చూద్దాం అంటాడు. రేయ్ నీకు పొగరు ఎక్కువ అయింది ఏదో ఒక రోజు అణిచేస్తా అంటాడు. దానికి ధీరజ్ నువ్వు అణిచేస్తే అణిగిపోవడానికి నీ ఇంటి ముందు మొక్క అనుకున్నావా.. పిసికేస్తే వణికిపోవడానికి నీ ఇంట్లో కుక్క అనుకున్నావా.. ఇలాంటి డైలాగ్స్ నేను చెప్పగలనురా నా కొడకా అని అంటాడు. భద్రావతితో పది నిమిషాల్లో నీ మేనల్లుడిని బయటకు తీసుకొస్తా అందుకు నువ్వేం చేస్తావ్ అంటాడు. ఏమైనా చేస్తా అని భద్రావతి అంటే మాటల్లో కాదు చేతల్లో చూపించు అని రామరాజుని పిలుస్తాడు. 

ధీరజ్ రామరాజు ముందు బకెట్‌తో నీళ్లు పెట్టి మా నాన్న కాలు కడిగి నువ్వు మీ తమ్ముడు క్షమాపణ చెప్పండి.. పదే పది నిమిషాల్లో ఆ విశ్వక్ ఇక్కడ ఉంటాడు అని అంటాడు. సేనాపతి అరిస్తే భద్రావతి ఆపి ముందుకు వస్తుంది. అందరూ కాళ్లు కడుగుతుంది అనుకుంటే భద్రావతి బకెట్‌ని తన్నేస్తుంది. ఏంట్రా మీ నాన్న కాలు కడగాలా.. అవసరం అయితే నా ఆస్తి మొత్తం అమ్మి అయినా వాడిని బయటకు తీసుకొస్తా.. రేయ్ రామరాజు నిన్ను మాత్రం జైలు పాలు చేయకుండా వదలను అని అంటుంది. నేను ఒంటరిగా ఉంటే ఎదురుగా రాకుండా వెనక నుంచి వస్తారు.. ఇన్నాళ్లు నేను ఒంటరిని ఇప్పుడు నా ముందు నా కొడుకులు ఉన్నారు.. నా పంచి మీద అంచు కూడా పీకలేరు అని రామరాజు అంటాడు. మీ పొగరు దించుతారా అని భద్రావతి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget