అన్వేషించండి

Jagadhatri Serial: కౌషికి దగ్గర నుంచి తీసుకున్న షేర్లు నిషిక ఏం చేయాలనుకుంటుంది..?కొత్తగా పుట్టుకొచ్చిన భార్య, కొడుకును చూసి మీనన్‌ షాక్‌ తిన్నాడా..?

Jagadhatri Serial Today Episode March 24th:కౌషికి దగ్గర నుంచి తీసుకున్న షేర్లు నిషిక ఏం చేయాలనుకుంటుంది..?కొత్తగా పుట్టుకొచ్చిన భార్య, కొడుకును చూసి మీనన్‌ షాక్‌ తిన్నాడా..?

Jagadhatri Serial Today Episode: కంపెనీ షేర్లు తమ పేరిట రావడంతో వైజయంతి, యువరాజు సంతోషపడుతుండగా..నిషిక మాత్రం చాలా ఆందోళనగా ఉంటుంది. ఇప్పుడు షేర్లు మన పేరిట ఉన్నాయి కదా ఎందుకు అలా ఉన్నావంటే...షేర్లు మన పేరిట ఉన్నా కంపెనీ మాత్రం మనది కాదని దానికి సీఈవోగా వదిన ఉన్నంత వరకు మనం ఏం చేయలేమని అంటుంది. అయితే వాళ్లు చెప్పినట్లు ఈ పేపర్లు చిత్తు కాగితాలేనా అని అనగా....మనం వాళ్లకు తెలిసి షేర్లు అమ్మం కానీ తెలియకుండా అమ్ముకోవచ్చు కదా అని అంటుంది. అంటే మనం బయటివాళ్లకు ఈ షేర్లు అమ్మి కోట్లు సంపాదించుకోవచ్చని అంటుంది. ఆ డబ్బులతో మనమే ఓ కంపెనీ పెట్టుకుందామని అప్పుడు మనల్ని ఆపడానికి ఎవరూ ఉండరని అంటుంది. ఒకవేళ బయటి వాళ్లకు ఈ షేర్లు అమ్మిన తర్వాత మీ మామయ్య, వదిన ఏమైనా పనికిరాకుండా చేస్తే ఏం చేద్దామని అంటే...అప్పుడు కొన్నవాళ్లు, వీళ్లు చూసుకుంటారని మనకు పోయేది ఏముంటుదని అంటుంది.

                ఈ మాటలన్నీ విన్న జగధాత్రి, కేదార్ గదిలోకి వచ్చి నిషికపై మండిపడతారు. కూర్చున్న కొమ్మను నరుక్కునే మీలాంటి వాళ్లను ఎక్కడా చూడలేదని అంటారు. నిషికకు అంటే తెలియకపోవచ్చు...నీకు కంపెనీ విషయాలన్నీ తెలుసుకదా  యువరాజు అని కేదార్ నిలదీస్తాడు. ఈ కంపెనీని ఎలాగైనా భూస్థాపితం చేయాలని మన ప్రత్యర్థులు ఎంతగా ఎదురుచూస్తున్నారో కూడా తెలుసు కదా అని అంటాడు. వాళ్ల చేతుల్లోకి ఈ షేర్లు వెళ్లాలంటే మన కంపెనీ మూతపడుతుందని...ఇక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది జీవితాలు రోడ్డుమీదకు వస్తాయని జగధాత్రి హెచ్చరిస్తుంది. వస్తే రానివ్వండని నాకు ఏంటి సంబంధం అని యువరాజు అంటాడు. కంపెనీ ఏమైపోతే నాకేంటని ఎవరు ఇబ్బందుల్లోపడితే నాకేంటని అంటాడు. ఆ మాటలు విన్న జగధాత్రి, కేదార్ బయటకు వెళ్లిపోతారు. వీళ్లు డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోయేలా ఉన్నారని ధాత్రి అంటుంది.ఆ షేర్లు ఎవరూ కొనకుండా చూసే బాధ్యత మనదని అంటుంది.
                              జేడీ  తనను చూసిన తర్వాత కూడా తనకోసం పోలీసులు ఎందుకు వెతకడం లేదో అర్థంగాక....మీనన్ పిచ్చెక్కిపోతుంటాడు. తాను చనిపోయానని అందరూ రిలాక్స్‌గా ఉన్నారని ఇలా దొంగచాటుగా బతకడం కష్టంగా ఉందని అంటాడు. మళ్లీ దందా మొదలుపెట్టాలని తన అనుచరులతో చెబుతుండగా....హోంమినిష్టర్ తమ్ముడు అక్కడికి వచ్చి టీవీలో నీ గురించి చూపిస్తున్నారని చెప్పడంత టీవీ ఆన్‌చేస్తాడు. అక్కడ వచ్చే న్యూస్ చూసి మీనన్ షాక్‌ తింటాడు. ఇన్నాళ్లు అజ్ఞాతంలో బతికిన మీనన్ భార్య తొలిసారి మీడియా ముందుకు వస్తుందని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు. అసలు తనకు పెళ్లి కాలేదని...మరి ఈ భార్య ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటాడు. ఇంతలో జేడీ,కేడీ  జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన డ్రాగన్....మీనన్ సమాధి వద్దకు వచ్చి ఏడుస్తుంది. మీడియా మొత్తం నువ్వు మీనన్ భార్యవని నమ్మకం ఏంటని అనగా...తనకు, మీనన్‌కు పుట్టిన కుమారుడు ఇదిగో అంటూ కొడుకును పరిచయం చేస్తుంది.అది చూసిన మీనన్‌కు ఇంకా అయోమయానికి గురవుతాడు. అభి మాత్రం ఆమె నీ భార్యేనంటూ మీనన్‌కు చిరాకు తెప్పిస్తాడు. ఇంకా రుజువులు కావాలంటే చూపుతానంటూ డ్రాగన్‌ మీడియా వాళ్లందరినీ తీసుకుని మీనన్‌ ఇంటికి వెళ్తుంది.

 

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
Brahmamudi Serial Today August 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
Podarillu Serial Today August 22th: శైలును కలిసి నిజం తెలుసుుకున్న కేశవ్‌...తాను అసలు గర్భవతినే కాదని చెప్పేసిన శైలు
పొదరిల్లు: శైలును కలిసి నిజం తెలుసుుకున్న కేశవ్‌...తాను అసలు గర్భవతినే కాదని చెప్పేసిన శైలు
Gundeninda Gudigantalu August 22th:మనోజ్‌ను మరోసారి దారుణంగా మోసం చేసిన రోహిణి....పార్లరమ్మ గుట్టు బయటపెట్టిన బాలు
గుండెనిండా గుడిగంటలు:మనోజ్‌ను మరోసారి దారుణంగా మోసం చేసిన రోహిణి....పార్లరమ్మ గుట్టు బయటపెట్టిన బాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget