Illu Illalu Pillalu Serial Today December 30th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అమూల్య పెళ్లిపై ధీరజ్, ప్రేమ మధ్య పెద్ద యుద్ధం! విశ్వ ఏం చేయనున్నాడు?
Illu Illalu Pillalu Serial Today Episode December 30th అమూల్యకి పెళ్లి చేయాలని రామరాజు అనుకోవడం, రామరాజు నిర్ణయం తప్పు అని ప్రేమ అనడంతో ధీరజ్ ప్రేమతో గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode అమూల్యకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు రామరాజు ఇంట్లో అందరికీ చెప్తాడు. చెల్లి చదువుకుంటుంది కదా నాన్న అని చందు అంటే చెల్లిని పట్టించుకోని మీకు తన భవిష్యత్ గురించి అవసరం లేదు.. ఇంత వరకు వచ్చిన తర్వాత రేపు ఏదైనా జరగరానిది జరిగితే తల్లిదండ్రులుగా మేం చావాలి అందుకే వెంటనే పెళ్లి చేసేస్తా అని అంటాడు.
అమూల్యతో నేను చూసిన వాడిని నువ్వు తలవంచుకొని తాళి కట్టించుకోవాలి కానీ ఎదురు చెప్పడానికి వీల్లేదు అని అంటాడు. ధీరజ్ బయటకు వెళ్లి జరిగిన విషయం ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటాడు. ధీరజ్ దగ్గరకు ప్రేమ వచ్చి మీ నాన్న నిర్ణయం నాకు నచ్చలేదురా.. చదుకునే అమ్మాయికి ఇలా పెళ్లి చేయడం కరెక్ట్ కాదు కదరా.. మీరు మీ నాన్నతో మాట్లాడండిరా.. గట్టిగా చెప్పండిరా అని అంటుంది.
ధీరజ్ ప్రేమతో నోర్ముయ్.. నోర్ముయ్.. ఏంటి మా నాన్న నిర్ణయం నచ్చదా.. అవును నీకు నచ్చదు.. నీకు నేను నచ్చను.. మా ఇళ్లు నచ్చదు.. ఎందుకంటే నీ ఉద్దేశం వేరు కదా.. నువ్వు మా చెల్లికి ఇప్పుడు పెళ్లి వద్దు అనడం వెనక నీ అసలు ఉద్దేశం నాకు తెలీదు అనుకుంటున్నావా.. మీ అన్నగాడితో అమూల్య పెళ్లి చేయాలి అన్నదే కదా నీ అసలు ఉద్దేశం.. అదే నీ ప్లాన్ అందుకే కదా అందరి ముందు మీ అన్నకి సపోర్ట్ చేసి మా చెల్లి మీద నిందలు వేశావ్.. అందుకే కదా మా కుటుంబానిదే తప్పు అని మాట్లాడావ్ అని అంటాడు. దానికి ప్రేమ నేను వాళ్లకి పెళ్లి చేయాలి అనుకోవడం లేదు.. అమూల్యనే ముందు మా అన్నయ్యని లవ్ చేసింది.. తనదే తప్పు ఉందని చెప్పాను అంటుంది. దానికి ధీరజ్ కోపంతో ఏయ్ ఇంకోసారి మా చెల్లిది తప్పు అన్నావంటే బాగోదు చెప్తున్నా అని ప్రేమ మీద చేయి ఎత్తుతాడు.
మా నాన్న తీసుకున్నది కరెక్ట్ నిర్ణయం.. దానికి నేను కట్టుబడి ఉంటాను.. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకున్నా మాట్లాడినా బాగోదు.. ఇంకో ముఖ్యమైన విషయం ఈ క్షణం నుంచి నువ్వు నాతో మాట్లాడొద్దు.. నువ్వు మాట్లాడుతుంటే కంపరంగా ఉంది.. నువ్వు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇస్తాడు. ప్రేమ ఏడుస్తుంది.
భాగ్యం, ఇడ్లీబాబాయ్ దగ్గరకు శ్రీవల్లి పరుగున వస్తుంది. అమూల్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్తుంది. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ షాక్ అయిపోతారు. ఇక విశ్వ కూడా అక్కడికి వస్తాడు. విశ్వతో అమూల్య పెళ్లి చేస్తామని వాళ్ల దగ్గర పది లక్షలు తీసుకున్నాం కదా.. మరి ఇప్పుడు వేరే పెళ్లి జరిగితే ఊరుకోడని అంటుంది. వల్లీ, భాగ్యం ఇద్దరూ విశ్వ మీద నింద వేసి మేం బాగా ప్రయత్నించాం కానీ నువ్వే ఓవర్ చేశావ్ అని రివర్స్ అయిపోదాం అని అనుకుంటారు. కానీ విశ్వ మొత్తం వినేసి సరే సరే అంటూ ఎంట్రీ ఇస్తాడు. తల్లీకూతుళ్లు బిత్తరపోతారు.
విశ్వ వాళ్లతో అమూల్యకి వచ్చిన సంబంధం మీరే చెడగొట్టాలి అని అంటాడు. మేం చేయమని వాళ్ల అంటే సరే అయితే నేను ఏం చేస్తానో విను.. అమూల్య, నేను ప్రేమించుకోవడానికి నువ్వే కారణం అని.. నువ్వే సూత్రధారివి అని మీ మామయ్యకి చెప్తా అని అంటాడు. దాంతో వల్లీ ఏడుపు మొదలెడుతుంది.
వేదవతి కిచెన్లో వంట చేస్తూ ఉంటే ప్రేమ అక్కడికి వెళ్తుంది. అత్త అమూల్య చదువుకుంటుంది కదా పెళ్లి ఇప్పుడే ఎందుకు అంటుంది. దానికి వేదవతి ఏయ్ నువ్వు ఎవరు మాకు ఏది తప్పో ఏదో ఒప్పో తెలీదా.. నువ్వు చెప్తే వినేపరిస్థితిలో ఉన్నామా.. అయినా నీకు మాట్లాడొద్దు అని చెప్పాను కదా.. నువ్వు నాతో మాట్లాడకు.. ఇంకోసారి ఇలా వచ్చి అత్త అత్త అన్నావు అంటే అస్సలు బాగోదు చెప్తున్నా.. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు నా కంటికి కనిపించకుండా వెళ్లు అని పంపేస్తుంది.
ప్రేమ ఏడుస్తూ బయటకు వెళ్తుంది. నర్మద వచ్చి ఎందుకు అత్తయ్య తన మీద అంత కోప్పడుతున్నావు అని అంటుంది. మేనకోడలు అని నెత్తిన పెట్టుకున్నా కదా తప్పు అంతా నాదే.. అయినా తప్పు అంతా నా కూతురిదే అని నడివీధిలో అందరి ముందు చెప్పింది.. అంత చూసి తెలిసి నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది. ప్రేమ మాట్లాడింది తప్పే అత్తయ్యా కానీ మీరు కూడా ప్రేమ లేచిపోయింది అన్నారు కదా.. ఏదో ఒకరోజు ప్రేమ తన తప్పు తెలుసుకుంటుంది. తనకి టైం ఇవ్వాలి కదా అత్తయ్య అని నర్మద అంటుంది. ప్రేమ నర్మదని పట్టుకొని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















