Lakshimi Raave Maa Intiki Serial Today December 29th:శ్రీలక్ష్మీ పెళ్లిచూపులు ఏమయ్యాయి..? సూర్యనారాయణకు శ్రీలక్ష్మీ గురించి గోపి ఏం చెప్పాడు..?
Lakshimi Raave Maa Intiki Serial December 29th: తొలిచూపులోనే మ్యాడీ, లక్ష్మీ గొడవపడతారు. ఆ తర్వాత అతను పెద్దయ్య మనవడని తెలిసి లక్ష్మీ సారీ చెబుతుంది. మరోవైపు శ్రీలక్ష్మీ పెళ్లిచూపులు జరుగుతాయి.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: తన మీద పడిన మ్యాడీని పక్కకు తోసేసి...కళ్లు కనిపించడం లేదా అని తిడుతుంది. ఇద్దరూ గొడవపడుతుండగా....లోపల నుంచి వాళ్ల అమ్మ నూకాలు పరుగెత్తుకుంటూ వస్తుంది. మ్యాడీని చూసి అతడే పెళ్లికొడుకు అనుకుంటుంది. ఈ లక్ష్మీ వెళ్లి ఏంటి అతనితో గొడవపడుతుందని కంగారుపడుతుంది. ఇంతలో నూకాలు అక్కడికి వచ్చి అతనే పెళ్లికొడుకు అని అంటుంది. లోపలికి వచ్చి కూర్చోవాలని నూకాలు మర్యాద చేయబోతుండగా...తాను పెళ్లిచూపులకు వచ్చిన పెళ్లికొడుకుని కాదని చెబుతాడు. గోమాత గౌరీకి సారీ చెప్పాలని శ్రీలక్ష్మీ మ్యాడీపై మళ్లీ గొడవపడుతుంది. నేను నీకోసం రాలేదని....కోటేశ్వరరావు కోసం వచ్చానని చెబుతాడు. తాను సూర్యనారాయణ గజపతిగారి మనవడని చెప్పడంతో శ్రీలక్ష్మీ,నూకాలు ఇద్దరూ కంగారుపడతారు. వెంటనే శ్రీలక్ష్మీ అతనికి సారీ చెబుతుంది. కోటేశ్వరరావుకు మా తాతయ్య పిలుస్తున్నాడని చెప్పి మ్యాడీ వెళ్లిపోతాడు. స్నానం చేస్తున్నాడని వాళ్ల తాతయ్యకు చెప్పడంతో....మనం వచ్చామన్న సంగతి తెలిస్తే అతనే వస్తాడులే అని చెప్పి మ్యాడీని తీసుకుని బంగ్లాకు వెళ్లిపోతాడు.
శ్రీలక్ష్మీని చూడటానికి పెళ్లికొడుకు వాళ్ల ఇంటికి వస్తాడు. వాడిని చూసిన కోటేశ్వరావు...పెళ్లికొడుకుకి వయసు పెద్దగాఉందని వెంటనే నచ్చలేదని పంపించేయమని నూకాలుకు చెబుతాడు. కానీ నూకాలు ఆయన మాట వినదు. ఇంతలో సూర్యనారాయణ బంగ్లాలోకి అడుగుపెడతాడు. వారికి గోపి వాళ్ల అమ్మ ఎదురొచ్చి పలకరించగానే....పనిమనిషి అనుకుని బ్యాగ్‌లు లోపల పెట్టాలని అంటారు. దీంతో సూర్యనారాయణ వాళ్లపై కోప్పడి...ఆమె సింధూజకు కాబోయే అత్తగారని చెబుతాడు. దీంతో ఎవరి లగేజీ వాళ్లే తీసుకుని లోపలికి వెళ్తారు. ఇంతలో గోపీపై సింధూజ నోరుపారేసుకుంటుంది. మళ్లీ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసి అతనే నీకు కాబోయే మొగుడని చెబుతాడు. గోపీకి సారీ చెప్పాలని ఆదేశిస్తాడు. గోపీ వాళ్లను సముదాయిస్తాడు.
ఇంటిని చాలా అందంగాముస్తాబు చేశారని సూర్యనారాయణ గోపిని మెచ్చుకోగా....ఇదంతా మా చెల్లెలుచేసిందని చెబుతాడు. దీంతో సూర్యనారాయణ వాళ్లసొంత చెల్లి మంగ చేసిందేమోనని ఆమెను మెచ్చుకుంటాడు. దీంతో గోపి కల్పించుకుని ఇవన్నీ చేసింది మా సొంత చెల్లికాదని... మాబాబాయి కోటేశ్వరరావు కూతురు శ్రీలక్ష్మీ అని చెబుతాడు. మా అమ్మచేసినట్లే చేసిందని సూర్యనారాయణ మెచ్చుకోగా....కూతురు ప్రియంవద ఉడుక్కుంటుంది. పల్లెటూరిలో పుట్టిపెరిగిన ఏ అమ్మాయికైనా ఇవన్నీ చేయడం వచ్చని...దీనికి మీరు అంతలా ఫీల్ అవ్వొద్దని అంటుంది.ఆమె ఏదో గోల్డ్‌మెడల్ సాధించినట్లు పొగుడుతున్నారేంటని అంటుంది. దీనికి గోపి కల్పించుకుని మా చెల్లి నిజంగానే గోల్డ్‌మెడల్ సాధించిందని చెబుతాడు. కాలేజీలో స్టేట్‌ఫస్ట్ వచ్చిందుకు గోల్డ్‌మెడల్ సాధించిందని...ఇప్పడు యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లోనూ ఫస్ట్ వచ్చిందని చెబుతాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ అని అడగ్గా....ఇవాళ శ్రీలక్ష్మీకి పెళ్లిచూపులని గోపీవాళ్ల అమ్మ చెబుతుంది. పై చదువులు చదువుకునే అమ్మాయికి పెళ్లిచూపులు ఏంటని అంటాడు. గొప్ప సంబంధం వచ్చిందని చేస్తున్నారని చెబుతుంది. దీనికి సూర్యనారాయణ కొంచెం ఆలోచనలో పడతాడు.
శ్రీలక్ష్మి ఇంట్లో పెళ్లిచూపుల తంతు జరుగుతుంది. పెళ్లికొడుకుకి శ్రీలక్ష్మీ బాగా నచ్చుతుంది. పెళ్లికుమారుడి ఆస్తులు, వ్యాపారాల గురించి వాళ్ల గొప్పగా చెబుతుంటారు. పెళ్లికొడుకు కూడా కట్నం వద్దని..అమ్మాయి నచ్చితే చాలంటాడు.





















