Illu Illalu Pillalu Serial Today December 19th:ఇల్లు ఇల్లాలు పిల్లలు: అమూల్యని లేపుకెళ్లిపోతానన్న విశ్వ! వల్లీ సాయం చేస్తుందా! ప్రేమని పుట్లింట్లో చూసేసిన ధీరజ్!
Illu Illalu Pillalu Serial Today Episode December 19th చందుకి తమ ప్రేమ విషయం తెలిసిపోయిందని విశ్వ అమూల్యని లేపుకెళ్లిపోవాలని అనుకున్నట్లు వల్లీకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode వల్లీ సాగర్ దగ్గరకు వెళ్లి నువ్వు మిల్లులో పని చేయడం వల్ల నర్మద చాలా బాధ పడుతుందని చెప్తుంది. నా దగ్గర చాలా బాధ పడింది.. నేను చెప్పాను అని తనతో చెప్పకండి మా మధ్య గొడవలు వస్తాయి అని తగిలించేస్తుంది. సాగర్ బాధగా వెళ్లిపోతాడు. మంట అంటుకుంటుంది నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడు నర్మద అని వల్లీ అనుకుంటుంది.
అమూల్య కోసం విశ్వ కాలేజ్ దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. చందు అమూల్యని తీసుకురావడం చూసి చెట్టు వెనకాలే దాక్కుంటాడు. అమూల్య కూడా చాలా కంగారు పడుతుంది. చందు చెల్లిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి నాన్నకి నీ భవిష్యత్‌తో పాటు తన పరువు కూడా ముఖ్యమే తన పరువు పోయేలా నువ్వు ప్రవర్తిస్తే నాన్న బతకలేడు.. గుర్తు పెట్టుకో అని ఇన్‌డైరెక్ట్‌గా విశ్వ గురించి వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావ్ అన్నయ్యా అని అమూల్య కావాలనే అడుగుతుంది. దానికి చందు చదువుకునే వయసులో ఉన్నావ్,, పిచ్చి పిచ్చి అట్రాక్షన్‌లు ఉంటాయి.. నీ మనసులో ఈ ప్రేమ దోమ ఇలాంటివి ఉంటే ఇప్పుడే కట్ చేసేయ్,, అన్నింటికంటే ముఖ్యంగా నీ భవిష్యత్ ప్రమాదంలో పడేసుకోకు.. జాగ్రత్త. తల దించుకొని కాలేజ్‌కి వచ్చామా చదువుకున్నామా.. తలదించుకొని ఇంటికి వచ్చామా అన్నట్లు ఉండు అంతే.. నీ మంచి కోసం చెప్తున్నా అని చెప్పి వెళ్లిపోతాడు.
విశ్వ అంతా చాటుగా వింటాడు. అమూల్య దగ్గరకు వెళ్లి మీ అన్నయ్యా అంత సీరియస్‌గా మాట్లాడుతున్నాడు,, ఏమైంది అని అడుగుతాడు. ప్రేమ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చాడు.. చూస్తుంటే మన ప్రేమ గురించి తెలిసిపోయినట్లు ఉందని అమూల్య కంగారు పడుతుంది. నేను చూసుకుంటా నువ్వు కాలేజ్‌కి వెళ్లు అని విశ్వ అమూల్యని పంపేస్తాడు. వెంటనే విశ్వ వల్లీకి కాల్ చేస్తాడు. మీ ఆయనకు డౌట్ వచ్చిందా అని అడుగుతాడు. డౌట్ ఏంటి మా ఆయనకు మీ విషయం తెలిసిపోయింది.. పార్క్‌లో చూసేశాడు అని చెప్తుంది. దానికి విశ్వ అమూల్యని లేపుకెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అని అంటాడు. వల్లీ షాక్ అయిపోతుంది. ఏమన్నావ్‌రా అని అడుగుతుంది. మీ ఆయన ఏ క్షణానైనా మీ ఆయన ఇంట్లో చెప్తే గొడవ అవుతుంది అందుకే అమూల్యని లేపుకెళ్లిపోదాం అనుకుంటున్నా అందుకు నువ్వే సాయం చేయాలి అంటాడు. నేను సాయం చేయడం ఏంట్రా అని బండబూతులు తిడుతుంది. నా జీవితం నన్ను బతకనివ్వురా మీకు సాయం చేస్తే నా కాపురం నిలబడదు. నేను సాయం చేయను అని ఫోన్ పెట్టేస్తుంది.
విశ్వ తనలో తాను సాయం చేయవా ఎలా చేయవో నేను చూస్తా అని అనుకుంటాడు. వల్లీ తనకు పాడె కట్టేస్తారు అని తెగ కంగారు పడుతుంది. రాత్రి అయినా సేనాపతి ఇంకా ఇంటికి రాకపోవడంతో ప్రేమ తల్లి చాలా కంగారు పడుతూ బయట తిరుగుతుంది. ప్రేమ అది చూసి ఏమైందని అడిగితే మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు.. రోజూ రాత్రి తాగి వస్తున్నారే అని కంగారు పడుతుంది. విశ్వకి చెప్దాం అంటే విశ్వ లేడు అని అంటుంది. నేను వెళ్లి చూసి వస్తా అని రాత్రి పూట ప్రేమ స్కూటీ తీసుకొని వెళ్తుంది.
సేనాపతి ఓ చోట మందు ఫుల్లుగా తాగేసి కారు ఓ పోల్‌కి డీ కొట్టి ఉంటాడు. తెలిసిన ఒకాయన ఎంత పిలిచినా సేనాపతి రాడు. ఇంతలో ప్రేమ అక్కడికి వస్తుంది. నాన్న అని ప్రేమ పిలిస్తే అలా పిలవకు నువ్వే దీనంతటికి కారణం అని అంటాడు. ప్రేమ ఏడుస్తూ అక్కడున్న వ్యక్తి సాయంతో తండ్రిని ఆటో ఎక్కించి ఇంటికి తీసుకెళ్తుంది. ఎందుకే నా కోసం వచ్చావ్.. నేను చచ్చానో లేదో చూడటానికి వచ్చావా.. లేదంటే బతికుంటే చంపేయాలని చూస్తున్నావా.. నీ కారణంగా నేను కోర్టు మెట్లు ఎక్కానే ఒక రోజు అంతా జైలులో ఉన్నానే.. కన్నతండ్రిని జైలుకి ఎలా పంపావే.. అంత దుర్మార్గంగా ఎలాఆలోచించావమ్మా అని ఏడుస్తాడు. ప్రేమ కూడా ఏడుస్తుంది. మీ నాన్న చచ్చిపోయాడే.. మీ నాన్నని నువ్వే చంపేశావే అని ఏడుస్తాడు.
ప్రేమ తన తండ్రిని ఇంటికి తీసుకురావడం వల్లీ చూస్తుంది. అక్కడే ఫోన్ మాట్లాడుతున్న ధీరజ్‌ని పిలిచి చూపిస్తుంది. పాపం నిజానికి ప్రేమ పుట్టింటి గుమ్మం కూడా తొక్కదు. తండ్రిని గేటు వరకే డ్రాప్ చేస్తుంది. ప్రేమ ఆ ఇంటి ముందు ఉండటం ధీరజ్ చూసి షాక్ అయిపోతాడు. ప్రేమ కూడా ధీరజ్ తనని చూసేయడం చూసి కంగారు పడుతుంది. ఇక్కడ కూడా మంట పెట్టేశా అని వల్లీ చాలా సంబరపడిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















