Ammayi garu Serial Today December 18th: అశోక్ ఎక్కడ ఉన్నాడో రాజుకు తెలిసిపోయిందా..? కోర్టులో రుక్మిణి, కోమలి విడాకుల కేసు ఏమైంది..?
Ammayi garu Serial Today Episode December 18th: కోమలి ద్వారానే అశోక్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అతన్ని తీసుకురావడానికి రాజు వెళ్తాడు. మరోవైపు విడాకుల కేసుపై కోర్టులో వాదోపవాదనలు సాగుతాయి

Ammayi garu Serial Today Episode: రుక్మిణిపై మనకు ప్రేమలేనట్లు తనకే ఉన్నట్లు విరూపాక్షి ప్రవర్తించడం నచ్చలేదని సూర్య అంటాడు. రూప మాత్రం తన భర్తకు దూరంగా ఉంటూ ఎంతకాలం బాధపడుతుందని అంటాడు. ఈ మాత్రం అర్థంచేసుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని కోప్పడతాడు. ఇదంతా కావాలనే చేస్తోందని చంద్రతో అంటాడు. రుక్మిణీకి, రాజుకు విడాకులు రాగానే విరూపాక్షి సంగతి తేలుస్తానని అంటుంది. తను ఇంట్లో ఉండటం వల్లే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయని అంటాడు. తను రుక్మిణిని ఒకలా, రూపను మరోలా చూడటం వల్లే ఈ సమస్యలొచ్చాయని అంటాడు.
కోర్టులో లాయర్‌ను కలిసి విరూపాక్షి ఈకేసు ఎలాగైనా గెలవాలని కోరుతుంది. దానికి అతను ట్రై చేస్తానని చెబుతాడు. కానీ మొదటి భార్య ఉండగా రెండో పెళ్లిచేసుకున్నా అది చెల్లుబాటు కాదని చెబుతాడు. ఈసమస్యల నుంచి బయటపడాలి అంటే సూర్యకు నిజం తెలియాలని విరూపాక్షి అంటుంది. నిజం చెప్పినా నాన్న నమ్మే పరిస్థితిలేదని...కోమలినే రూప అని ఆయన గట్టిగా నమ్ముతున్నారని రుక్మిణి అంటుంది. నాన్న నాతో ఒట్టువేయించుకున్నారని నేను ఆయనకు అడ్డు చెప్పలేనని అంటుంది.
అశోక్ ఎలా ఉన్నాడో కనుక్కుందామనుకుని కోమలి వెళ్లి రౌడీలకు ఫోన్ చేస్తుంది. అతను ఎమైనా తిన్నాడా లేదా అని ఎంక్వైరీ చేస్తుంది. ఈ మాటలను రాజు చాటుగా వింటాడు. కోమలి ఫోన్ ట్రేస్ చేస్తే...అశోక్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టవచ్చని అనుకుంటాడు. వెంటనే తన ప్రెండ్‌కు ఫోన్ చేసి లొకేషన్ ట్రేస్ చేసి చెప్పమని చెబుతాడు. దీంతో అశోక్ ఎక్కడ ఉన్నాడో రాజుకు తెలిసిపోతుంది. నేను వెళ్లి అశోక్‌ను తీసుకొస్తానని అప్పటి వరకు మీరు కోర్టులో మ్యానేజ్ చేయమని చెప్పి వెళ్లిపోతాడు.
కోర్టులో విడాకులకు సంబంధించిన వాదోపవాదనలు జరుగుతుంటాయి. రూప చనిపోయిందనుకుని ఆమె భర్తకు మరో పెళ్లి చేశారని..ఇది చట్టవిరుద్ధమని లాయర్ వాదిస్తాడు. ఇప్పుడు ఆమె తిరిగి వచ్చింది కాబట్టి తన భర్తను తన వద్దకు వచ్చేలా రుక్మిణీ,రాజుకు విడాకులు ఇప్పించాలని కోరతాడు. రుక్మిణి,రూగా ఎలా మారిందో...రూప ప్రమాదం నుంచి బయటపడి ఎలా మళ్లీ సూర్య ప్రతాప్ ఇంటికి చేరిందో మొత్తం వివరించి చెబుతాడు.
రుక్మిణి తరపు న్యాయవాది లేచి అసలు ఈమె రూపనే కాదని....ఆమె పేరు కోమలి అని చెబుతాడు. దీంతో కోమలితోపాటు విజయాంబిక, దీపక్ కూడా షాక్ తింటారు. ఈమె అనాథని పేరు కోమలని న్యాయమూర్తికి చెబుతాడు. విరూపాక్షి ఆశ్రమంలోనే ఈ కోమలి పెరిగిందని చెబుతాడు. ఈ కుటుంబం గురించి అన్ని విషయాలు తెలుసుకుని ఆ ఇంట్లోరూప పేరిటి అడుగుపెట్టిందని చెబుతాడు. దీనికి కోమలి తరఫు న్యాయవాది లేచి డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్ట్‌లు చూపుతాడు. అయితే ఆమె కోమలి అని నిరూపించే ఆధారాలు ఉంటే చూపించాలని న్యాయమూర్తి కోరతాడు. ఇరువైపుల న్యాయవాదులు వాదించుకుంటుండగా... వీళ్లిద్దరిని పెళ్లిచేసుకున్న రాజు ఎక్కడా అని న్యాయమూర్తి అడగడంతో అందరూ రాజు కోసం వెతుకుతుంటారు. కానీ అతను అశోక్‌ను తీసుకురావడానికి వెళ్తుండటంతో ఈ రోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.





















