Hyper Aadi Jabardasth : 'హైపర్' ఆది ఈజ్ బ్యాక్ - 'జబర్దస్త్' రీ ఎంట్రీలో సుడిగాలి సుధీర్, రష్మీపై సెటైర్
'జబర్దస్త్' కార్యక్రమానికి కొన్ని వారాల నుంచి దూరంగా ఉంటున్న 'హైపర్' ఆది మళ్ళీ షోలోకి వచ్చారు. రీ ఎంట్రీలో పంచ్ డైలాగులతో తన మార్క్ మళ్ళీ చూపించారు.
'హైపర్' ఆది (Hyper Aadi) కి బుల్లితెరలో స్టార్ ఇమేజ్ రావడానికి, వెండి తెరపై నటుడిగా అవకాశాలు అందుకోవడానికి, కొన్ని సినిమాలకు రచనా సహకారం చేయడానికి కారణం కామెడీ రియాలిటీ షో 'జబర్దస్త్' (Jabardasth). 'అదిరే' అభి టీమ్‌లో మెంబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత టీమ్ లీడర్లలో ఒకరు అయ్యారు. అటువంటి 'జబర్దస్త్'కు కొన్ని వారాలుగా 'హైపర్' ఆది దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అయ్యారు.
Hyper Aadi Is Back To Jabardasth : అవును... 'హైపర్' ఆది మళ్ళీ 'జబర్దస్త్'లో ఎంట్రీ ఇచ్చారు. లేటెస్టుగా విడుదలైన ప్రోమోలో ఆయన కనిపించారు. ఒక్క కనిపించడం ఏమిటి? రీ ఎంట్రీలో 'జబర్దస్త్' మాజీ జడ్జ్ రోజా, తాజా జడ్జ్ ఇంద్రజపై పంచ్ డైలాగ్స్ వేశారు.
'పైరు కోయిల కూసింది... పల్లె దరువులు వేసింది... రావయ్యా రావయ్యా... రామ సక్కని సీతయ్య' పాటకు రాము అండ్ గ్యాంగ్ డ్యాన్స్ చేస్తే, సూటు బూటు వేసుకున్న రాజకీయ నాయకుడి తరహాలో 'హైపర్' ఆది ఎంట్రీ ఇచ్చారు. 'కాసేపు జబర్దస్త్ లోకి వచ్చానా? రాజకీయాల్లోకి వచ్చానా? అర్థం కాలేదు రా' అంటూ సెల్ఫ్ సెటైర్ వేసుకున్నారు.
Hyper Aadi Punch Dialogues : 'మొన్న మా ఫ్రెండ్ తో కలిసి ఎగ్జామ్ రాశాను. కానీ, సీటు ఆడికి వచ్చింది. నాకు రాలేదు' అని రాము అంటే... 'నీకు కూడా వస్తుంది లే' అని ఆది రిప్లై ఇచ్చారు. 'వాడికి సీట్ వస్తే నాకు ఎలా వస్తుంది?' అని రాము ప్రశ్నిస్తే... 'రోజా గారికి మంత్రి సీటు వస్తే ఇంద్రజ గారికి జబర్దస్త్ సీటు రాలేదా?' అని ఆది పంచ్ వేశారు. అక్కడితో వదల్లేదు. 'సుడిగాలి' సుధీర్, రష్మీ మీద కూడా పంకజ్ వేశారు.
Also Read : సప్తగిరి కాళ్ళుకు దణ్ణం పెడతానన్న బాలకృష్ణ
'నీలాంటి అమ్మాయి దక్కాలంటే ఏం చేయాలి?' అని రష్మీ గౌతమ్‌ను ఆది అడుగుతారు. అప్పుడు ఆమె 'నా వెనకాల చాన్నాళ్లు తిరగాలి' అని సమాధానం ఇచ్చారు. 'చానళ్లు తిరిగాలా? ఇది తెలియక మన గాలోడు (Sudigali Sudheer) ఛానళ్లు అన్నీ తిరిగేస్తున్నారు' అని ఆది పంచ్ వేయడంతో అందరూ ఒక్కసారి నవ్వేశారు. 'బాహుబలి', 'కెజియఫ్', 'ఆర్ఆర్ఆర్' 'పుష్ప'... ఇలా ఐదు ద్వారాలు దాటిన తర్వాత నిధి అందుకోవడం కాన్సెప్ట్ మీద ఆది స్కిట్ చేశారు. అందులో 'బాహుబలి' గెటప్ వేసిన నాటీ నరేష్ మీద కామెడీ పంచ్ డైలాగులతో నవ్వించారు.
'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమోలో ఇంద్రజతో పాటు మరోసారి జడ్జ్ సీటులో కృష్ణ భగవాన్ కనిపించారు. జడ్జిమెంట్ చెప్పే సమయంలో 'మీరు ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు చూశారు?' అని ఇంద్రజను ప్రశ్నించడంతో స్టేజి మీద ఉన్న ఆరిస్టులు కూడా నవ్వకుండా ఉండలేకపోయారు. తన మార్క్ పంచ్ డైలాగ్స్, సెటైర్స్‌తో ఆయన నవ్వించారు. 'రాకెట్' రాఘవ, ఆయన కుమారుడు మురారి చేసిన స్కిట్ కూడా నవ్వించేలా ఉంది.
Also Read : హాస్పిటల్‌లో ప్రభాస్ - అసలు ఏమైంది?