అన్వేషించండి

Balakrishna - Sapthagiri : సప్తగిరి కాళ్ళుకు దణ్ణం పెడతానన్న బాలకృష్ణ

నటుడు సప్తగిరి కాళ్ళకు నట సింహం నందమూరి బాలకృష్ణ మొక్కబోయారు. స్టార్ హీరో ఆ విధంగా చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) డైలాగులు చెబితే థియేటర్లు దద్దరిల్లుతాయి. ఆయన నటనతో పాటు డైలాగ్ డెలివరీకి అభిమానులు ఉన్నారు. పంచ్ డైలాగ్స్ చెప్పడంలో ఆయనది సపరేట్ స్టైల్. కేవలం కమర్షియల్ సినిమా డైలాగులు మాత్రమే కాదు... విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) నటించిన పౌరాణిక సినిమాల్లో డైలాగులను అలవోకగా చెప్పేస్తారు.

టర్కీలోని ఇస్తాంబుల్‌లో ప్రస్తుతం NBK107 సినిమా షూటింగ్ చేస్తున్నారు నట సింహం బాలకృష్ణ. ఆ సినిమాలో హాస్యనటుడు సప్తగిరి (Sapthagiri) కూడా యాక్ట్ చేస్తున్నారు. షూటింగ్ మధ్య విరామ సమయంలో బాలకృష్ణ, సప్తగిరి మధ్య ఓల్డ్ మూవీ డైలాగ్స్ వచ్చాయి.
సప్తగిరి డైలాగులు చెప్పిన తీరుకు బాలకృష్ణ ఫిదా అయ్యారు. ''ఒకసారి నీ కాళ్ళు పైకి ఎత్తు. దణ్ణం పెడతా'' అని ఆయన అన్నారు. దాంతో ఒక్కసారిగా సప్తగిరి షాక్ అయ్యారు. బాలకృష్ణ కాళ్ళకు నమస్కరించారు. 

షూటింగ్ లొకేషన్స్, బయట బాలకృష్ణ సరదాగా ఉంటారని NBK107 మూవీ ఆన్ లొకేషన్ వీడియో బయటకు రావడంతో మరోసారి ప్రేక్షకులకు తెలిసింది. ఆల్రెడీ  'అన్ స్టాపబుల్' కార్యక్రమంలో చిలిపి, సరదా బాలకృష్ణుడిని ప్రేక్షకులు చూశారు.

టర్కీలో బాలకృష్ణ, శ్రుతీ హాసన్ అండ్ టీమ్ షూటింగ్
టర్కీలో హీరో హీరోయిన్ల మీద శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక పాటను తెరకెక్కించారు. కొన్ని సన్నివేశాలు తీశారు. అక్కడే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు కూడా జరిగాయి. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతీ హాసన్ కథానాయికగా నటిస్తున్నారు.

Also Read : 'ఎఫ్ 2'లో వెంకీమామ చెప్పింది కరెక్ట్ - 'కృష్ణ వ్రింద విహారి'లో వాడు లేచి పోయిండు

శ్రుతీ హాసన్ కాకుండా సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో మలయాళ భామ హానీ రోజ్ ఒకరు. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తమిళ అమ్మాయి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు.

మూడు టైటిల్స్‌లో బాలకృష్ణ ఓటు దేనికి?
NBK107 చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 'జై బాలయ్య', 'అన్న గారు' (Balakrishna Annagaru Movie), 'రెడ్డి గారు' టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఈ మూడింటిలో బాలకృష్ణ దేనికి ఓటు వేస్తే... దాన్ని అధికారికంగా వెల్లడించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని టాక్. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై NBK 107 తెరకెక్కుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

Also Read : 'బ్రహ్మాస్త్ర' ఫ్లాప్‌ - ఐనాక్స్, పీవీఆర్‌కు 800 కోట్లు లాస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget