అన్వేషించండి

Hanuman in Nindu Noorella Saavasam: ‘నిండు నూరేళ్లు సావాసం’ సీరియల్‌లో ‘హనుమాన్’ - తేజ సజ్జ ఎంట్రీ అదుర్స్!

Nindu Noorella Saavasam: జీ తెలుగులో ప్రసారమవుతున్న నిండు నూరేళ్ళ సావాసం సరియల్ లో హనుమాన్ సినిమా హీరో తేజా సజ్జా ఎంట్రీ ఇచ్చాడు.. మ్యాటర్ ఏంటంటే..

Nindu Noorella Saavasam: జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. అర్ధాంతరంగా చనిపోయిన ఒక తల్లి ఆత్మ రూపంలో పిల్లల బాగోగులు చూసుకోవడానికి తపన పడటం కథాంశంగా వస్తున్న ఈ సీరియల్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. పిల్లల కోసం తల్లి పడే తపన ప్రేక్షకుల హృదయాలని కట్టిపడేస్తోంది.

ఇక కథ విషయానికి వస్తే తన ఇంటిలోకి ప్రవేశించిన వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా ఉంది అని ఆలోచనలో పడుతుంది అరుంధతి. తర్వాత అతనే తనను చంపిన వ్యక్తి అని గుర్తు పెట్టి భయంతో వణికి పోతుంది. అతను ఇంట్లోకి వెళ్తుంటే అడ్డుకోవాలి అనుకుంటుంది కానీ అడ్డుకోలేక చిత్రగుప్తుడికి చెప్పాలనుకుంటుంది అయితే అతను అందుబాటులో ఉండడు. ఇంతలో దొంగ ఇంట్లోకి దూరి అన్ని గదులు వెతుకుతుంటాడు.

అది చూసిన అరుంధతి మరింత భయపడిపోతూ భర్తని నిద్ర లేపుతుంది. భార్య పిలుస్తున్న వైబ్రేషన్ అమర్ కి తెలుస్తుంది. అరుంధతి పిలిచినట్లు అనిపించిందేమిటి అనుకుంటూ కిందికి వచ్చి మంచినీళ్లు తాగి మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు. అయితే అతని వెంటే దొంగ కింద ఉన్నాడు చూడండి అంటూ భర్త వెనకే వెళుతుంది అరుంధతి. ఆ సమయంలో కింద హంతకుడు మనోహరిని భయపెట్టి తిరిగి వెనక్కి వచ్చేస్తాడు.

భయంతో వణికిపోయిన మనోహరి హంతకుడికి ఫోన్ చేసి రెండు రోజుల్లో డబ్బు ఇస్తాను అని చెప్తుంది కానీ ఇతనిని శాశ్వతంగా వదిలించుకోకపోతే నాకు ప్రమాదం అనుకుంటుంది. అదే సమయంలో ఘోర ఆత్మను బంధించలేక కోపంతో రగిలిపోతూ ఉంటాడు లోపం ఎక్కడ ఉందో చెప్పమంటూ దేవాని అడుగుతాడు సాయం చేయమని ప్రార్థిస్తాడు. అప్పుడు దేవా ఒక శ్వేతనాగుని పంపించి ఇది నీకు అన్ని విధాల సాయపడుతుంది అని చెప్తాడు.

ఆ పామును చూసిన ఘోర ఆనందంగా నవ్వుతాడు. తర్వాత అమ్ము వాళ్లతో ఆడుకుంటున్న అంజు పడిపోయి కాలికి దెబ్బ తగిలించుకుంటుంది. నొప్పితో విలవిలలాడుతూ ఉంటుంది. ఆ బాధను చూసి భరించలేక పోతుంది అరుంధతి. పక్కనే ఉన్నా కూతురి బాధ తీర్చలేక పోతున్నందుకు భగవంతుడిని తిట్టుకుంటుంది.

‘హనుమాన్’ ఎంట్రీ..

నొప్పితో విలవిలలాడుతున్న కూతుర్ని చూసి ఎంతో బాధపడుతుంది అరుంధతి. నా కూతురు బాధని తగ్గించే శక్తిని ప్రసాదించు అని హనుమంతుడిని వేడుకుంటుంది. ఆమె ప్రార్థన విన్న హనుమంతుడు మానవ రూపంలో ఆమె దగ్గరికి వస్తాడు. అతడిని చూసి ఆనందపడుతుంది అరుంధతి. అయితే హనుమంతునిగా తేజ సజ్జా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే ఎపిసోడ్ పై అంచనాలను పెంచే విధంగా ఉంటుంది.

‘హనుమాన్’ సినిమా జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కోసం తేజ సజ్జని ‘హనుమాన్’ రూపంలో ఈ సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హనుమాన్ రూపంలో ఎంట్రీ ఇచ్చిన తేజ అరుంధతికి ఎలాంటి శక్తిని ఇస్తాడు అంజూని ఏ విధంగా కాపాడుతాడు అరుంధతిని బంధించాలని చూస్తున్న ఘోరని శిక్షిస్తాడా లేదంటే ఆ శక్తి అరుంధతికి ఇస్తాడా అనే విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. వీటన్నిటికీ సమాధానాలు రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Also Read: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఓవర్సీస్ రిపోర్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget