Guppedantha Manasu october 20th : ప్రేమ జ్ఞాపకాల్లో మహేంద్ర, రిషికి ధైర్యం చెప్పిన వసు - శైలేంద్ర మరో కుట్ర
Guppedantha Manasu Today Episode: కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. జగతి చనిపోయిన తర్వాత మహేంద్రతో కలసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు రిషి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu Today Episode : జగతి జ్ఞాపకాల నుంచి తండ్రి బయటపడాలంటే ప్లేస్ మారడం మంచిదని రిషి అనుకుంటాడు. తండ్రిని తీసుకుని వసుధారతో కలసి ట్రిప్ ప్లాన్ చేసుకుంటాడు. వాళ్లతో తాము కూడా వెళతామని దేవయాని, శైలేంద్ర అనడంతో క్లాస్ వేస్తాడు ఫణీంద్ర.ఈ ట్రిప్ నుంచి ముగ్గురు మళ్లీ తిరిగిరాకుండా అటు నుంచి అటే పై లోకాలకు పంపిస్తానని శైలేంద్ర మనసులోనే శపథం చేస్తాడు. రిషి, వసుధారలపై మరో ఎటాక్‌కు ప్లాన్ చేస్తాడు.
మహేంద్రను తీసుకుని హిల్ స్టేషన్‌కు వెళతారు రిషి, వసుధార. అప్పటివరకు మత్తులో ఉన్న మహేంద్ర కారు నుంచి దిగి ఆ ప్లేస్ చూడగానే షాక్ అవుతాడు. జగతి అంటూ గట్టిగా పిలుస్తాడు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని రిషిని నిలదీస్తాడు. మనం వేరే చోటుకి వెళదామని అంటాడు. ఈ ప్లేస్ మీకు ఇంతకుముందే తెలుసా...ఇక్కడికి వచ్చారా అని మహేంద్రను అడుగుతుంది వసుధార. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటారని తీసుకొచ్చానని తండ్రితో అంటాడు రిషి. ప్రపంచంలో ప్రశాంతమైన ప్రదేశం ఇదొక్కటే కనిపించిందా అని మహేంద్ర బాధపడతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా బాధ ఇంకా పెరిగేలా ఉందని మనసులోనే ఆవేదనకు లోనవుతాడు. ఈ ప్లేస్ బాగుందని మహేంద్ర మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు రిషి. జీవితమే శూన్యం అయిపోయిందని, అంతా చీకటిగానే కనిపిస్తోందని నిరాశగా రిషికి సమాధానం చెబుతాడు మహేంద్ర. అమ్మను మరచిపోవడం, ఆ బాధ నుంచి బయటపడటం కష్టమే. మనిషి జీవితం దుఃఖం దగ్గరే ఆగిపోకూడదని తండ్రిని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు రిషి.
రిషి-వసుధార
రూమ్ నుంచి బయటకు వచ్చిన రిషి తల్లి ఆలోచనలలో మునిగిపోతాడు.రిషి దగ్గరకు వచ్చిన వసుధార ఈ ప్లేస్ చాలా బావుందని అంటుంది. కానీ ఇక్కడి ప్రకృతిని చూస్తుంటే అమ్మ గుర్తొస్తుందని బాధగా అంటాడు. అమ్మ నా నుంచి ప్రేమను ఒక్కటే కోరుకుంది. ఆ ప్రేమను ఆమెకు అందివ్వలేకపోయానని రిషి ఎమోషనల్ అవుతాడు. జగతి మేడమ్‌కు ప్రేమను పంచలేకపోయానని బాధపడొద్దని రిషిని ఓదార్చుతుంది వసుధార. మీరు చేసే మంచి, సాధించిన విజయాలు జగతికి ఎన్నో మధురానుభూతులుగా మిగిలిపోయానని చెబుతుంది. గత జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి మహేంద్రలో మార్పు తీసుకురావడమే మన ముందు ఉన్న బాధ్యత అని రిషితో అంటుంది .మునుపటిలా మహేంద్ర మారుతాడా? లేదా? అనుమానం వ్యక్తం చేస్తాడు. ఖచ్చితంగా మహేంద్ర మారుతాడని, అది మీ వల్లే సాధ్యమవుతుందని రిషికి చెబుతుంది వసుధార. మీరు గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటే మహేంద్ర కూడా మిమ్మల్ని చూసి మారే అవకాశం ఉంటుందని అంటుంది. మహేంద్రలో మార్పు తీసుకురావడానికి ఇద్దరు కలిసి ప్రయత్నించాలని ఫిక్స్ అవుతారు.
దేవయాని -శైలేంద్ర
జగతి చనిపోయి కూడా తన పంతాన్ని నెగ్గించుకుందని దేవయాని విలవిలలాడిపోతుంది. జగతి దూరమైన తన కొడుకు శైలేంద్రకు ఎండ్ సీట్ దక్కకపోవడంతో బాధపడుతుంది. మూడేళ్లు రిషిని దూరం చేసినా కాలేజీని కాపాడావని, నువ్వు మామూలుదానికి కాదని జగతి ఫోటోను చూస్తూ మనసులోనే అనుకుంటుంది.అందుకే నిన్ను పైకి పంపించామని చెబుతుంది. అప్పుడే జగతి ఫొటోకు ఉన్న దండ ఊడిపోయి కిందపడుతుంది. అది చూసి దేవయాని భయపడుతుంది. జగతి ఆత్మగా మారి ఈ ఇంట్లోనే తిరుగుతుందేమోనని కంగారు పడుతుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి కాలేజీకి వెళుతున్నానని తల్లికి చెబుతాడు. సిగ్గు లేదా ఆ మాట చెప్పడానికి అంటూ కొడుకును ఎగతాళి చేస్తుంది దేవయాని. నేను ఎండీ సీట్‌లో కూర్చోవాలని నువ్వు ఎంత ఆశపడుతున్నావో నేను అంతే బలంగా కోరుకుంటున్నాను. నువ్వు సంతోషపడే క్షణాలు వస్తాయని తల్లికి చెబుతాడు శైలేంద్ర. అప్పుడే అక్కడికి ఫణీంద్ర ఎంట్రీ ఇస్తాడు. తాను కాలేజీకి వస్తున్నానని, ఇద్దరం కలిసి వెళ్దామని అంటాడు. తండ్రి తనతో పాటు వస్తానని అనడంతో శైలేంద్ర కంగారు పడతాడు. నీ భార్యను సరిగ్గా చూసుకోవడం రాదు...కాలేజీ పనుల్ని ఎలా చక్కబెట్టగలవని కొడుకుపై సెటైర్ వేస్తాడు ఫణీంద్ర.
మహేంద్ర-వసు-రిషి
ఎక్కడైతే మన పరిచయానికి పునాది పడిందో, ఎక్కడైతే మన ప్రేమ ప్రాణం పోసుకుందో అదే ప్రదేశానికి రిషి తనను తీసుకొచ్చాడని జగతి ఫొటో చూస్తూ చెబుతాడు మహేంద్ర. మనం గడిపిన ప్రతిక్షణం కళ్ల ముందు కనిపిస్తుందని, నిన్ను మర్చిపోవడం కలే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నీకు నన్ను వదిలిపెట్టి ఉండటం ఇష్టం లేకే నన్ను ఇక్కడికి రప్పించేలా చేశావా అంటూ ఎమోషనల్ అవుతాడు. అప్పడే అక్కడికి రిషి, వసుధార వస్తారు. అరకు అందాలను చూడటానికి బయటకు వెళ్దామని తండ్రితో అంటాడు రిషి. తాను రానని మహేంద్ర బదులిస్తాడు. ఈ చుట్టుపక్కల మంచి ప్రదేశాలు ఉన్నాయని మీరే వెళ్లి చూడమని రిషి, వసుధారలతో చెబుతాడు. ఈ ప్రదేశం గురించి తెలిసినట్లే మాట్లాడుతున్నారు...ఇంతకుముందు ఇక్కడికి వచ్చారా అంటూ మహేంద్రను అడుగుతుంది వసుధార. ముందు నువ్వు కరెక్ట్‌గా మాట్లాడటం నేర్చుకో అంటూ వసుధారపై మహేంద్ర సీరియస్ అవుతాడు. అతడు ఎందుకు కోపగించుకుంటున్నాడో వసుధారతో పాటు రిషికి అర్థం కాదు. పెళ్లైన తర్వాత కూడా రిషిని సార్ అని పిలవడం తప్పు అని వసుధారకు చెబుతాడు రిషి. ఇప్పుడు రిషి నీ భర్త అని అంటాడు. భర్తను ఏమని పిలవాలో చెప్పు అని వసుధారను అడుగుతాడు మహేంద్ర.
Also Read : డైటింగ్ చేస్తున్నప్పుడు.. ఆ సమస్య వెంటాడుతోందా?