అన్వేషించండి

Guppedantha Manasu March 5th Episode: రిషి రీ-ఎంట్రీకి టైమొచ్చేసింది , కాలేజ్ లో మను-వసు పోస్టర్స్ ,గుప్పెడంతమనసు మార్చి 5 ఎపిసోడ్

Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Guppedantha Manasu March 5thd Episode:  (గుప్పెడంతమనసు  మార్చి 5th ఎపిసోడ్)

వసుధార -మను కలసి వెళ్లడం చూసి రాజీవ్ తట్టుకోలేకపోతాడు. నిన్ను సాధించుకునేందుకు వేసే ప్రతి ప్లాన్ మనుగాడు దెబ్బకొడుతున్నాడు ఎలాగైనా నిన్ను సాధించుకుంటా..రేపటితో నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను అనుకుంటాడు...

మరోవైపు వసుధార..రిషి ఫొటో చూస్తూ మాట్లాడుకుంటుంది..
ఈ రోజు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు పనిపై బస్తీకి వెళ్లాను..అక్కడ మీ జ్ఞాపకాల్లో మునిగితేలాను, మను గారు కూడా నాతోపాటూ వచ్చారు, మన బంధాన్ని బాగా అర్థం చేసుకున్నారు..మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా సర్..మన మధ్య మధురక్షణాలే ఊపిరిపోస్తున్నాయ్..మీకోసం ఎదురుచూస్తున్నాను, అసలు మీరెక్కడున్నారు, ఎక్కడున్నా సరే నేను కచ్చితంగా అందరి ముందుకి తీసుకొస్తాను అందరి నోరూ మూయిస్తాను నేను చేసే ఈ ప్రయత్నం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు అనవసరం...మనం ఒక్కటయ్యే సమయం దగ్గరపడింది సర్ అనుకుంటుంది. మరోవైపు అనుపమ-మనుని చూసినప్పుడల్లా....మిమ్మల్ని, జగతి మేడంని గుర్తుచేసుకుంటాను అనుకుంటుంది వసుధార. మను-అనుపమ మధ్య కూడా ఏదో బంధం ఉంది కానీ నాకు అర్థం కావడం లేదు..జగతి మేడం-మీలానే వాళ్లిద్దరూ కూడా చాలా మంచివారు. మనులో అనుపమ మేడంపై కోపం, ద్వేషం చూడడం లేదు కానీ ఇద్దరి మధ్యా ఉన్న రిలేషన్ ఏంటో తెలియాలి..అనుపమ మేడంని అడిగితే చెప్పడం లేదు మనుని అడిగితే చెబుతారా..ఎలాగైనా తెలుసుకుంటాను సర్...

ALso Read:  'గుప్పెడంతమనసు' రిషి రీ-ఎంట్రీపై వసుధార క్లారిటీ ఇచ్చేసింది!

మనుకి భోజనం వడ్డిస్తుంటుంది పెద్దమ్మ. మను పొలమారడంతో నీళ్లిస్తుంది...గతంలో మహేంద్ర ఇంట్లో భోజనం చేసినప్పుడు తను పొలమారితే అనపమ చేసిన హడావుడి గుర్తుచేసుకుంటాడు మను.
పెద్దమ్మ: మొన్న మహేంద్ర సర్ ఇంట్లో భోజనానికి వెళ్లినప్పుడు నాకెవ్వరూ లేరని చెప్పావ్ అంట కదా.. అయినా ఎన్నాళ్లు ఇలా ఉంటారు ..నువ్వైనా మాట్లాడొచ్చు కదా
మను: నాకు రావాల్సిన సమాధానం ఇంకా రాలేదు..మాట మొదలవ్వాల్సింది తన దగ్గర్నుంచే .. పాతికేళ్లు గడిచిపోయాయి ఇంకా అలానే ఉన్నాను
పెద్దమ్మ: రావాల్సిన సమయం వస్తే అదే తెలుస్తుంది. తను గతంలో ఇంటికి వచ్చేది..నువ్వు వచ్చినప్పటి నుంచీ ఇక్కడకు రావడం మానేసింది. ఫోన్లు తగ్గించేసింది..ఏంటో ఈ పంతాలు పట్టింపులు...

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: రిషి దగ్గరకు వెళ్లిన వసు – చంపేస్తానంటూ రాజీవ్ వార్నింగ్

మరోవైపు అనుపమ కూడా మను గురించే ఆలోచిస్తుంది... నన్ను తలుచుకునేవారు ఎవరూ లేరు సర్ అన్న మను మాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంది. మహేంద్ర వచ్చి ఎన్నిసార్లు పిలిచినా అనుపమ పలకదు...పరధ్యానంలో ఉండిపోతుంది. ఏమైందని మహేంద్ర అడిగినా సమాధానం చెప్పదు. మను ఎవరని మళ్లీ అడుగుతాడు మహేంద్ర..అనుపమ నుంచి సమాధానం ఉండదు..
అనుపమ: మను నీకెలా తెలుసో నాక్కూడా అలానే తెలుసు మహేంద్ర
మహేంద్ర: ఇంకేం లేదా...నువ్వు నువ్వేనా చాలా మారావ్..జగతి విషయంలో నన్ను నిలదీసిన అనుపమవేనా..ఆ అనుపమే అయితే ఇలా సైలెంట్ గా ఉండదు..నువ్వేదో దాస్తున్నావ్..అందుకే నా మాట దాటేస్తున్నావ్
అనుపమ: అదేం లేదు
మహేంద్ర: అబద్ధం చెబుతున్నావ్ కదా...నీకు ఎవరూ లేరని ఎందుకు చెప్పావ్.. ఆ తర్వాత విశ్వనాథం మీనాన్న అని ఏంజెల్ మీ అన్న కూతురు అని పరిచయం చేశావ్
అనుపమ: వాళ్లు నాకు దూరంగా ఉన్నారు కదా..
మహేంద్ర: నువ్వు దూరంగా ఉన్నావని ఉన్న వాళ్లు లేరని ఎలా అనుకుంటావ్
అనుపమ: అలా అనుకోపోతే నేను దూరంగా ఉండలేను..లేదంటే నా మనసుకి నేను సర్దిచెప్పుకోలేను . కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవ్
మహేంద్ర: నీకు పెళ్లి కాలేదన్నావ్ అదైనా నిజమేనా...
అనుపమ: లేదు...నేను ఒంటరిగానే ఉన్నాను ఉంటాను కూడా..
మహేంద్ర: మొన్న మనుని చూసి ఎందుకంత ఏమోషనల్ అయ్యావ్...మీ ఇద్దరి మధ్యా ఏదో బంధం ఉంది అనిపిస్తోంది..
అనుపమ:  ఆ ప్లేస్ లో ఎవరున్నా అలానే చేస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది....
మీ ఇద్దరి మధ్యా బంధం ఏంటో తెలుసుకుంటా అనుకుంటాడు మహేంద్ర

Also Read: ఈ రాశులవారు రిస్క్ తీసుకోవాల్సిందే - మార్చి 05 రాశిఫలాలు

రాజీవ్-శైలేంద్ర
శైలేంద్ర వెళుతుండగా..రాజీవ్ బైక్ అడ్డుపెడతాడు.. ఏంటి పొద్దుపొద్దున్నే కారుకి అడ్డం పడ్డావ్ అని అడుగుతాడు. వసుధార-మను ఇద్దరూ బస్తీ విజిట్ కి వెళ్లినప్పుడు వాళ్లకి కొన్ని పిక్స్ తీస్తాడు రాజీవ్. వసుధార పక్కన నేనుండాలి కదా మరి మను ఎందుకున్నాడు ...వాడితో కలసి ఎందుకు తిరుగుతోందంటూ ప్రశ్నలు వేస్తుంటాడు. వసుధారకోసమే బతికాను కానీ మనుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు..ఆ మనుగాడి చాప్టర్ క్లోజ్ చేస్తాను...ఈ ఫొటోస్ ని పోస్టర్లుగా వేసి కాలేజీ మొత్తం అతికిస్తాను...అప్పుడు ఆ మను గాడిని కాలేజీ నుంచి గెంటేస్తారు..వసు ఒంటరిది అయిపోతుంది..అప్పుడు నేను తోడవుతాను... ప్లాన్ బాగానే ఉంది వర్కౌట్ అవుతుందంటావా అని శైలేంద్ర అడిగితే...నేను వేసే ప్లాన్ ఫెయిల్ అవదని బిల్డప్ ఇస్తాడు...

వసుధార-ఏంజెల్
ఏంటి రమ్మన్నావ్ వసుధార అంటూ ఏంజెల్ వస్తుంది. నీతో ఓ విషయం మాట్లాడాలి అంటుంది. దేని గురించో చెప్పు అంటుంది. 
వసు: మను గురించి నీకు తెలుసా ..తను ఎవరు..తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి..ఇంతకు ముందు ఏం చేసేవారు
ఏంజెల్: నాకు అవేమీ తెలియదు..నువ్వే కదా పరిచయం చేశావ్ అంతే తెలుసు
ఇంతలో మను అటువైపు నుంచి వెళుతూ వాళ్ల మాటలు వింటాడు...మనుని చూసి వసు షాక్ అవుతుంది..
గుప్పెడంత మనసు ఎపిసోడ్ ముగిసింది....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget