అన్వేషించండి

Guppedantha Manasu January 4th Episode: పులొచ్చింది కానీ మేక తప్పించుకుంది - రిషిధార జర్నీ మళ్లీ మొదలైంది!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి - వసుధార మళ్లీ ఒక్కటయ్యారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu January 4th Episode:  (గుప్పెడంతమనసు జనవరి 04 ఎపిసోడ్)

వ‌సుధార కిడ్నాప్ అయిన విష‌యం పెద్ద‌మ్మ ద్వారా తెలుసుకున్న రిషి ఆ విష‌యం తండ్రికి చెబితే టెన్షన్ పడతాడని..ముకుల్ కి కాల్ చేయాలి అనుకుంటాడు. వ‌సుధార నంబ‌ర్ నుంచి రిషి ఫోన్ చేయ‌డం చూసి ముకుల్ షాక‌వుతాడు. అదే విష‌యం రిషిని అడుగుతాడు. వ‌సుధార వ‌చ్చి త‌న‌ను క‌లిసింద‌ని ముకుల్‌తో చెప్పి..ఆమె ప్రమాదంలో ఉందని చెబుతాడు. ప్రతిసారీ ఇలా చేసి రిస్క్ లో పడుతున్నారు...మీ దగ్గరకు వచ్చేముందు నాకు ఒక్కమాటైనా చెప్పి ఉండాల్సింది అంటాడు ఆ తర్వాత వసుధార దగ్గరకు బయలుదేరుతాడు. 

వసుని కాపాడిన ముకుల్
వ‌సుధార‌ను కిడ్నాప్ చేసి క‌ట్టిప‌డేసిన రౌడీలు..బయట ఆడుకుంటూ ఉంటారు. మరోవైపు శైలేంద్ర వస్తూ వస్తూ..ఈ సారి నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు, నాకు ఎండీ సీట్ ఇస్తే నీకు, రిషికి ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని మ‌న‌సులో అనుకుంటాడు. ఇంతలో వ‌సుధారకు స్పృహ వ‌స్తుంది. శైలేంద్ర‌నే త‌న‌ను కిడ్నాప్ చేశాడ‌ని అర్థం చేసుకుంటుంది. ఎండీ సీట్ కోస‌మే శైలేంద్ర ఈ పని చేసి ఉంటాడు..ఇప్పుడు ఇక్క‌డ‌కు వ‌చ్చి అగ్రిమెంట్ పేప‌ర్స్‌పై త‌న‌తో త‌ప్ప‌కుండా సంత‌కం చేయించుకుంటాడ‌ని భ‌య‌ప‌డుతుంది. ఇంతలో ముకుల్ ఎంట్రీ ఇస్తాడు. రౌడీల‌ను చిత‌క్కొట్టి వ‌సుధార‌ను సేవ్ చేస్తాడు. వ‌సుధార‌ను అక్క‌డి నుంచి పంపిస్తాడు. వ‌సుధార‌ను కిడ్నాప్ చేయ‌మ‌ని చెప్పింది ఎవ‌రో త‌న‌కు ఇప్పుడే చెప్పాల‌ని రౌడీల‌ను బెదిరిస్తాడు  మాతో డీల్ కుదుర్చుకున్న వ్య‌క్తి పేరు త‌మ‌కు తెలియ‌ద‌ని  చెబుతారు. శైలేంద్ర కాల్ చేయడంతో..వసుధార ఇక్కడే ఉందనే అబద్ధం చెప్పిస్తాడు ముకుల్. వాడెవడో నాకు తెలుసు ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా దొరకబోతున్నాడని అనుకుంటాడు ముకుల్.

Also Read: వసు కిడ్నాప్, రిషి చేతిలో ఫోన్ - శైలేంద్ర కుట్రకు ధరణి చెక్ పెడుతుందా!

శైలేంద్ర కి ఫణీంద్ర క్లాస్
మరోవైపు శైలేంద్రకి కాల్ చేస్తుంటుంది ధరణి... కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర. ఏదో కుట్ర చేస్తున్నట్టున్నాడు ఎలాగైనా ఆపాలి అనుకుని మళ్లీ మళ్లీ కాల్ చేస్తుంటుంది. ఇంతలో దేవయాని వచ్చి పదే పదే ఎందుకు విసిగిస్తున్నావని క్లాస్ వేస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన ఫణీంద్ర...ధ‌ర‌ణి ఫోన్ నుంచి శైలేంద్ర‌కు కాల్ చేస్తాడు. ధ‌ర‌ణినే అనుకుని బుద్ది లేదా అంటూ మాట‌లు జారుతాడు. కాల్ క‌ట్ చేసినా ఎందుకు ప‌దేప‌దే ఫోన్ చేస్తున్నావ‌ని అరుస్తాడు. అటువైపు నుంచి ధ‌ర‌ణి వాయిస్ కాకుండా తండ్రి వాయిస్ వినిపించ‌డంతో శైలేంద్ర షాక‌వుతాడు. ధ‌ర‌ణిపై ఎందుకు కొప్ప‌డుతున్నావ‌ని కొడుకుపై ఫైర్ అవుతాడు. ధ‌ర‌ణి ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయ‌డం లేద‌ు, ఎక్క‌డికి వెళ్లావ‌ని క్లాస్ ఇస్తాడు. చిన్న మీటింగ్ ఉండి వచ్చానని అబద్ధం చెబుతాడు శైలేంద్ర..వెంట‌నే ఇంటికి తిరిగి ర‌మ్మ‌ని చెప్పి, ఇంకోసారి ధ‌ర‌ణిపై కొప్ప‌డితే బాగుండ‌ద‌ని వార్నింగ్ ఇస్తాడు ఫణీంద్ర...

Also Read: గుప్పెడు గుండెకు పండగ ఈ వేళ - ఒక్కటైన రిషిధార ఇక శైలేంద్ర కౌంట్ డౌన్ మొదలు!

శైలేంద్రకి భద్ర సమాచారం
వ‌సుధార‌ను కిడ్నాప్ చేసిన ప్లేస్‌కు వెళ్లిన భ‌ద్ర ...అక్క‌డ ముకుల్‌ను చూసి షాక‌వుతాడు. ఆ విష‌యం శైలేంద్ర‌కు ఫోన్ చేసి చెబుతాడు. ఇక్క‌డికి వ‌స్తే ముకుల్‌కు నువ్వు దొరికిపోతావ‌ని హెచ్చ‌రిస్తాడు. కానీ భ‌ద్ర మాట‌ల‌ను శైలేంద్ర న‌మ్మ‌డు. కావాల‌నే అబ‌ద్ధం చెబుతున్నాడ‌ని అనుకుంటాడు. ఎప్పటిలా చెలరేగిపోతుంటాడు. మీకు చెప్పేది అర్థం కావడం లేదా..మీరొస్తే మీకే ప్రమాదం అని హెచ్చరిస్తాడు. అయినా శైలేంద్ర మాత్రం వినడు.  నీ కోస‌మే ముకుల్ ప్లాన్ చేసి వెయిట్ చేస్తున్నాడ‌ు..కారు యూ టర్న్ తీసుకుని వెళ్లకపోతే వచ్చిన కార్లోనే నిన్ను జైలుకి తీసుకెళ్లిపోతాడని హెచ్చరిస్తాడు. నీకెలా తెలుసని శైలేంద్ర అంటే..నేను స్పాట్ లోనే ఉన్నాను ముకుల్ కి కనిపించకుండా దాక్కున్నానంటాడు. రౌడీలు ఎక్క‌డ త‌న పేరు చెబుతాడోన‌ని శైలేంద్ర భ‌య‌ప‌డ‌తాడు. వారిని ముకుల్ ద‌గ్గ‌ర నుంచి తాను త‌ప్పిస్తాన‌ని శైలేంద్ర‌కు హామీ ఇస్తాడు భ‌ద్ర‌. ఓ పొగ బాంబ్ రూమ్‌లో వేసి ముకుల్ బారి నుంచి రౌడీల‌ను త‌ప్పిస్తాడు.

Also Read: సంక్రాంతికి అందరూ ఊరెళ్లిపోవాలి అనుకుంటారెందుకు!

రిషిధార తిరుగు ప్రయాణం
ముకుల్ సాయంతో రౌడీల ద‌గ్గ‌ర నుంచి బ‌య‌ట‌ప‌డిన వ‌సుధార రిషి ద‌గ్గ‌ర‌కు వెళుతుంది. తనని తీసుకుని ఇంటికి బ‌య‌లుదేరుతుంది. చాలా రోజుల త‌ర్వాత రిషితో క‌లిసి కారులో జ‌ర్నీ చేయ‌డం చూసి వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది. ఆ కారుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటుంది. మెమొరీస్ అన్నీ గుర్తుచేసుకుంటుంది. మీరు ఎలా కిడ్నాప్ అయ్యార‌ని రిషిని అడుగుతుంది వ‌సుధార‌. 
రిషి: నేను ఆ రోజు హాస్పిటల్ దగ్గర కారు పార్కింగ్ చేస్తుండగా...ఓ అప‌రిచిత వ్య‌క్తి  ఫోన్ చేశాడు. జ‌గ‌తి హ‌త్య గురించి మీకు స‌రైన ఇన్ఫ‌ర్మేష‌న్ ఇస్తాన‌న్నారు. పక్కనే ఉన్న ఓల్డ్ బిల్డింగ్ దగ్గరకు రమ్మన్నారు. నా ఫేస్ కవర్ చేసి కొట్టి కిడ్నాప్ చేసారు. ఓ డార్క్ రూమ్ లో కట్టిపడేశారు. అక్కడి నుంచి తప్పించుకునే టైమ్ లో చాలామంది నా వెంటపడ్డారు. ఆ టైమ్ లోనే ఫోన్ మిస్సైంది. వాళ్లు నాపై అటాక్ చేశారు. వాళ్లతో ఫైట్ చేసే సమయంలోనే అనుకోకుండా కాలు స్లిప్ అయి ఫారెస్ట్ లోయలో పడిపోయానని చెబుతాడు. 

ఎపిసోడ్ ముగిసింది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదేనటి కస్తూరి అరెస్ట్‌, 14 రోజుల రిమాండ్నయన్‌కి ధనుష్ లాయర్ నోటీసులు, పోస్ట్ వైరల్సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget