అన్వేషించండి

Guppedantha Manasu January 2nd Episode: గుప్పెడు గుండెకు పండగ ఈ వేళ - ఒక్కటైన రిషిధార ఇక శైలేంద్ర కౌంట్ డౌన్ మొదలు!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. రిషి - వసుధార మళ్లీ ఒక్కటయ్యారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu January 2nd Episode:  (గుప్పెడంతమనసు జనవరి 02 ఎపిసోడ్)

రిషి నుంచి కాల్ రావడంతో హడావుడిగా బయలుదేరుతుంది వసుధార. శైలేంద్రకి డౌట్ వస్తుంది. మరోవైపు వసు క్యాబిన్లోకి వచ్చిన మహేంద్ర, ఫణీంద్ర ఇద్దరూ క్యాబిన్లో వసుధార లేకపోవడంతో ఎక్కడికి వెళ్లిందో ఏమో అనుకుంటారు. కాల్ చేయమని ఫణీంద్ర చెప్పినా మహేంద్ర వద్దులే అన్నయ్యా తనేచెబుతుంది అంటాడు. ఇదంతా చాటునుంచి విన్న శైలేంద్ర...వసుధారకి కచ్చితంగా రిషి గురించి ఏమైనా తెలిసి ఉంటుంది అనుకుంటాడు. ఆ తర్వాత ఎండీ క్యాబిన్లో రిషి ఛైర్ చూసి మ‌హేంద్ర ఎమోష‌న‌ల్ అవుతాడు. ఫణీంద్ర ధైర్యం చెబుతాడు. జగతి ప్రేమే రిషిని కాపాడుతుంది..తనని తప్పకుండా కాపాడుతుంది, ఆ నమ్మకం నాకుందని చెబుతాడు. ఆ నమ్మకంతోనే నేను ఊపిరి తీసుకుంటున్నా అనుకుంటాడు మహేంద్ర...

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ : వసుధారకు ఫోన్ చేసిన రిషి - ఆ విషయం కనిపెట్టేసిన శైలేంద్ర

వ‌సుధార‌ను అనుక్ష‌ణం ఫాలో క‌మ్మ‌ని భ‌ద్ర‌కు చెబుతాడు శైలేంద్ర‌. కానీ వ‌సుధార బ‌య‌ట‌కు వెళ్లినా కానీ భ‌ద్ర కాలేజీలోనే క‌నిపించ‌డంతో మళ్లీ నోటికొచ్చినట్టు మాట్లాడతాడు శైలేంద్ర. వసుధార కాలేజీలోనే ఉంది కదా భద్ర అంటే..ఏదో కాల్ వచ్చి వెళ్లిపోయిందంటాడు. అవునా అని భద్ర షాక్ అవుతాడు. నీ పనిపై దృష్టిపెట్టు అని ఫైర్ అవుతాడు. 
శైలేంద్ర: వ‌సుధార ఫోన్ మాట్లాడి ఎవ‌రికి చెప్ప‌కుండా వెళ్లిందంటే రిషిని క‌ల‌వ‌డానికే వెళ్లి ఉంటుంది. అదే నిజం అయి ఉంటుంది. కచ్చితంగా రిషి కోసమే వెళ్లి ఉంటుంది నువ్వు తనని ఫాలో అవ్వు..ఇంతకుముందు ఏవేవో సాకులు చెప్పావ్..ఈసారి అలా ఏసాకూ చెప్పకుండా పనిచేయి. వసుధార రిషిని కలిస్తే...ఇద్ద‌రిని అక్క‌డే చంపు. లేదంటే వ‌సుధార ఒంట‌రిగా క‌నిపించినా ఆమెను చంపిన త‌ర్వాతే రా. ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇవ్వు. 
సరే అని వెళతాడు భద్ర...

రిషిని వెతుక్కుంటూ పెద్ద‌య్య‌ చెప్పిన చోటికి క్యాబ్ లోకి వ‌స్తుంది వ‌సుధార‌. దార్లో వస్తూ రిషి తనతో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటుంది. కానీ పెద్ద‌య్య ద‌గ్గ‌ర ఫోన్ లేక‌పోవ‌డంతో  అడ్రెస్ తెలుసుకోవ‌డం క‌ష్టం అవుతుంది.  పెద్ద‌య్య త‌న‌తో మాట్లాడిన నంబ‌ర్‌కు కాల్‌ చేస్తుంది. అది ఓ షాప్ ఓన‌ర్ నంబ‌ర్ కావ‌డంతో తనని పెద్ద‌య్య అడ్రెస్ అడుగుతుంది. తను ఇప్పటివరకూ వెయిట్ చేసి వెళ్లాడు..వస్తాడేమో కూర్చోండి అంటాడు. షాప్ దగ్గర వెయిట్ చేస్తున్న వసుధారని గమనిస్తారు తనని ఫాలో అవుతున్న రౌడీలు. రిషి సార్ ని కలవడానికి వస్తే ఇలా జరుగుతోంది ఏంటి, పరిస్థితులు ఇప్పుడు కూడా నాకు సహకరించడం లేదేంటి అనుకుంటూ పదే పదే షాప్ వాడిని అడుగుతుంది. అయినా పెద్దయ్యతో మీకు పనేంటని షాప్ వాడు అడిగితే..ఏమీలేదు చిన్న పని అంటుంది. ఇంతలో పెద్దయ్య అక్కయ్య వస్తాడు. 

Also Read: రిషి సిద్ధమవుతున్నాడు, జస్ట్ మిస్సైన భద్ర - శైలేంద్రకి టైం దగ్గరపడినట్టే!

పెద్దయ్య-వసుధార
నువ్వేనా వసుధార అంటే అని అడుగుతాడు. రిషి త‌న ద‌గ్గ‌రే ఉన్నాడ‌ు..మనిషి బలహీనపడిపోయాడు, నీకోసం ఒకటే కలవరిస్తున్నాడు బిడ్డ.. తనకి నీ పేరు తప్ప మరో ధ్యాస లేదు రా బిడ్డా పోదాం అని తీసుకెళ్తాడు. వాళ్లని ఫాలో అవుతారు రౌడీలు..

రిషి  - పెద్దమ్మ
వ‌సుధార‌ ఇంకా రాలేదేంటి నేను వెళ్లి చూస్తే అనుకుంటూ లేచేందుకు ట్రై చేస్తాడు..కానీ లేవలేకపోతాడు. పెద్దయ్య వెళ్లాడు కదా ఆయనే వెంటబెట్టుకుని తీసుకొస్తాడులే అని ధైర్యం చెబుతుంది పెద్దమ్మ. నేను నడవగలను అనిపిస్తోంది, చిన్నగా నడుచుకుంటూ వెళతాను అంటాడు. నువ్వు నిల్చోవడమే మంచిది కాదు అలాంటిది నువ్వు నడుస్తానంటున్నావేంటి..నీ గాబరా నేను అర్థం చేసుకోగలను కానీ కొద్దిసేపు ఉండు.. ఈడ దాకా వస్తానని చెప్పింది కదా కచ్చితంగా వస్తుంది..నాక్కూడా నీ భార్యని చూడాలని ఉందని పెద్దమ్మ చెబుతుంది. నేను పోయి చూసి వస్తాను నువ్వు మాత్రం కదలొద్దు అని చెప్పి వెళుతుంది. 

Also Read: ఈ రాశివారు ఒక్కసారిగా సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు, జనవరి 02 రాశిఫలాలు

నువ్వేం చేస్తావు, రిషి ఏం చేస్తాడంటూ వివరాలు అన్నీ అడిగి తెలుసుకుంటాడు పెద్దయ్యా. రిషి గురించి గొప్పగా చెబుతుంది వసుధార.  తమను ఫాలో అవుతున్న రౌడీలను వసుధార గమనిస్తుంది..వారికి క‌నిపించ‌కుండా దాక్కుంటుంది. అక్క‌డే ఉన్న క‌ర్ర‌తో రౌడీ త‌ల‌పై ఒక్క‌టి గ‌ట్టిగా కొడుతుంది. రౌడీ బాధ‌తో విల‌విల‌లాడుతుండ‌టంతో దొర‌క్కుండా అక్క‌డి నుంచి త‌ప్పించుకుంటుంది. ఇంతలో రిషి వసుధార వచ్చింది పెద్దమ్మా అంటాడు. రాలేదు బిడ్డా అని పెద్దమ్మ అంటుంది. నాకు తెలుసు పెద్దమ్మా తనే వచ్చిందంటాడు రిషి. ఇంతలో డోర్ సౌండ్ వినిపిస్తుంది. నిజమే బిడ్డా చూడకుండా ఎలా చెప్పావ్ అంటే..నా మనసుకి అర్థం అవుతుంది పెద్దమ్మా అంటాడు... రిషిని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. గుండెలపై వాలిపోతుంది...
ఎపిసోడ్ ముగిసింది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదేనటి కస్తూరి అరెస్ట్‌, 14 రోజుల రిమాండ్నయన్‌కి ధనుష్ లాయర్ నోటీసులు, పోస్ట్ వైరల్సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget